తాగినంత మందు.. పర్సునిండా నోట్లు! దుబ్బాక ఓటర్లకు పండుగ 

Publish Date:Nov 2, 2020

Advertisement

తెలంగాణలో కాక రేపుతున్న దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రలోభాలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుండగా.. పార్టీలన్ని ఓటర్ల ప్రసన్నం కోసం చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గతంలోఎప్పుడు లేనంతగా మందు, మనీ ప్రవాహం సాగుతోందని తెలుస్తోంది.  ఓటర్లకు జోరుగా ప్రలోభాలకు దిగుతున్నాయని చెబుతున్నారు. దీంతో దుబ్బాక నియోయజకవర్గంలో ఎక్కడ చూసినా పార్టీలిచ్చే పంపకాలపైనే చర్చ జరుగుతోంది. 

 

ప్రలోభాల పర్వంలో అధికార పార్టీ అంతా సైలెంట్ గా పని కానిచ్చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని రోజుల ముందే గ్రామాలకు డబ్బులు, మందును చేరవేసిన టీఆర్ఎస్ పార్టీ  పక్కా ప్రణాళిక ప్రకారం వాటిని ఓటర్లకు సరఫరా చేస్తుందని చెబుతున్నారు. ఇందుకోసం యాబై మంది ఓటర్లకో ఇంచార్జ్ ని అధికార పార్టీ నియమించిందని తెలుస్తోంది. కుల సంఘాలు, మహిళా సంఘాలు, రైతులు, యువత .. ఇలా గ్రూపులుగా విడగొట్టి గంపగుత్తగా ఓట్లను  కొనుగోలు చేస్తుందని చెబుతున్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని మెజార్టీ గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీసీలు టీఆర్ఎస్ పార్టీ వాళ్లే ఉన్నారు. దీంతో డబ్బు పంపిణి వారికి ఈజీగా మారిందని చెబుతున్నారు. 

 

దుబ్బాక ఉప ఎన్నిక  ప్రచారంలో అధికార పార్టీకి ధీటుగా కనిపించిన బీజేపీ,,, తాయిలాల విషయంలో మాత్రం వెనకబడిందని చెబుతున్నారు. డబ్బుల పంపిణికి ప్రయత్నాలు చేసినా...  ఆ పార్టీకి వరుస షాకులు తగిలాయి. ఆదివారం హైదరాబాద్ బేగంపేటలో కోటి రూపాయల నగదు పట్టుబడగా.. అది బీజేపీ అభ్యర్థికి సంబంధించిన డబ్బుగా తేలింది. కారులో కోటి రూపాయలు తరలిస్తుండగా పట్టుకున్నామని, దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బావమరిదిని అరెస్ట్ చేశామని హైదరాబాద్ సీపీ ప్రకటించారు. పోలింగ్ కు కొన్ని గంటల ముందు కోటి రూపాయలు పట్టుబడటంతో బీజేపీ నేతలు షాకయ్యారని చెబుతున్నారు. నాలుగు రోజుల క్రితమే సిద్ధిపేటలోని రఘునంందన్ రావు మామ ఇంట్లో జరిగిన సోదాల్లో 18 లక్షలు పట్టుబడ్డాయి. అంతకుముందు దుబ్బాక శివారులో పట్టుబడిన  డబ్బుులు కూడా బీజేపీ నేతలవేననే అనుమానాలు ఉన్నాయి. ఇలా వరుసగా షాకులు తగలడంతో బీజేపీ అభ్యర్థికి పంపకాలు కష్టంగా మారాయనే చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది. 

 

దుబ్బాకపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ కూడా పంపకాలను భారీగానే చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే  అన్ని గ్రామాల్లో బలమైన నాయకత్వం లేకపోవడంతో కాంగ్రెస్ కు కొంత ఇబ్బంది అవుతుందని తెలుస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ప్రచారాన్ని హోరెత్తించిన నేతలంతా వెళ్లిపోవడం, లోకల్ లీడర్లు అంతంతమాత్రంగానే ఉండటంతో .. ప్రజల్లో తమవైపు సానుకూలత ఉన్నా.. ఓటుగా మలుచుకోలేకపోతున్నామనే ఆందోళన హస్తం నేతల్లో వ్యక్తమవుతోంది. 

 

దుబ్బాక ఉప ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు  పోలీసుల తనిఖీల్లో దాదాపు 2 కోట్ల వరకు నగదు దొరకగా... అందులో ఎక్కువ భాగం విపక్ష పార్టీలకు సంబంధించిన నేతల దగ్గరే దొరికిందని తెలుస్తోంది. దీనిపైనే పోలీసులపై ఆరోపణలు వస్తున్నాయి. అదికార పార్టీ నేతలు దర్జాగా  డబ్బులను తరలిస్తున్నా, ఓటర్లకు పంచుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని, ప్రతిపక్ష నేతలపై మాత్రం నిఘా పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు , స్థానికుల అధికారుల సహకారంతో గులాబీ నేతలు గుట్టుగా ప్రలోభాల పర్వం కొనసాగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

By
en-us Political News

  
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.