Publish Date:Jul 30, 2022
పాకిస్థాన్ లో ఆర్థిక సంక్షోభ తీవ్రతకు అద్దం పట్టే ఉదంతమింది. ఆ దేశంలో నిత్యావసరాలు ఆశాసానికి అంటుతున్నాయి. సామాన్య జనం బతకడానికే రోజూ లాటరీ కొట్టాల్సిన పరిస్థితి ఉందని అంతర్జాతీయ మీడియా పుంఖాను పుంఖాలుగా కథనాలు ప్రచురిస్తోంది.
ఆ దేశంలో మనుషులకే అంతటి దురవస్థ ఉంటే ఇక జంతువుల పరిస్థితి గురించి చెప్పనే అక్కర్లేదు. అందులోనూ జంతు ప్రదర్శన శాలలను ఎలా నిర్వహిస్తున్నారు. అందులోని వన్య ప్రాణులకు తిండి ఎలా పెడుతున్నారు అన్న సందేహం రాక మానదు. ఆ సందేహానికి వాళ్లేం చేస్తున్నారో తెలిస్తే సమాధానం దొరుకుతుంది. జూలో జంతువులను అయిన కాడికి అమ్మేస్తున్నారు. ఔను ఇది నిజం. పత్రికలలో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చి మరీ విక్రయాలు చేస్తున్నారు. ఆసక్తి ఉన్న వారు వచ్చి జంతువులను కొనుక్కోండొహో అని చాటింపూ వేస్తున్నారు.
ఇందుకు లాహోర్ లోని ఓ జూ ఇచ్చిన ప్రకటనే ప్రత్యక్ష సాక్ష్యం లాహోర్ లో లయన్ సఫారీ జూ ఉంది. అది 142 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో దాదాపు 40 సింహాలూ, ఇతర వన్య ప్రాణులూ ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా ఈ జూ నిర్వహణ కష్టం అవ్వడంతో జూలో జంతువులు ఆకలితో అలమటించి ప్రాణాలు కొల్పోయే పరిస్థితి తలెత్తింది. దీంతో ఆ జూ సింహాలను విక్రయానికి పెట్టింది. వాటి విక్రయంతో వచ్చిన సొమ్ముతో కనీసం ఇతర వన్య ప్రాణులనైనా బతికించుకోవచ్చని తలపోసింది.
వెంటనే ఆచరణలో పెట్టేసింది. జూలోని మొత్తం సిహాలలో 15 సింహాలను విక్రయించేందుకు ప్రకటన విడుదల చేసింది. ఒక్కో సింహం ధర 1.5లక్షల రూపాయలుగా నిర్ణయించింది. ఈ ధర పాకిస్థాన్ లో గేదెల ధర కంటే తక్కువ. దీంతో పలువురు సంపన్నులు వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lions-for-sale-in-pakistan-sa-cheap-as-one-and-half-lac-rupees-25-140870.html
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.