తండ్రి తీరు... పుట్టబోయే పిల్లల్నీ వదలదు

Publish Date:Feb 12, 2019

Advertisement

 

పిల్లల్లో ఏదన్నా లోటుపాట్లు ఉంటే వాటిని తల్లికి ఆపాదించడం చాలా తేలికే! కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేసే పరిశోధనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. పుట్టబోయే పిల్లల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయనే విషయం, వారి తల్లుల మీదే కాదు... తండ్రుల తీరు మీద కూడా ఆధారపడి ఉంటాయని స్పష్టం చేస్తున్నాయి. ఉదాహరణకు అమెరికాలోని జార్జ్‌టౌన్‌ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ పరిశోధననే తీసుకోండి. ఈ విశ్వవిద్యాలయానికి చెందిన డా॥ జోనా కిటలిన్‌స్కా పరిశోధన ప్రకారం... తండ్రిలో తాగుడు, ఆహారపు అలవాట్లు, ఒత్తిడిన ఎదుర్కొనే సామర్థ్యం, వయసు... ఇవన్నీ కూడా వాళ్ల వీర్యకణాలను ప్రభావితం చేస్తాయట. తద్వారా పుట్టబోయే పిల్లల జన్యువుల మీద ప్రభావం చూపుతాయంటున్నారు జోనా. ఈ మార్పు కేవలం ఒక్క తరానికే పరిమితం కాదట. భవిష్యత్‌ తరాలు అన్నింటి మీదా ఈ ముద్ర ఉంటుందని తేల్చి చెబుతున్నారు జోనా.

 

జోనా అంచనా ప్రకారం తండ్రికి మితాహారాన్ని తీసుకునే అలవాటే కనుక ఉంటే, అతని పిల్లల్లో గుండెజబ్బుల సమస్య తక్కువగా ఉంటుంది. అలా కాకుండా వాళ్లు కనుక ఊబకాయులై ఉంటే కనుక, అది వారి పిల్లల్లోని కొవ్వుకణాలను కూడా ప్రభావితం చేస్తుంది. అలాంటి కొవ్వు కణాలతో పుట్టిన పిల్లల్లో మున్ముందు చక్కెర వ్యాధి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. తండ్రుల వయసు కూడా పుట్టబోయే పిల్లల మీద ప్రభావం చూపుతుందట. మరీ లేటు వయసులో జన్మనిచ్చే తండ్రుల వల్ల, పిల్లల మెదడుకి తిప్పలు తప్పవంటున్నారు జోనా. ఆటిజం, స్కిజోఫ్రీనియాతో పాటుగా పుట్టుకలో లోపాలు కూడా ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు. దీనిని బట్టి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలనే మన పెద్దల మాట ఎంత విలువైందో అర్థమవుతోంది కదా! చదువు, కెరీర్‌ అంటూ పెళ్లినీ పిల్లల్నీ వాయిదా వేసుకుంటూ పోతే పుట్టబోయే వారికి ఇబ్బందే!

 

 

పిల్లల మీద తండ్రుల ప్రభావం విషయంలో జోనా సూచిస్తున్న మరో ముఖ్యమైన విషయం తాగుడు. మగవాడికి తాగే అలవాటు ఉంటే కనుక అది అతని పిల్లల మెదడు పరిమాణం మీదా, మేధస్సు మీదా ప్రభావం చూపుతుందట. ఇలా కేవలం శారీరికమైన అలవాట్లే కాదు, తండ్రుల మానసిక ధోరణి కూడా పిల్లల మీద ప్రభావం చూపుతుందని జోనా పరిశోధనలో తేలింది. మగవాడిలో త్వరగా ఒత్తిడికి లోనయ్యే గుణం ఉంటే, అతనికి పుట్టబోయే పిల్లల్లో ప్రవర్తనాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని తేలింది.

