జెన్ జడ్ ఉద్యమానికి పరిమిత మద్దతు.. రాహుల్ చేజార్చుకున్న అవకాశం.!

Publish Date:Jul 21, 2026

Advertisement

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత కొన్ని రోజులుగా  యువత చేపట్టిన ఉద్యమానికి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించడంలో కాంగ్రెస్ వెనుకబడిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.  కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలకు వ్యతిరేకంగా ఇండియాలో జన్ జడ్ చేపట్టిన అతి పెద్ద ఆందోళనను అవకాశంగా మలచుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ కీలక నేత, లోక్ సభలో ప్రధాన పత్రిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ యువత ఉద్యమం విషయంలో స్పందించిన తీరు, ప్రకటించిన పరిమిత మద్దతు కాంగ్రెస్ కు అందివచ్చిన బంగారు అవకాశాన్ని ‘చే’జారేలా చేశాయన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. ఈ ఉధృత పోరాటాన్ని నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళ్లేందుకు  యువత  పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చిన తరువాత కూడా.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, ఆ పార్టీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ వారికి మద్దతుగా కేంద్రాన్ని నిలదీయడంలోవిఫలమయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఢిల్లీ వేదికగా మారుమోగుతున్న  యువత  ఉద్యమానికి ప్రధాన రాజకీయ పక్షాలన్నీ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఆప్ అధినేత అరవిద్ కేజ్రీవాల్,   జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వంటి  నేతలైతే..  స్వయంగా జంతర్ మంతర్ వద్దకు వెళ్లి ఆందోళన నిర్వహిస్తున్న యువతను కలిసి  సంఘీభావం ప్రకటించారు. అయితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాత్రం జంతర్ మంతర్ నిరసన శిబిరానికి వచ్చి యువతకు సంఘీభావం తెలపలేదు. ఇదే విషయం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.  పోలీసుల చర్యలు, ఉద్రిక్తతల మధ్య గాయపడిన కొందరు యువకులను ఆసుపత్రికి వెళ్లి పరామర్శించినప్పటికీ రాహుల్ గాంధీ..  ఆందోళన జరుగుతున్న జంతర్ మంతర్ వద్దకు వెళ్ల లేదు.  కేవలం మీడియా ముందు మాట్లాడటానికి, ప్రకటనలు విడుదల చేయడానికి మాత్రమే ఆయన పరిమితమయ్యారు.   ప్రభుత్వంపై సమరశంఖం పూరించిన యువజనంతో  నేరుగా మమేకం కాకుండా  మద్దతు ప్రకటనలకు పరిమితం కావడం ద్వారా పొలిటికల్ మైలేజీకి ఈ ఉద్యమాన్ని ఊతం చేసుకోవడంతో కాంగ్రెస్ విఫలమైందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.  

దేశంలోనే అతిపెద్ద ఓటు బ్యాంకుగా ఉన్న యువతలో నెలకొన్న ఆందోళనను, వారి ఆగ్రహాన్ని సరైన దిశలో నడిపించగలిగితే ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీకి అపారమైన రాజకీయ ప్రయోజనం లభించేది. అదే సమయంలో ఒక జాతీయ స్థాయి అగ్రనేత తమ మధ్యకు వస్తే, పోరాటం చేస్తున్న యువకులకు సైతం కొండంత అండ లభించేది. ఈ పరిణామం ఉభయతారకంగా ఇరు వర్గాలకు ఎంతో ఉపయోగపడేది. కానీ, రాహుల్ గాంధీ జంతర్ మంతర్‌కు వెళ్లకుండా దూరంగా ఉండటం వల్ల ఆందోళనకు కావాల్సిన స్థాయిలో ఊపు లభించకపోగా, కాంగ్రెస్‌కు దక్కాల్సిన మైలేజ్ కూడా దక్కకుండా పోతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇంతకుముందు రైతు చట్టాల రద్దు కోసం జరిగిన ఏడాది కాలపు రైతాంగ ఉద్యమంలో కానీ, మణిపూర్ హింసాకాండ బాధితుల పరామర్శలో కానీ రాహుల్ గాంధీ స్వయంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలకు అండగా నిలిచారు. పార్లమెంట్ లోపలా, వెలుపలా ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ దూకుడు ప్రదర్శించారు. గతంలో అనేక సందర్భాల్లో ప్రజా సమస్యలపై స్వయంగా వీధుల్లోకి వచ్చిన రాహుల్, ఇప్పుడు అత్యంత కీలకమైన యువజన సమస్యపై మాత్రం జంతర్ మంతర్ ప్రాంగణానికి దూరంగా ఉండటం విచిత్రంగా కనిపిస్తోంది. మీడియా వేదికలపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించినంత మాత్రాన క్షేత్రస్థాయిలో ఉద్యమ తీవ్రత పెరగదని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రస్తుతం ఢిల్లీ వీధుల్లో జరుగుతున్న ఈ పోరాటం రాబోయే రోజుల్లో పార్లమెంట్ ముట్టడికి దారితీసే అవకాశం కనిపిస్తోంది. ఈ దశలో ప్రతిపక్షాలు క్షేత్రస్థాయిలో నేరుగా పాల్గొనకపోతే, అధికార పక్షం ఈ ఆందోళనలను మరింత సులువుగా అణచివేసే ప్రమాదం ఉందని నిరసనకారులు భావిస్తున్నారు. అధికార ప్రతిపక్షాల నడుమ పార్లమెంట్ సమావేశాల్లో రసాభాస జరుగుతున్న నేపథ్యంలో, వెలుపల ఉవ్వెత్తున లేస్తున్న ప్రజా సమస్యలను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో ప్రతిపక్షం చూపుతున్న మందకొడి వైఖరిపై సొంత పార్టీ వర్గాల్లో కూడా అంతర్గతంగా అసంతృప్తి వ్యక్తమవుతోందని సమాచారం.

