ఈటల డీఎన్ఏ పే చర్చ! ఆత్మగౌరవమా.. ఆస్తుల రక్షణా?

Publish Date:Jun 7, 2021

Advertisement

మాజీ మంత్రి, మాజీ తెరాస నాయకుడు ఈటల రాజేందర్ తనంతట తానుగా,మంత్రి పదవికి రాజీనామా చేయలేదు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఐదేళ్లకు పైగా ఆయన అవమానాలను భరిస్తూ వచ్చారు. అవమానాలకు ఆత్మగౌరవం బలవుతున్నా పెదవి విప్పలేదు. ఆయన తమ ఆవేదను, తమలోనే దాచుకున్నారు. మంత్రి పదవికంటే ఆత్మగౌరవం ముఖ్యమని, మంత్రిపదవిని, బానిస భవన్ ముఖాన కొట్టి రాలేదు.చివరకు ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆయన్ని  బర్తరఫ్ చేశారు. బర్తరఫ్ అయిన తర్వాత కూడా ఆయన మీసాలు మేలేయ లేదు తొడలు కొట్టలేదు. అవమానాలను గుర్తుచేసుకుని ఆత్మాభిమానాన్ని చూపలేదు. తెగిన బంధం అటుకుతుందేమో అని ఆశగా ఎదురు చూసారు. కాదని తేలిన తర్వాత  ప్రత్యాన్మాయ రాజకీయ వేదిక వేటలో పడ్డారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యతిరక వర్గాల నాయకులను కలిసి చర్చలు జరిపారు ఈటల. సలహాలు, సూచనలు తీసుకున్నారు. కొత్త పార్టీ పెట్టడమా, ఉన్న పార్టీలలోచేరడమా,  ఉన్న పార్టీలలో ఏది ఉత్తమం?  కాంగ్రెస్, బీజేపీ  ఏ పార్టీలో చేరాలి ... ఏ పార్టీలో చేరితే ఎంత లాభం, ఇలా అనేక కోణాల్లో లాభ నష్టాలను  బేరీజు వేసుకున్నారు, చివరకు, కేంద్రంలో అధికారంలో ఉన్న కమల దళాన్ని ఎంచుకున్నారు. అయన బీజేపీని ఎంచుకోవడానికి, ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండడం ఒక కారణం అయితే,రాష్రంలోనూ అంతో ఇంతో బలము, భవిష్యత్ ఉన్న పార్టీ కావడమే కారణం. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అంతో ఇంతో భవిష్యత్ ఉందన్న భరోసా చిక్కితే, ఒక క్షణం అలోచించకుండా, హస్తం పార్టీతోనే చేతులు కలిపేవారు. ఇదీమి బ్రహ్మ పదార్ధం కాదు. ఎవరికీ తెలియని రహస్యం కాదు.  అయినా, చిత్రంగా ఆయన పూర్వాశ్రయంలోకి తొంగి చూస్తున్నారు. అయన ఎప్పుడో వదిలేసినా ఎర్ర చొక్కాను, రెడ్  ఫ్లాగ్, నాటు తుపాకిని గుర్తు చేస్తున్నారు. చిత్రంగా ఆయన డీఎన్ఏ గురించి మాట్లాడుతున్నారు.

కమ్యూనిస్ట్ నాయకులు,మాజీ కమ్యూనిస్టులు ఈటల బీజేపీలో చేరి మైల పడి పోయారని, ఆవేదనతో కూడిన ఆగ్రహం వ్యక్త పరుస్తున్నారు, అలాగే, అయన, వామ పక్షాల గురింఛి చేసిన కొన్ని వ్యాఖ్యలకు నొచ్చుకుంటున్నారు. ఈటల బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడం ఆత్మహత్యా సదృశమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వామపక్ష రాజకీయాలతో ప్రారంభమై.. ప్రజాస్వామికవాదిగా కొనసాగి..ఇప్పుడు మతోన్మాద ఫాసిస్ట్‌ బీజేపీ పంచన చేరడం సిగ్గుపడాల్సిన విషయమని విమర్శించారు. ప్రజాస్వామ్యం కోసం పోరాడే శక్తిగా ఈటల తయారవుతారని తెలంగాణ ప్రజలు భావించారని, అయితే ఆయన నిర్ణయంతో వారందరూ చల్లబడిపోయారని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. తన ఉనికి కోసమే బీజేపీలోకి ఈటల వెళ్తున్నట్లు స్పష్టమవుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. ఈటల తన అక్రమ ఆస్తులు కాపాడుకునేందుకు బీజేపీలోకి వెళ్తున్నారా? అని యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి ఎద్దేవా చేశారు. 

మరో వైపు సీపీఐపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తప్పుపట్టారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమన్నారు. టీఆర్ఎస్‌తో తమకు లోపాయకారి ఒప్పందం ఉంటే నిరూపించాలన్నారు.  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా ఈటల రాజేందర్ బీజేపీలో చేరడాన్ని తప్పుపట్టారు. ఆత్మగౌరవం కాదని.. ఆస్తుల రక్షణ కోసమే వెళుతున్నారని విమర్శించారు.

నిజానికి ఈ చర్చ అంతా అనవసరం. ఎందుకంటే, ఈరోజు రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు సిద్దాంతాలకు ఎప్పుడోనే విడాకులు ఇచ్చేశారు. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడు అయినా కోరుకునేది, కట్టుబడేది అధికారానికి, ఆత్మరక్షణకు. ఈటల అందుకు మినహాయింపు కాదు, ఆయన బీజేపీలో చేరి చేదిపోయాడని, అనుకునే వాళ్ళు అంతే.

By
en-us Political News

  
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.