సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ.. ఇంతకీ అందులో ఏముందంటే?

Publish Date:Nov 7, 2025

Advertisement

మాగంటి కుటుంబ కలహం ఇప్పుడు అంటే జూబ్లీ ఉప ఎన్నిక ముంగిట బీఆర్ఎస్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అసలు ఇంత వరకూ అంటే జూబ్లీ  ఉప ఎన్నికలో మాగంటి సునీతను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించే వరకూ.. అసలంతదాకా ఎందుకు మాగంటి గోపీనాథ్ బతికి ఉన్న కాలంలో ఎన్నడూ మాగంటి మొదటి భార్య అన్న ప్రస్తావనే రాలేదు. అసలు మాగంటి సునీత ఆయనకు రెండో భార్య అన్న విషయమే దాదాపుగా ఎవరికీ తెలియదు. కానీ మాగంటి మరణం తరువాత.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జూబ్లీ ఉప ఎణ్నిక ముంగిట మాగంటి కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. మాగంటి గోపానాథ్ సిసలైన వారసుడిని తానేనంటూ ప్రద్యుమ్నతారక్ మీడియా ముందుకు వచ్చారు. అంతే కాదు.. ఎన్నికల సంఘానికీ ఫిర్యాదు చేశారు.  మాగంటి గోపానాథ్ భార్యను అంటూ సునీత అఫిడవిట్ లో తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించారనీ, ఆమె నామినేషన్ రద్దు చేయాలనీ కోరారు.

సరే ఎన్నికల సంఘం మాగంటి సునీత నానినేషన్ సరిగానే ఉందని పేర్కొంది. ఇప్పుడు తాజాగా మాగంటి తల్లి కూడా మీడియా ముందుకు వచ్చి మాగంటి సునీతపై విమర్శలు గుప్పించారు. తన కుమారుడు ఆస్పత్రిలో వెంటిలేటర్ పై ఉన్న సమయంలో కూడా తనను దూరం పెట్టారనీ, కన్నకొడుకుని కడసారి చూసుకునే భాగ్యం కూడా దక్కకుండా చేశారని ఆరోపించారు. అంతే కాదు.. తన కుమారుడి మరణమే ఓ మిస్టరీ అంటూ కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు.  దీంతో బీఆర్ఎస్ ఒకింత ఇబ్బందుల్లో పడింది. 

ఆ తరువాత మాగంటి సునీత రాసినట్లుగా చెబుతున్న ఓ లేఖ మరింత సంచలనం సృష్టిస్తోంది. మాగంటి ఆస్పత్రిలో ఉన్న సమయంలో సునీత ఆస్పత్రి సెక్యూరిటీకి రాసినట్లుగా ఉన్న ఓ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ లేఖలో మాగంటి తల్లి, సోదరుడు సహా కుటుంబ సభ్యులెవరినీ మాగంటి గోపీనాథ్ ను చూసేందుకు ఆస్పత్రిలోకి అనుమతించవద్దంటూ మాగంటి సునీత  రాసినట్టుగా ఉన్న లేఖ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.   దీంతో బీఆర్ఎస్ లో ఆందోళన వ్యక్తమౌతోందని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద మాగంటి కుటుంబ వివాదం ప్రభావం జూబ్లీ బైపోల్ పై ఏ మేరకు పడుతుందన్నది వేచి చూడాల్సిందే. 

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదిక సంచికలో ప్రస్తుత ఏపీ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
ఈ నేపథ్యంలో జరగనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై ఎలాంటి వైఖరి తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
2026 తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఎవరికీ అంత సులువుగా కనిపించడం లేదు.
అమరావతిని రాజధానిగా గుర్తించాలనే అంశంపై ఇప్పటివరకు చట్టపరమైన స్పష్టత లేదనీ, ఈ లోటును భర్తీ చేసేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విజయవాడ-అమరావతి ప్రాంతమే రాష్ట్ర రాజధానిగా ఉండాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు స్పీకర్ వివరించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
భార్య పేరుతో సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. చిత్తూరు జిల్లాలో తమ పీఎల్ఆర్ కంపెనీ చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన బకాయిలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆ పిటిషన్ లో కోరారు. అయితే న్యాయమూర్తి జస్టిస్ దిపాంకర్ దత్తా నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసం ఈ విషయంలో తాము నేరుగా జోక్యం చేసుకోబోమని విస్పష్టంగా పేర్కొంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 28 రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశం ఎజెండా అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ తీర్మానం ఆమెదించడమే. ఇది ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక ముందడుగుగా భావించవచ్చు.
భారతంలో ద్రౌపదిని వివస్త్రను చేయడానికి కౌరవులు ప్రయత్నిస్తే.. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మిగల్చడానికి ఆ పార్టీ ప్రయత్నించింది. అందుకే కురుక్షేత్రంలో కౌరవులు ఓడిపోయినట్టుగా.. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమిని చూసింది.
కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అధికారికంగా రాజీనామా చేస్తున్నట్లు జీవన్ రెడ్డి ప్రకటించారు
1978 నుంచి అంటే గత 48 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న నంబర్ 24, అక్బర్ రోడ్ భవనాన్ని ఈ నెల 28 లోగా అంటే శనివారం లోగా ఖాళీ చేయాలంటూ కేంద్రం నోటీసులు జారీ చేసింది.
జ‌గ‌న్ లెవ‌న్ పై మీమ్స్ గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. పంజాబ్ కింగ్స్ లెవ‌న్ లాగా.. జ‌గ‌న్స్ లెవ‌న్ అనే పేరు మీద మీమ్స్ వెల్లువెత్తాయి. ఇక తాజాగా కొత్త పార్లమెంట్ భవనంలో వైసీపీ ఎంపీలకు లోక్ సభ స్పీకర్ కేటాయించినది కూడా 11వ నెంబర్ రూమే.
ఇక 2026 త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు ప‌లుర‌కాల ఉచితాల వ‌ల ప‌న్నాయంటే ప‌రిస్థితి ఏమిటో ఊహించుకోవ‌చ్చు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.