జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తే జీవితం నాశనమే..!

Publish Date:Nov 12, 2024

Advertisement

 


మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించే వ్యక్తుల్లో  సాధారణంగా  తల్లిదండ్రులు ఉంటారు.  తర్వాత జీవిత భాగస్వామి కూడా అంతే ప్రభావం చూపిస్తారు., వాస్తవానికి ఇంకా ఎక్కువనే చెప్పాలి. మూడొంతుల మీ జీవితం ఎలా ఉండబోతుందనేది   జీవిత భాగస్వామి మీదనే ఆధారపడి ఉంటుంది. మీ తల్లిదండ్రులు ఎవరనేది నిర్ణయించుకునే అవకాశం మీకుండదు,  కానీ మీ జీవిత భాగస్వామి ఎవరనే  నిర్ణయం తీసుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంటుంది.  ఈ నిర్ణయం జీవితంలో ఎవరికయినా  చాలా ముఖ్యమైనదే అవుతుంది. అందులో ఏమాత్రం పొరపాటు జరిగినా జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అందుకే బాగా ఆలోచించి మరీ    జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.  కొంతమంది తమ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు కొన్ని తప్పులు చేసి, తర్వాత  జీవితాంతం బాధపడుతుంటారు. జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో పొరపాటున కూడా  చేయకూడని కొన్ని తప్పులేంటంటే

కుటుంబ సభ్యుల ఒత్తిడి..

సాధారణంగా  పెద్దవాళ్ళు జీవితాంతం తోడుండే మన భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో సహాయపడతారు. కానీ ఒక్కోసారి ఆ పెద్దవాళ్ళ ఒత్తిడివలనే ఒక అమ్మాయైనా లేక అబ్బాయైనా తమకి ఇష్టంలేని వ్యక్తిని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. తర్వాత జీవితాంతం ఇబ్బందిపడుతూ ఉంటారు.


తొందరపడి నిర్ణయం తీసుకోవటం..


ఏ మనిషి గురించైనా అర్ధం కావాలంటే  సమయం పడుతుంది. ఎందుకంటే ఒక్కసారి కలిసి మాట్లాడినంత మాత్రాన ఎవరి గురించి ఎవరికీ పూర్తిగా అర్ధం కాదు. కాబట్టి సమయం తీసుకుని ఆ వ్యక్తి మనకి సరిపోతారా? లేదా? అని నిర్ణయించుకోవాలి తప్ప తొందరపడకూడదు.


వేర్వేరు సంస్కృతులు కావటం..

వివాహం చేసుకునే అమ్మాయి, అబ్బాయిల సంస్కృతుల మధ్య పూర్తి బేధం ఉంటే, వారి వివాహం అయ్యాక చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే సంస్కృతి కేవలం వ్యక్తులతో కాకుండా  సమాజంతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఆ సమాజంవలనే  ఇరువురూ కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దాని ప్రభావం వివాహ బంధం మీద కూడా పడుతుంది.  ముఖ్యంగా ప్రేమ వివాహాలలో ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి.

భౌతిక ఆకర్షణ లేకపోవటం..

ఈ సృష్టి గమనానికి ఆడ, మగ మధ్య ఆకర్షణ ఎంత ముఖ్యమో, వివాహ బంధం మరింత బలపడి ముందుకి వెళ్ళటానికి కూడా  భౌతిక ఆకర్షణ ఉండటం కూడా చాలా ముఖ్యం. భార్యాభర్తలిద్దరికీ ఒకరి పట్ల ఒకరికి భౌతిక ఆకర్షణ లేకపోతే ఆ ఆకర్షణ వేరేవైపుకి మళ్లి, జీవితాలు నాశనమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కేవలం ఆర్థిక అవసరాల కోసం, పనులు చేసిపెట్టే మనిషి కావాలనే ఉద్దేశంతో పెళ్ళిళ్ళు చేసుకునే వారి జీవితంలో ఇలాంటివి కనిపిస్తాయి.

నమ్మకం లేకపోవటం..


సమాజంలో ఏ ఇద్దరి వ్యక్తుల మధ్య బంధం నిలబడాలన్నా నమ్మకం ఉండాలి. అదే భార్యాభర్తల మధ్యైతే  ఈ నమ్మకం ఇంకాస్త ఎక్కువే ఉండాలి. జీవిత భాగస్వామి మీద  నమ్మకం లేకపోతే ఆ వివాహబంధంలో ఎవరూ,  ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు.   ఒకరంటే ఒకరికి నమ్మకం ఉండకపోతే ఆ వివాహ  బంధం ఎక్కువ కాలం నిలబడదు.


