మణిపూర్ లో మారణాయుధాలు చోరీ

Publish Date:May 10, 2023

Advertisement

దక్షిణాదిలో కర్నాటక ఎన్నికలలో మోడీ అమిత్ షా, ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డిలు క్షణం తీరికలేకుండా వ్యూహాలు రచిస్తుంటే,  ఈశాన్యంలో మణిపూర్  పరస్పర దాడులతో అట్టుడుకుతోంది. యిప్పటికే అధికారిక లేక్కల ప్రకారం 60 మందికి పైగా మరణించగా వందల మంది గాయపడ్డారు. వేల కొలదీ యిళ్లు అగ్నికి ఆహుతి కాగా, 25కి పైగా చర్చిలు కూల్చివేయబడ్డాయి. యింత జరుగుతున్నా దేశ నాయకులకు యిది పట్టడం లేదు.

మణిపూర్ లో పెట్రేగిన హింస యింత వరకూ అదుపులోనికి రాలేదు. స్థానిక పోలీసు, సైనిక వ్యవస్థలు కొంత వరకూ పరిస్థితిని తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. అయినా యింకా ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి కొనసాగుతోంది.

మణిపూర్ లో తాజా పరిస్థితిపై నోరు విప్పిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని షాకింగ్ నిజాలను మీడియాతో పంచుకున్నారు. గత కొద్ది రోజులుగా  జరుగుతున్న దాడులలో 1041 తుపాకులు, 7450 రౌండ్ల బుల్లెట్లు మాయమయ్యాయని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ చెప్పుకొచ్చారు. వీటిలో అత్యాధునిక ఏకే సిరీస్ రైఫిళ్లు, సెల్ఫ్ లోడెడ్ మ్యాగజైన్లు ఉన్నాయని ఆయన చెప్పారు.

జాతుల మధ్య జరుగుతున్న ఈ హిసాకాండలో వెయ్యికి పైగా తుపాకులు, ఏడున్నర వేల బుల్లెట్లు ప్రజలు లూటీ చేశారని  ముఖ్యమంత్రి స్వయంగా అంగీకరించారు. ఆ ఆయుధాలు యిప్పుడు ఎవరి చేతికి చేరాయో తెలియని, యిది ఆందోళన కలిగించే అంశమని  బీరేన్ సింగ్ చెబుతున్నారు. దానిపై మణిపూర్ లో నిరసన వ్యక్తమవుతోంది.  నాలుగు దేశాలతో సరిహద్దును పంచుకుంటున్న ఈశాన్య రష్యాలలో పరిస్థితిపై దేశంలోనే కాక అంతర్జాతీయంగా కూడా అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

యిన్ని ఆయుధాలు నిజంగా భద్రతా సిబ్బంది నుండి ప్రజలు లూటీ చేశారా లేక ప్రభుత్వమే వాటిని దారి మరల్చిందా అన్న ప్రశ్న ప్రతిపక్షాల నుండి ఎదురౌతోంది. సమస్యాత్మక రాష్ట్రాలుగా చెప్పుకునే ఈశాన్య రాష్ట్రాల పట్ల యిలాంటి వైఖరి సరికాదనేది వారి వాదన. అల్లర్లలో మరణించిన వారికి 5లక్షలు ఎక్స్ గ్రేషియా, యిళ్లు కోల్పోయిన వారికి 2 లక్షలు నష్టపరిహారం, తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి పాతిక వేల రూపాయల పరిహారాన్ని మణిపూర్ ప్రభుత్వం ప్రకటించింది. 

By
en-us Political News

  
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మానసిక రోగి హల్‌చల్‌ చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ అసమానతలు, ఉత్తరాది ప్రాబల్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన గళాన్ని గట్టిగా వినిపించారు.
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత యువ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ అద్భుత ప్రతిభ కనబరిచారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి తెరలేచింది.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.