తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులకు చిరుత కనిపించింది. దీంతో వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆదివారం ఉదయం శ్రీవారి మెట్ల మార్గంలో 500వ మెట్టు వద్ద చెట్ల పొదలలో సేదదీరుతున్న చిరుతను గమనించిన భక్తులు వెంటనే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది సైరన్ మోగించి చిరుతను అడవిలోకి తరిమేశారు. చిరుత కలకలంతో శ్రీవారి మెట్టు ప్రారంభంలో చెకింగ్ పాయింట్ వద్ద భక్తులను మొదట అధికారులు అనుమతించలేదు. పరిస్థతి పూర్తిగా సద్దుమణిగాక భక్తులను గ్రూపుల వారీగా విభజించి మెట్ల మార్గంలోకి అనుమతించారు.
వారం రోజుల వ్యవధిలో శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత సంచారం కనిపించడం ఇది రెండో సారి. గత నెల 25న ఇదే మార్గంలో 350వ మెట్టు వద్ద భక్తులు చిరుతను గుర్తించారు. అప్పట్లో ఇందుకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు తాజాగా మళ్లీ చిరుత సంచారం కనిపించడంతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. దీంతో అప్రమత్తమైన టీటీడీ, అటవీశాఖ భక్తులకు పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. భక్తులు మెట్ల మార్గంలో ఒంటరిగా కొండపైకి వెళ్లొద్దని సూచించారు. గుంపులుగా మాత్రమే వెళ్లాలని కోరారు. ఇక పోతే 12 సంవత్సరాలలోపు వయస్సున్న వారిని మెట్ల మార్గంలో కొండపైకి అనుమతించకూడదని నిర్ణయించారు. భక్తుల భద్రత కోసం టీటీడీ అటవీ విభాగం సిబ్బంది మెట్ల మార్గం పొడవునా పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/leopard-in-tirumala-metls-margam-39-199072.html
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు. ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
Publish Date:Oct 31, 2026
రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. ప్రశాంతంగా సాగేనా.?