                                           *రూపశ్రీ 

By
en-us Political News

  
వయసు పైబడే కొద్దీ, చాలా మంది తల్లిదండ్రులకు రోజువారీ పనులలో సహాయం అవసరం అవుతుంది. ఉద్యోగాల రీత్యా పిల్లలు దూరంగా ఉండటం లేదా విదేశాల్లో ఉండటం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో పిల్లలు తల్లిదండ్రుల కోసం పిల్లలు కేర్ టేకర్ ను నియమించుకోవాలని అనుకుంటారు.
 పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం వల్ల పెద్దగా నష్టం ఏమీ ఉండదని అనుకుంటారు.  సాధారణంగా ఇంట్లో మగవాళ్లు అయినా ఆడవాళ్లు అయినా పిల్లలు ఉన్నా పెద్దగా పట్టించుకోకుండా బట్టలు మార్చుకుంటారు.
5 Habits Every Father Should Give Up for His Daughter,Every Father Needs to Hear These 5 Parenting Tips,5 Habits to Leave Behind
Signs of a Healthy Family Environment,Healthy Family or Toxic EnvironmentIs Your Family Environment Healthy
పిల్లల వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం , ఆలోచనా విధానం మొదలైన విషయాలలో  తల్లిదండ్రులిద్దరూ కీలక పాత్ర పోషిస్తారు. తల్లి ప్రేమ, శ్రద్ధ పిల్లల భావోద్వేగ పునాదిని బలపరిస్తే.. తండ్రి ప్రవర్తన, క్రమశిక్షణ, మాటతీరు,   జీవనశైలి వంటివి  పిల్లలపై చాలా గట్టి  ప్రభావాన్ని చూపుతాయి.
ప్రతి వ్యక్తికి తన జీవితంలో బోలెడు బలం, ప్రశాంతత,  ఆత్మవిశ్వాసం,  జీవితం మీద భరోసా కలిగేది కుటుంబం వల్లనే.
వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ముడిపడేదే కాదు.. రెండు కుటుంబాల మధ్య ముడిపడే బంధం. భారతదేశంలో చాలా వరకు వివాహం తర్వాత అమ్మాయి అత్తవారింటికి వెళుతుంది. భర్త, అత్తమామలతో కలిసి జీవిస్తుంది. అత్తారింట్లో అత్తమామలు మంచివాళ్లు, కోడలిని అర్థం చేసుకుని బాగా చూసుకునేవాళ్లు అయితే ఆ ఇంట్లో ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది...
వేసవి సెలవలు పూర్తయ్యాక పిల్లలు స్కూల్ కు వెళ్లడం అనేది సహజం. పాఠశాలకు వెళ్లడం పిల్లల జీవితంలో పెద్ద మార్పుగా మారుతుంది. మరీ ముఖ్యంగా కొత్తగా స్కూల్ లో జాయిన్ అయిన పిల్లల విషయంలో...
ప్రజల జీవితాలలో ముఖ్యమైనవి సంబంధాలు. నేటికాలంలో ఇంటర్నెట్, డిజిటల్ పరంగా ఎంత దూరంలో ఉన్నా ఎవరినీ పెద్దగా మిస్ కాకుండా పక్కనే ఉన్నట్టుగా పోన్ మాట్లాడటం, వీడియో కాల్స్ చేయడం వంటి మార్గాలలో దగ్గరగానే ఉన్నట్టు ఫీల్ అవుతారు. కానీ బంధాల మధ్య గతంలో కంటే అపార్థాలు, గొడవలు, అతిగా స్పందించడం..
మొబైల్ వ్యసనం మీ మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, నిద్ర, మానసిక ఆరోగ్యంపై మొబైల్ వల్ల కలిగే సమస్యలు మరియు వాటి నుంచి బయటపడే మార్గాలను MindVision వేణుగోపాల్ ఈ వీడియోలో సులభంగా వివరించారు...
ఒక ఉత్తమమైన తరాన్ని సమాజానికి ఇచ్చే ఉద్దేశంతో వివాహం చేసుకుంటారని పెద్దలు చెబుతారు. ఆరోగ్యకరమైన బంధం ద్వారా  ఒక మంచి తరం తయారవుతుంది. కుటుంబం విషయానికి వస్తే.. వంశం ముందుకు సాగడం అనేది పిల్లల ద్వారానే జరుగుతుంది...
నేటి కాలంలో, సంబంధాలు బలపడటానికి , విచ్ఛిన్నం కావడానికి కమ్యూనికేషన్ సరిగా లేకపోవడమే అతిపెద్ద కారణంగా మారింది. అది కుటుంబ సంబంధం అయినా, స్నేహ సంబంధం అయినా, లేదా మరేదైనా వ్యక్తిగత సంబంధం అయినా..
చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.