నైతిక విలువలకు తిలోదకాలు.. జర్నలిజం ముసుగులో అమానుష వ్యాఖ్యలు!

Publish Date:Jun 9, 2025

Advertisement

వ‌రుస దెబ్బ‌లు త‌గులుతున్నా వైసీపీకిగానీ దాని మీడియాకి గానీ బుద్ది వ‌చ్చిన‌ట్టు క‌నిపించ‌డం లేదా? అంటే అవున‌నే చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి సున్నితాంశాల ప‌ట్ల ఉండాల్సిన  నిబద్ధ‌త మ‌రచి మ‌రీ జ‌గ‌న్ అనుంగు మీడియా వ్య‌వ‌హ‌రించ‌డం చేటు తెస్తుందా? అంటే అదే నిజ‌మ‌ని తెలుస్తోంది. బేసిగ్గా పొలిటీషియ‌న్లు నోటి మాట అదుపు త‌ప్పిన‌పుడు దాన్నొక రాజ‌కీయ ఆరోప‌ణ కింద లైట్ తీస్కునే వెస‌లుబాటు ఉంటుంది. వెన‌కుండి ఎవ‌రో న‌డిపించి ఉంటార్లెమ్మ‌ని జ‌నం అర్ధం చేసుకుంటారు. ఈ మ‌ధ్య అలాక్కూడా ఎవ్వ‌రూ అర్ధం చేసుకోవ‌డం లేదు. చంద్రబాబు సతీమణి భువ‌నేశ్వ‌రిపై వ‌ల్ల‌భ‌నేని వంశీ అన్న మాట‌లు.. వైయ‌స్ జ‌గ‌న్ ఆయ‌న పార్టీ లీడ‌ర్ల సంస్కారం ఏపాటిదో ఎత్తి చూపించాయి. ఈ విష‌యంలో సాక్షాత్ ఆ పార్టీ మాజీ మంత్రి జోగి ర‌మేష్ చేసిన కామెంట్లే ఉదాహ‌ర‌ణ‌. త‌మ ఘోర ఓట‌మికి ఇలాంటి కామెంట్లే కార‌ణ‌మ‌ని  ఆయన ఎలాంటి శషబిషలూ లేకుండా అంగీకరించారు.   తాము అధికారంలోకి వ‌స్తే అమ‌రావ‌తినే రాజ‌ధానిగా అంగీక‌రిస్తామ‌ని ఆయ‌న చెప్పారు.

మాములుగా రాజ‌కీయ‌నాయ‌కులు ప్రేలాప‌ల‌న‌ల‌కు పాల్ప‌డితే వారిని తీర్చిదిద్దాల్సిన బాధ్య‌త స‌గ‌టు జ‌ర్న‌లిస్టుల‌కు ఉంటుంది. బేసిగ్గా జ‌ర్న‌లిజంలో పిల్ల‌లు, మ‌హిళ‌లు, వృద్ధులు, ప్రాంతీయ క‌ల‌హాలు, కుల,మ‌త, వ‌ర్గ, వైష‌మ్యాల‌ను రెచ్చ‌గొట్టేలాంటి వ్య‌వ‌హార శైలి క‌న‌బ‌ర‌చ‌కూడ‌దు.  డూస్ అండ్ డోంట్స్ లో ఇవ‌న్నీ ఒక పాఠంగా చెబుతారు. కానీ  కొమ్మినేని శ్రీనివాసరావు, ఆయన ఓ చానెల్ లో  నిర్వహించిన డిబేట్లో పాల్గొన్న సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కృష్ణంరాజు  అటువంటి కనీస ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చేశారు.  అమ‌రావ‌తిపై వేశ్య‌ల రాజ‌ధాని అన్న ముద్ర వేయడానికి ఇసుమంతైనా వెనుకాడలేదు. వారి వ్యాఖ్యలపై అమరావతి  ప్రాంత మ‌హిళ‌లు చాలా చాలా సీరియ‌స్ అయ్యారు. వారిపై ఫిర్యాదులు చేయడంతో పాటు వారి దిష్టిబొమ్మలను చెప్పులతో కొట్టారు.  

