హైదరాబాద్ ఖైరతాబాద్ లోని ఓ అపార్ట్‌మెంట్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. లిఫ్ట్ గుంతలో పడి ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమెతో ఉన్న చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన తో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుము కున్నాయి. ఖైరతాబాద్ లో ని ఆనంద్ నగర్ కాలనీలో ఉన్న భావన అపార్ట్మెంట్ ఐదవ అంతస్తులో నివాస ముంటున్న రాధ(58) అనే మహిళ తన ఏడాది న్నర వయసున్న మనుమడు జియోల్ తో కలిసి లిఫ్ట్ ఎక్కేందుకు ప్రయత్నిం చారు. అయితే కొద్దిసేపు లిఫ్ట్ డోర్ తెరుచు కోకపోవ డంతో ఆమె అక్కడే వేచి ఉన్నారు. తర్వాత మరో సారి డోర్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారు. అదే సమ యంలో లిఫ్ట్ క్యాబిన్ ఐదవ అంతస్తుకు చేరక ముందే డోర్ తెరుచుకోవ డంతో, లోపల ఖాళీ షాఫ్ట్ ఉందని గమనించకుండా రాధ లోపల అడుగు పెట్టారు.
ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోయి ఆమె ఐదవ అంతస్తు నుండి మొదటి అంతస్తులో పడిపోయారు. ఈ ప్రమాదంలో రాధ తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.ఆమె చేతిలో ఉన్న చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్ద శబ్దం రావడంతో అపార్ట్ మెంట్ వాసులు వెంటనే అక్కడికి చేరుకుని రాధ, బాలుడిని లిఫ్ట్ గుంతలో నుండి బయటకు తీశారు. అయితే అప్పటికే రాధ మృతి చెందినట్లు నిర్ధారిం చారు. తీవ్ర గాయాలైన బాలుడిని వెంటనే స్థానిక హాస్పిటల్ కి తరలించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lift-accident-in-khairatabad-36-222077.html
ఒడిశా రాష్ట్రంలో వెలుగుచూసిన ఒక ప్రభుత్వ ఇంజనీర్ అవినీతి ఉదంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
కూకట్‌పల్లి మంజీరా మాల్‌లోని కింగ్ & క్వీన్స్ పబ్ రాత్రి సాధారణంగా హడావుడిగా ఉండే ప్రదేశమే.
గతంలో కంప్యూటర్లు కొత్తగా వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయాలే వ్యక్తమయ్యాయి. కంప్యూటర్లు వస్తే అకౌంటెంట్లు, క్లర్కుల ఉద్యోగాలు పోతాయని అంతా భావించారు. కానీ వాస్తవంగా జరిగిందేమిటి? కంప్యూటర్ల వల్ల పాత ఉద్యోగ పద్ధతులు మారాయి తప్ప ఉద్యోగాలు తగ్గలేదు.. సరికదా మరిన్ని అవకాశాలు వచ్చాయి. సాఫ్ట్‌వేర్ అనే రంగం తెరమీదకు వచ్చింది. కోట్లాది మందికి సరికొత్త ఉపాధి లభించింది.
గచ్చిబౌలిలోని ఓ ఎలైట్ కోలివింగ్‌లో ఒక యువతి తన జీవితానికి చివరి అధ్యాయం రాసుకున్నది.
బీఆర్‌ఎస్ నేత సురేష్ రెడ్డి ఇంట్లో భారీ చోరి జరగడం తో హైదరాబాద్ సనత్ నగర్ జెడ్ కాలనీ ఇప్పుడు ఒక్క సారిగా చర్చల కేంద్రంగా మారింది.
ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తన రష్యా పర్యటనను యథావిధిగా కొనసాగించాలని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. డ్రోన్ల దాడుల వార్త వెలువడే సమయానికి ఆయన మాస్కో నుండి సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు ప్రయాణిస్తున్నారు. అక్కడ నెలకొన్న భద్రతా ఏర్పాట్లు, తాజా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం, లోకేష్ తన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయకూడదని నిశ్చయించుకున్నారు.
మలేషియా దేశంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.
మధ్యతరగతి, సామాన్య కుటుంబాలపై మరోసారి చమురు భారం పడింది.
తమిళనాట బీజేపీకి ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె.అన్నామలై మూడు రోజుల క్రితం రాజీనామా చేశారు.
రంగారెడ్డి జిల్లా కోహెడలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, వ్యవసాయం, సంక్షేమ పథకాలపై విస్తృతంగా మాట్లాడారు.
అమెరికాలోని న్యూయార్క్ సిటీలోలో తెలుగు యువకుడు కుంచా అన్షుల్ దారుణ హత్యకు గురైనాడు.
తెలంగాణ భవన్‌లో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరో పెను సంచలనం చోటుచేసుకుంది.