వివాహబంధంలో ఒక్కటైన జీవిత ఖైదీలు.!.. జైలే కల్యాణ మండపం.!

Publish Date:Jul 23, 2026

Advertisement

వేర్వేరు నేరాలకు పాల్పడి జీవత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వారి ప్రేమ చిగురించిన జైలే.. వారి కల్యాణానికి వేదికగా మారింది.   రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నగరం సమీపంలో ఉన్న మండోర్ ఓపెన్ జైలు ప్రాంగణం బుధవారం (జులై 22)   కళ్యాణ వేదికగా మారింది. వేర్వేరు హత్య కేసుల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు, చట్టబద్ధమైన అనుమతులతో వేద మంత్రాల సాక్షిగా  ఏడడుగులు నడిచి.. కొత్త జీవితాన్ని ప్రారంభించారు.  వివరాలిలా ఉన్నాయి. 

 మూలారామ్,  సీమ  వేర్వేరు సమయాల్లో, వేర్వేరు ప్రదేశాల్లో జరిగిన హత్య కేసుల్లో నేరస్తులుగా రుజువై  యావజ్జీవ శిక్ష  అనుభవిస్తున్నారు. అయితే..    శిక్షా కాలంలో వీరి సత్ప్రవర్తన చూసిన   జైలు అధికారులు ఈ ఇద్దరినీ  సాధారణ జైలు నుండి   మండోర్ ఓపెన్ జైలుకు తరలించింది. ఇక్కడే మూలారామ్, సీమలకు పరిచయం ఏర్పడి, అది స్నేహంగా పెరిగి ప్రేమగా మారింది.  

జీవితాంతం ఒకరికొకరు బాసటగా నిలవాలని, పెళ్లి బంధంతో ఒక్కటి కావాలని నిర్ణయించుకున్న వారిరువురూ విషయాన్ని జైలు అధికారులకు తెలిపారు.  సాధారణ పౌరులలాగా పెళ్లి చేసుకోవడం జైలు శిక్షలో ఉన్న ఖైదీలకు అంత సులువు కాదు. ఇందుకు అనుమతి కావాలి.  దీంతో జైలు అధికారుల సూచన మేరకు   వీరిద్దరూ  రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు.  ఖైదీల పునరావాసం, వారి ప్రాథమిక  హక్కులు, మరియు జైలులో వారు కనబరిచిన సత్ప్రవర్తనను పరిగణనలోనికి తీసుకున్న రాజస్థాన్ హైకోర్టు.. మూలారామ్, సీమల విజ్ణప్తిపై సానుకూలంగా స్పందించింది వివాహానికి అనుమతి ఇవ్వడమే కాకుండా, . వివాహం చేసుకోవడానికి పెరోల్ కూడా మంజూరు చేసింది.  

న్యాయస్థానం ఆమోదముద్ర పడటంతో జోధ్‌పూర్ మండోర్ ఓపెన్ జైలులోనే వీరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను జైలు అధికారులు చేశారు. దీంతో బుధవారం(జులై 22) జైలు ప్రాంగణంలోనే సాంప్రదాయబద్ధంగా వీరు వివాహబంధంలో ఒక్కటయ్యారు. వీరి వివాహవేడుకకు   ఉన్నతాధికారులు,   సిబ్బందితో పాటు పరిమిత సంఖ్యలో బంధువులు, తోటి ఖైదీలు హాజరయ్యారు. 

Jodhpur open jail wedding, life convicts marriage, Mularam Seema prison love story