ముందుముందు జరగబోయే రాజకీయ పరిణామాల దృష్ట్యా రాహుల్ గాంధీ తన వ్యూహాన్ని మార్చుకుని నేరుగా జంతర్ మంతర్ ఉద్యమ క్షేత్రంలోకి దిగుతారా లేదా అనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. యువత సమస్యలను కేవలం రాజకీయ ప్రసంగాలకే పరిమితం చేయకుండా, స్వయంగా వారితో కలిసి పోరాటంలో పాల్గొంటేనే నిజమైన ప్రతిపక్ష నేతగా ప్రజలలో మరింత నమ్మకం ఏర్పడుతుందని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు. రాబోయే ఎన్నికలు, పార్లమెంట్ లోపల వెలుపల జరగబోయే పోరాటాల దృష్ట్యా కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఇప్పటికైనా స్పందించి ఉపాధి, ఉద్యోగ పోరాటంలో ఉన్న యువతకు నేరుగా అండగా నిలబడుతుందో లేదో వేచి చూడాల్సి ఉంది.

Jantar Mantar Protest Delhi, Rahul Gandhi Youth Protest, Leader of Opposition Strategy, Opposition Leaders Support 

By
en-us Political News

  
కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతగా, చంద్రబాబు ఇప్పుడు హస్తిన పర్యటనలో పార్లమెంటులో ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన మెజారిటీ కూడగట్టడం కోసం.. వివిధ పార్టీల నాయకులతో చర్చలు జరిపేందుకు ఆయన హస్తినకేగుతున్నారన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
మాస్కుల కొరతపై మాట్లాడిన కొద్ది రోజులకే విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం రహదారిపై డాక్టర్ సుధాకర్‌ను పోలీసులుఆయనను అదుపులోనికి తీసుకుని, చొక్కా లేకుండా ఉన్న ఆయన చేతులను వెనక్కి విరిచి కట్టడం, వీధిలో ఈడ్చుకెళ్లి ఆటోలో పడేయడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి జాతీయ స్థాయిలో నిరసనలకు దారితీశాయి.
సదరు వివాదాస్పద ఏఈఈ స్థాయి అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్దుబాట్లు, పోస్టింగ్‌లలో ఆయనకు కీలక స్థానం దక్కింది. ప్రస్తుతం ఆయన టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఏఈఈ హోదాలోనే అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
చట్టపరమైన విచారణ ఎదుర్కొంటున్న నేతలకు రాజకీయ అభయం ఇస్తూ, వారిపై విచారణ అధికార తెలుగుదేశం కూటమి కక్షసాధింపుగా అభివర్ణించే ప్రయత్నం చేయడం జగన్ కు రివాజుగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రగతి ప్రకటనలో భాగంగా ప్రభుత్వం మొత్తం 10 ప్రధాన అంశాలపై ప్రత్యేక నివేదికలు సిద్ధం చేస్తున్నది. గతంలోని అంటే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రబుత్వం కొలువుదీరిన తొలి నాళ్లలో విడుదల చేసిన 7 శ్వేతపత్రాల యాక్షన్ టేకెన్ నివేదికలతో పాటు, అభివృద్ధి , సుపరిపాలన, సంక్షేమం, సాధికారత విభాగాలపై సమగ్ర నివేదికలు విడుదల చేయనుంది. అభివృద్ధి నివేదికలో వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటక రంగాల పురోగతిని పొందుపరచగా, సుపరిపాలన నివేదిక ద్వారా నూతన విధానాలు, డిజిటల్ విప్లవం, వాట్సాప్ గవర్నెన్స్ వంటి సేవల వివరాలను అందించనుంది.
అమర రాజా వంటి గ్లోబల్ టెక్నాలజీ సంస్థ వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏపీలో కాకుండా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పెట్టడం ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీని చేజార్చుకోవడమేనని ప్రముఖ విశ్లేషకుడు సువేరా అన్నారు. తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన రాజకీయం, కులం, ప్రాంతీయ విద్వేషాల కారణాలతో ఇటువంటి పారిశ్రామిక దిగ్గజం రాష్ట్రం వీడాల్సి రావడం వల్ల యువతకు రావలసిన ఉపాధి అవకాశాలు చేజారిపోయాయన్నారు.
