ఔను.. ఉభయ కమ్యూనిస్టు పార్టీలూ ఒక్కటయ్యాయి!

Publish Date:Apr 14, 2023

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ లో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఒక్కటయ్యాయి. కేంద్రంలోని బీజేపీ విద్రోహపూరిత విధానాలపై రాష్ట్రంలో సిపిఎం, సిపిఐ ఉమ్మడి ప్రచార భేరికి శ్రీకారం చుట్టాయి. రాజ్యంగా నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజున రాజ్యాంగ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఒకటిగా గొంతెత్తాయి. రెండు పార్టీల ఉమ్మడి ప్రచార భేరి విజయవాడ నుండి ప్రారంభమయ్యింది. అ దే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగుతున్న వైసీపీ అరాచక పాలనను వామపక్షాల నేతలు ఎండగట్టారు.  ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఉమ్మడి పోరాటానికి శ్రీకారం చుట్టండం రాష్ట్ర రాజకేయాల్లో పెను మార్పులకు దరి తీస్తుందని రాజకీయ సమీకరణాలలోనూ మార్పుకు శ్రీకారం అవుతుందని పరిశీలకులు అంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకించే పార్టీలన్నీ ఏకమయ్యేందుకు కమ్యూనిస్టుల ఉమ్మడి పోరాటం దోహదం చేస్తుందంటున్నారు.  

 మతోన్మాద బిజెపిని సాగనంపుదాం ! దేశాన్ని కాపాడుకుందాం! అనే నినాదంతో విజయవాడలో ప్రారంభమైన ఈ ప్రచార భేరి రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో మే 1 వ తేదీ వరకూ కొనసాగుతుందని వామపక్ష పార్టీల నేతలు ఉమ్మడిగా  ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రచార భేరి ప్రారంభోత్సవం సందర్భంగా...  విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు ప్రకాష్‌ కారత్‌, సిపిఐ కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వినరు విశ్వం, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, తదితరులు నివాళులర్పించారు.  విజయవాడ ఎంబివికె భవన్‌లో ఏర్పాటు చేసిన సభలో ప్రజా నాట్యమండలి బృందం సంగీతాలాపన చేసింది. నృత్య ప్రదర్శనలతో అలరించింది.

ప్రారంభ సభలో సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు ప్రకాష్‌ కరత్‌ ప్రసంగించారు. బిజెపిని సాగనంపి దేశాన్ని కాపాడుకుందామని సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాసరావు, కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. 
ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి, భావోద్వేగాల ద్వారా మరలా అధికారంలోకి రావాలనే దుష్ట ప్రయత్నం మోడీ, అమిత్‌షా బృందం చేస్తోందని విమర్శించారు. శాంతియుతంగా, సామరస్యంగా, సంతోషంగా ప్రజలు పండుగలు, పబ్బాలు జరుపుకునే పరిస్థితి లేకుండా బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధంగా మతం పేరుతో ప్రజల మధ్య ఘర్షణను సృష్టించి దేశాన్ని బలహీన పరుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అదానీ కుంభకోణాన్ని, నరేంద్రమోడీ వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకే ఇదంతా చేస్తోందని విమర్శించారు. 

దేశవ్యాప్తంగా ఇంత జరుగుతున్నా బిజెపి దుర్మార్గాన్ని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌, వైసిపి కనీసం ఖండించడం లేదన్నారు. రాష్ట్రంలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాలు పాఠశాలల్లో స్వేచ్ఛగా విస్తృతంగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల  మెదళ్లను మతం పేరుతో కలుషితం చేస్తున్నారని విమర్శించారు.  రాష్ట్రానికి బిజెపి చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టి, మతసామరస్యాన్ని కాపాడాలని ప్రజలను కోరారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా కాపాడే ఉద్దేశం రాష్ట్రప్రభుత్వానికి లేదని విమర్శించారు.

కేంద్రం ముందు నుంచి పొడిస్తే రాష్ట్రప్రభుత్వం వెనక నుంచి పొడుస్తోందన్నారు. ఇది దుర్మార్గమన్నారు. ప్రైవేటీకరణపై సిఎం మౌనంగా ఉంటే మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు మాత్రం ప్రజలను పక్కదారి పట్టించేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపితో కుమ్మకై రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టడాన్ని అంగీకరించబోమన్నారు.

By
en-us Political News

  
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మానసిక రోగి హల్‌చల్‌ చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ అసమానతలు, ఉత్తరాది ప్రాబల్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన గళాన్ని గట్టిగా వినిపించారు.
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత యువ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ అద్భుత ప్రతిభ కనబరిచారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి తెరలేచింది.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.