 

దండీ విషయం! దీనిబట్టి పిల్లల్ని కనాలనుకునే తల్లులే కాదు, తండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని తేలిపోతోంది. మితమైన ఆహారం, మానసిక ప్రశాంతత, వ్యసనాలకు దూరంగా ఉండటం, వ్యాయామం... ఇవన్నీ కేవలం మన ఆరోగ్యాన్నే కాదు... మనకు పుట్టబోయే పిల్లల జీవితాన్నే ప్రభావితం చేస్తాయని గుర్తుంచుకుంటే చాలు. మంచి జీవనశైలిని గడపాలన్న లక్ష్యం ఏమంత కష్టంగా తోచదు!

- నిర్జర.

By
en-us Political News

  
ఈనాటి వేగవంతమైన జీవనశైలిలో మనకు తెలియకుండానే మనం అనేక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాము. ముఖ్యంగా, నేటి యువతలో సెక్స్ పట్ల ఆసక్తి తగ్గడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారుతోంది. ..
మధుమేహం (Diabetes) ఉన్నవారు చేసే మొదటి పని అన్నం మానేసి చపాతీలు తినడం. మరి నిజంగా చపాతీ తింటే షుగర్ తగ్గుతుందా? అన్నం తింటే పెరిగిపోతుందా? ఈ విషయంలో చాలా మందిలో..
నేటి వేగవంతమైన ఒత్తిడితో కూడిన జీవితంలో ఆందోళన ఒక సాధారణ సమస్యగా మారింది. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కూడా మనసును అశాంతపరిచి, నిద్ర, ఆహరం, రోజువారీ జీవనశైలిపై  ప్రభావం చూపుతాయి...
కాలం మారినా మనిషి జీవన పోరాటం మాత్రం మారదు.  కొందరు కాలంతో పోటీ పడి ఎండ, వాన, చలి వంటి వాటిని లెక్క చేయకుండా సాగుతూ ఉండాలి. లేకపోతే వారితో పాటు వారిని నమ్ముకున్న కుటుంబాలు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.....
వేసవి అంటే మండే ఎండలు, వేడి గాలులు,  చెమటలు పట్టించే వాతావరణం.. ఇవన్నీ ఉంటాయి.  ఇలాంటి రోజుల్లో  రోడ్డు పక్కన అమ్మే చెరకు రసం తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. నిమ్మరసం, నల్ల ఉప్పు, పుదీనా కలపడం వల్ల చెరకు రసం  రుచి మరింత ఇనుమడిస్తుంది...
సాధారణంగా తాంబూలం వేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఆ తాంబూలానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలను జత చేస్తే, అది గుండెను రక్షించే ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుందని..
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై..
నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి మరియు జీవనశైలి కారణంగా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనల్ని నిరంతరం వేధించే ప్రధాన శత్రువులు ఒత్తిడి మరియు ఆందోళన. వీటితో పాటు థైరాయిడ్..
బ్రేక్ ఫాస్ట్ లేదా అల్పాహారం నేటికాలపు జీవనశైలికి చాలా ముఖ్యంగా మారింది.  ఉదయాన్నే అల్పాహారం తప్పకుండా తినాలని వైద్యుల నుండి ఆహార నిపుణుల వరకు ప్రతి ఒక్కరూ చెబుతారు.  అయితే చాలామంది అల్పాహారంలో..
కాలంతో పాటు అన్ని అలవాట్లు అప్డేట్ అవుతూ ఉన్నాయి.  మొదట వేప పుల్లలతో పళ్లు తోమేవారు,  తర్వాత పేస్ట్ లు వచ్చాయి.  ఆ తరువాత పేస్ట్ లలో ఉప్పు, బొగ్గు, లవంగం వంటివి చేరాయి.  అవి కూడా అయ్యాక మౌత్ వాష్ లు వచ్చాయి....
ఆరోగ్యకరమైన శరీరానికి జింక్ చాలా అవసరం. జింక్ కణజాలాలను బాగుచేస్తుందని చెబుతారు. జింక్ ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. చర్మం..
ఇనుప పాత్రలో వంట చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. ఎందుకంటే ఇనుప పాత్రలో వంట చేయడం వల్ల ఆ ఆహారాన్ని ఐరన్ ఖనిజం చేరుతుంది.  దీని వల్ల శరీరానికి ఐరన్ ఎలాంటి సప్లిమెంట్ ..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.