ఆ నక్కల కారణంగానే తాను తన మార్గాన్ని ఎంచుకుని బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలోని తన మాజీ సహచరులపై తీవ్ర విమర్శలు గుప్పించిన కవిత.. బీఆర్ఎస్‌లోని కొందరు గుంటనక్కల వంటి నేతల బృందం తనను ఒంటరిని చేసి, పక్కన పెట్టడానికి పద్ధతి ప్రకారం పనిచేశారని కవిత చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ అత్యంత కీలకమైన మలుపుగా మారబోతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అత్యంత ఉత్కంఠభరిత వాతావరణంలో ప్రారంభం కానున్నాయి.
శాంతిభద్రతల విఘాతం కలగకుండా ఉండేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందస్తు భద్రతా వ్యూహంలో భాగంగా సెంట్రల్ ఢిల్లీని దాదాపు తమ అధీనంలోకి తీసుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఈ చలో పార్లమెంట్ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో తనదైన విలక్షణ శైలితో నిత్యం వార్తల్లో నిలిచే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసినట్లేనా.. అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. గత కొంతకాలంగా ఆయన కారు దిగిపోనున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఆ ప్రచారానికి బలం చేకూర్చింది. సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న వేదికపై ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఉన్నారు. ఆ వేదికపై ప్రసంగిస్తున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నా.. మల్లారెడ్డి పట్టించుకోకుండా చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. సొంత పార్టీ అధినేతను అంతగా విమర్శిస్తున్నా మల్లారెడ్డిలో స్పందన లేకపోవడంతో ఆయన కారు దేగేయడం ఖాయమన్న ప్రచారానికి బలం చేకూర్చింది. అలాగే ఇటీవలే.. ఆయన ఒక ప్రైవేటు కార్యక్రమంలో కూడా తాను బీఆర్ఎస్ ను వీడనున్నట్లు సంకేతాలిచ్చారు. వాస్తవానికి.. గత ఎన్నికలలో పరాజయం పాలై బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన నాటి నుంచీ కూడా మల్లారెడ్డి పొలిటికల్ గా ఒకింత ఇనాక్టివ్ అయ్యారనే చెప్పారు. చాలా కాలంగా మల్లారెడ్డి అధికార కాంగ్రెస్ లేదా కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తన వ్యాపార, విద్యారంగ సంస్థల పరిరక్షణతో పాటు నియోజకవర్గంలో రాజకీయ ఉనికి కోసం ఆయన అధికార పార్టీతో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన చామకూర మల్లారెడ్డి.. ఇప్పుడు ఆయన ప్రసంగిస్తున్న వేదికపై కనిపించడం పట్ల కమలం శ్రేణుల్లో కూడా ఆగ్రహం వ్యక్తమౌతోంది. మొత్తం మీద మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడం ఖాయమన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. అయితే ఆయన కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా? కాషాయ తీర్థం పుచ్చుకుంటారా అన్న విషయంపై అయితే రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే అనేకమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు హస్తం గూటికి చేరిన నేపథ్యంలో, మల్లారెడ్డి కూడా అదే బాట పడతారన్న అభిప్రాయమే పరిశీలకులలో కూడా వ్యక్తమౌతోంది. chamakura malla reddy latest news, medchal mla malla reddy, telangana political updates
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ కీలక సమీక్ష నిర్వహించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.