ఇంత‌కీ ఇదెలా వెలుగులోకి వ‌చ్చిందోన‌ని చూస్తే.. ప్ర‌పంచ అత్య‌ధిక జ‌నాభా గ‌లిగిన దేశాల్లో అగ్ర స్థానంలో ఉన్న భార‌త్.. హెచ్ఐవీ బాధితులు అధికంగా ఉన్న దేశాల్లో మూడో స్థానంలో ఉంది. ఈ సంఖ్య త‌గ్గించేందుకు ప్ర‌భుత్వాలు పాటు ప‌డుతున్నాయి.  ఏయే రాష్ట్రాల్లో సెక్స్ వ‌ర్క‌ర్ల సంఖ్య ఎలా ఉందో  పీఎంపీఎస్ఈ సంస్థ ఒక స‌ర్వే చేసింది. ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేష‌న్ సైజ్ ఎస్టిమేష‌న్ అనే ఈ సంస్థ  నిర్వ‌హించిన స‌ర్వేలో దేశం మొత్తం మీద  9, 95,499 మంది సెక్స్ వర్కర్లు ఉన్నారని అంచనా వేసింది. భార‌త్ లో సెక్స్ వర్కర్లు ఉన్న రాష్ట్రాల జాబితాలో దక్షిణాది రాష్ట్రాలే టాప్‌లో ఉన్నట్టు తేల్చింది. 

దేశంలోని మొత్తం మహిళా సెక్స్ వర్కర్లలో 15.4 శాతం మంది కర్ణాటకలో ఉండ‌గా.. ఏపీలో 12 శాతం మంది ఉన్నార‌నీ.. ఇక‌ తెలంగాణలో 7.6 శాతం ఉన్నట్టు లెక్క‌లు రాసుకొచ్చిందీ సంస్థ‌. అంటే దేశంలోని మహిళా సెక్స్ వర్కర్లలో సుమారు 20 శాతం మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారే అన్న‌ది ఈ స‌ర్వే రిపోర్ట్ సారాంశం.  దీన్ని ఒక అప్ర‌ధాన్య‌త‌కు సంబంధించిన వార్త‌గా ప్ర‌చురించాలి స‌హ‌జంగా అయితే.  కానీ దాన్ని అమ‌రావ‌తి అనే రాజ‌ధానికి లింకు పెట్టి.. ఈ చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లోనే ఆ వేశ్య‌లంతా ఉన్నార‌ని చెప్ప‌డం అర్ధ‌ర‌హితం, అమానుషం, అనైతికం.  ఇది జ‌ర్న‌లిస్టిక్ విలువ‌ల‌ను స‌మూలంగా తుంగ‌లో తొక్క‌డంతో స‌మానం.  పొట్టకూటి కోసంఆ వృత్తిలో ఉన్న‌వారి రీహాబిలిటేష‌న్ జరగాలి. జర్నలిజం, జర్నలిస్టులు అందుకోసం వార్తలు రాయాలి. విశ్లేషణలు చేయాలి. గతంలో తెలంగాణలోని యాద‌గిరి గుట్టలో కూడా అదే జరిగింది. అప్పట్లో మీడియా యాదాద్రికి వేశ్య ముద్ర వేసి అప‌ఖ్యాతి పాలు చేయ‌లేదు. బాధ్యతగా వ్యవహరించింది. అది క‌నీస సంస్కారం, విజ్ఞ‌త‌తో కూడిన జర్న‌లిజం.  