By
en-us Political News

  
కేటీఆర్ జన్మదిన వేడుకలలో శుక్రవారం (జులై 24నపాల్గొన్న ఆయన తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలన్నీ కేవలం నిరాధారమైన ప్రచారం, వదంతులు మాత్రమేనని స్పష్టత ఇచ్చారు.
తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రతిష్ఠకు భంగం కలిగేలా పింక్ డైమండ్ విషయంలో అవాస్తవాలను ప్రచారం చేశారంటూ గతంలో దాఖలైన పరువు నష్టం కేసు విచారణ ఇప్పుడు తుది దశకు వచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా టీటీడీ జేఈవో వెంకయ్య చౌదరి క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయ్యింది.
ద్యార్థుల హక్కుల కోసం ఒక పోరాట యోధుడిలా నిలబడిన వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కోర్టు ఆదేశాల మేరకు ఆయనను గురుగ్రామ్‌లోని మేదాంతా ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా ఆయన వైద్య చికిత్సను నిరాకరించి నిరశన కొనసాగించడంతో కేంద్రం దిగివచ్చింది.
దీంతో ఆయనను స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఏఐజీ ఆస్పత్రిలో ఆయన మోకాలి గాయానికి గురువారం విజయవంతంగా సర్జరీ జరిగింది.
కాక్రోచ్ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని ఖండించడమే కాకుండా.. దేశ విద్యావ్యవస్థలో ఇంతటి భారీ అక్రమాలు జరిగినా బాధ్యత వహించకపోవడం సరికాదనీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలన్న తమ డిమాండ్ లో ఇసుమంతైనా మార్పు లేదనీ విస్పష్టంగా ప్రకటించింది.
హెర్మూజ్ జలసంధిలో రావాణ స్తంభన, ఎర్రసముద్రంలో ప్రయాణిస్తున్న రెండు సౌదీ ఆయిల్ ట్యాంకర్లపై దాడుల నేపథ్యంలో ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒకే సారి 6 శాతం పైగా పెరిగింది. దీంతో ముడి చమురు బారెల్ ధర వంద డాలర్లకు చేరువైంది.
తాను ఆడిన నాలుగో టి20 ఇంటర్నేషనల్ లోనే ప్రపంచ రికార్డు తిరగరాశాడు. జింబాబ్వేతో హరారే వేదికగా గురువారం (జులై 23) జరిగిన టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ క్రికట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 37 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 18 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధశతకం పూర్తి చేశాడు.
2027 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ WTC ఫైనల్ తేదీలు, వేదికను ఐసీసీ ప్రకటించింది. లార్డ్స్ మైదానాన్ని తప్పించి ది ఓవల్ మైదానంలో జూన్ 9 నుంచి 13 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఫ్లాక్ సేఫ్టీ ఎల్పీఆర్ కెమెరాలు వీడియో రికార్డ్ చేస్తాయా లేదా కేవలం ఫోటోలు తీస్తాయా? కంపెనీ సీఈఓ వ్యాఖ్యలు, లీక్ అయిన పబ్లిక్ రికార్డులతో బయటపడిన సంచలన విషయాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఏఐ విప్లవం వెనుక పొంచి ఉన్న భారీ ఆర్థిక ప్రమాదం! 500 బిలియన్ డాలర్లకు పైగా అప్పులతో ఏఐ డేటా సెంటర్లు 2008 నాటి సబ్‌ప్రైమ్ మోర్ట్‌గేజ్ సంక్షోభాన్ని గుర్తుచేస్తున్నాయి. మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీల గుప్త రుణాలు, పెన్షన్ ఫండ్లకు ఉన్న ముప్పు మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం గురించిన పూర్తి విశ్లేషణ.
పాస్‌వర్డ్ మరచిపోయినా ఇక ఆందోళన అవసరం లేదు! గూగుల్ కొత్తగా తీసుకొచ్చిన సెల్ఫీ వీడియో లాగిన్ ఫీచర్ ద్వారా మీ అకౌంట్‌ను సులభంగా రికవర్ చేసుకోవచ్చు. కేవలం 5 నిమిషాల్లో g.co signin selfie ద్వారా ఈ ఫీచర్‌ను ఎలా సెటప్ చేయాలో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఢిల్లీలో నీట్ NEET పేపర్ లీక్ ఆందోళనలు, నిరసనల ఉధృతి నేపథ్యంలో టీసీఎస్ TCS తమ ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ ఢిల్లీ పిటిఐ బిల్డింగ్ క్యాంపస్ సిబ్బందిని నోయిడా, గురుగ్రామ్ ఆఫీసుల నుంచి పనిచేయాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.