జమిలీతో జయం.. అసెంబ్లీకి రాంరాం.. జగన్ కొత్త రాగం..!

Publish Date:Feb 24, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇకపై అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావద్దని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని తమ పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పారు. సోమవారం (ఫిబ్రవరి 24 ) అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అనర్హత వేటు భయమో, ఉప ఎన్నికలు వస్తే పులివెందుల సహా ఇప్పడు పార్టీకి ఉన్న 11 స్థానాలూ కూడా కోల్పోతామన్న బెదురో కానీ.. ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకూ అసెంబ్లీ గడప తొక్కను అన్న ప్రతిజ్ణను కాసేపు పక్కన పెట్టి అసెంబ్లీకి హాజరైన జగన్ గవర్నర్ ప్రసంగం పూర్తయ్యే వరకూ కూడా కూర్చో లేకపోయారు. తనతో సహా తన పార్టీ ఎమ్మెల్యేలకు 11వ బ్లాక్ లో సీట్లు కేటాయించడం ఆయనకు ఎన్నికల ఫలితాలను గుర్తు చేసినట్లున్నాయి. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలోనే విజయం సాధించింది. సరే కేటాయించిన 11వ బ్లాక్ సీట్లలోనైనా వైసీపీ ఎమ్మెల్యేలు కూర్చో లేదు. పదే పదే జగన్ ప్రతిజ్ణను గుర్తు చేస్తూ.. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నానాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. అది కూడా ఎక్కువ సేపు లేదు.  మళ్లీ మూడు సెషన్ల వరకూ లేదా అరవై సమావేశ దినాల వరకూ తమ సభ్యత్వానికి వచ్చే ముప్పేమీ లేదని అనుకున్నారో ఏమో.. సరిగ్గా 11 నిముషాల పాటు సభలో నినాదాలు చేసి గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేసి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి వచ్చేశారు. 

బాయ్ కాట్ తరువాత జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో  సమావేశమయ్యారు. ఆ సమావేశంలో బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ణానోదయమైనట్లు.. తనకు అసెంబ్లీలో జ్ణానోదయమైందన్నట్లుగా మారిపోయారు. ఉప ఎన్నికలు వచ్చినా, ఉన్న స్థానాలు కూడా పోయినా, ఇక అసెంబ్లీకి మాత్రం హాజరయ్యే పరిస్థితి లేదన్నారు. ఇప్పటి నుంచే మనం తదుపరి ఎన్నికలకు సమాయత్తం కావాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పిలుపు నిచ్చారు. ఎలా చూసుకున్నా 2028లో జమిలి ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పిన జగన్.. అనర్హత వేటు గురించి మరిచిపోయి.. ఆ ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రిపేరౌదామని చెప్పుకొచ్చారు. తాను మరో 30 ఏళ్లు రాజకీయాలలో ఉంటాననీ, ఇప్పుడు అసెంబ్లీకి వెళ్లినా వెళ్లకపోయినా మనకు వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు.

ప్రజా సమస్యలపై పోరాడతాం. 2028 ఎన్నికలలో గెలుద్దాం అని వారిలో ధైర్యం నింపడానికి ప్రయత్నించారు. చేసిన ప్రతిజ్ణను మరిచిపోయి.. అనర్హత వేటు భయంతో అసెంబ్లీలో అడుగుపెట్టిన జగన్ కు కేవలం 11 అంటే 11 నిముషాలలో ఈ జ్ణానోదయం ఎలా అయ్యిందబ్బా అని వైసీపీ నేతలే విస్తుపోతున్నారు. ఈ జ్ణానం ఏదో ఒక రోజు ముందు అయ్యి ఉంటే ప్రతిజ్ణను పక్కన పెట్టి అసెంబ్లీకి వెళ్లాల్సి వచ్చేది కాదు కదా? పరువు ఇంతగా పోయి ఉండేది కాదు కదా? అని వైసీపీ శ్రేణులే అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి. నెటిజనులైతే.. మళ్లీ 60 రోజుల గడువు పూర్తి అవుతున్న సమయంలో జగన్ కు పులివెందుల భయం పట్టుకుంటుందేమో చూడాలి అని జోకులేస్తున్నారు.  

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.