కానీ ఇప్పుడు కొమ్మినేని, కృష్ణంరాజు   జ‌ర్న‌లిజం ముసుగులో అసహ్యమైన, అమానుషమైన, అనైతిక ప్రచారానికి ఒడిగట్టారు.  కొద్ది కాలం కిందట  వైఎస్ సతీమణి భార‌తీరెడ్డిపై తెలుగుదేశం మద్దతుదారు అయిన కిర‌ణ్ చేబ్రోలు అనే వ్య‌క్తి అనుచిత వ్యాఖ్య‌లు చేసినందుగానూ వెంట‌నే అలెర్ట్ అయిన కూట‌మి ప్ర‌భుత్వం అతనిని అరెస్టు చేసి  జైల్లో పెట్టింది.  ప‌రిణితి ప్ర‌ద‌ర్శించింది. కానీ వైసీపీలో మాత్రం అటువంటి పరిణితి ఇసుమంతైనా కనిపించడం లేదు.  ఇదే వైఖరిని వైసీపీ కొనసాగిస్తే ముందుముందు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
పేటీఎం బ్యాచ్, రూ.5 బ్యాచ్.. ఇవి గత కొన్నేళ్లుగా ఉన్నా, ఇప్పటికీ ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న పదాల్లో కొన్ని. ఒక పార్టీకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి, ట్రోల్స్ చేయడానికి డబ్బులు తీసుకునే వారిని, మరీ ముఖ్యంగా వైసిపి సోషల్ మీడియా వింగ్‌ను, టిడిపి, జనసేన శ్రేణులు పేటీఎం బ్యాచ్ అని పిలుస్తుంటారు. ప్రతి పోస్టుకు ఐదు రూపాయలు ఇస్తారనే ప్రచారంతో ఐదు రూపాయల బ్యాచ్ అని కూడా అంటారు.
సీఎం, మంత్రుల హెలికాప్టర్ పెద్దగుట్టపై ల్యాండ్ అయినప్పటికీ.. అక్కడ వారిని రిసీవ్ చేసుకోవడానికి కనీసం ఒక్క జిల్లా ఉన్నతాధికారి కూడా అందుబాటులో లేకపోవడం తీవ్ర కలకలం రేపింది. వేద పాఠశాల శంకుస్థాపన ప్రాంగణమైన పెద్ద గుట్టపై సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అయినా, అధికారుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, సమన్వయ రాహిత్యం కారణంగా ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు కలెక్టర్ గానీ, ఎస్పీ గానీ, ఇతర ప్రోటోకాల్ అధికారులు గానీ సమయానికి అక్కడకు చేరుకోలేకపోయారు.
రాయలసీమ అభివృద్ధిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు మంత్రి నారా లోకేష్. గత ఐదేళ్లలో సీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ జగన్ ఈ ప్రాంతానికి క్యాన్సర్ గడ్డలా మారారని విమర్శించారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైంది. టీవీ డిబేట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న 2026 మహానాడును స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ సీనియర్ నేతలే కూటమి కట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
గత కొంత కాలంగా ప్రదాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ లో పనితీరు సరిగా లేని వారికి ఉద్వాసన పలికి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. ఆ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తయ్యిందని కూడా చెబుతున్నారు.
కూటమిలో వైరుధ్యాలు లేవని, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లి విలువైన సమయం గడపడమే ఇందుకు నిదర్శనమని అప్పసాని రాజేష్ అన్నారు. ఒకరి కాళ్ళ దగ్గర మాటలను తాకట్టు పెట్టి, వారు విసిరే ఎంగిలి మెతుకుల కోసం కొందరు కిరాయి రాజకీయ విశ్లేషకులుగా మారారని నాగేశ్వర్ ఉద్దేశించి అప్పసాని రాజేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు.. పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేనకు దక్కే రాజ్యసభ సీటు ద్వారా నాగబాబును ఢిల్లీకి పంపించి, జాతీయ స్థాయిలో పార్టీ వాయిస్‌ను వినిపించేలా చేయాలన్న‌ ఆలోచనలో జ‌న‌సేన‌ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా  తన వ్యక్తిగత ప్రతిష్టను, సమాజంలో ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని మంత్రి భరత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  
మళ్ళీ తేర మీదకి కర్ణాటక సీఎం కుర్చీ పంచాయతీ.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.