తెలంగాణ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందా? పార్టీ పరిస్థితి, మనుగడపై ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకుల్లోనే గందరగోళం నెలకొందా? అంటే బీఆర్ఎస్ శ్రేణులే ఔనంటున్నాయి. అధికారం కోల్పోయిన తరువాత బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఏదో అప్పుడప్పుడు ఎర్రవల్లి వచ్చిన నాయకులతో చిట్ చాట్ నిర్వహించడం తప్ప ఆయన పార్టీ వ్యవహారాలలో కానీ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కానీ క్రియాశీలంగా వ్యవహరించింది లేదు. పార్టీ కార్యక్రమాలన్నీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగానే జరుగుతున్నాయి.
ఇక్కడే పార్టీ నాయకుల్లో విభేదాలు, అసంతృప్తులు మొదలయ్యాయి. కేటీఆర్, కవిత మధ్య అంతరం పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. అయితే వీటి పరిష్కారంపై కేసీఆర్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. చివరకు తన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పార్టీలో పరిస్థితిపై లేఖరాసినా కేసీఆర్ స్పందించక పోవడంతో.. కొందరు ఆ లేఖ ను లీక్ చేశారు. దీంతో కేసీఆర్ సంతానం మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. రచ్చకెక్కయి. ఈ నేపథ్యంలోనే కవిత జిల్లాల పర్యటనలు చేశారు. ఈ పర్యటనల్లో తాము పాల్గొనాలా వద్దా అనే విషయంపై అధినేత కేసీఆర్ నుంచి అనుమతి కోసం ప్రయత్నిస్తే.. ఆయన కేటీఆర్ ను సంప్రదించమని చెప్పి చేతులెత్తేశారు. ఇప్పుడు పార్టీ బాధ్యతలు అన్నీ కేటీఆర్ చేతుల్లోకి వెళ్లాయి. దీనిపై పార్టీలోని కొందరు అసంతృప్తితో ఉన్నారు. అందరినీ కలుపుకుని పోకుండా కేటీఆర్ కొందరికే అందుబాటులో ఉండటంపై మెజారిటీ నాయకులు అసంతృప్తితో ఉన్నారంటున్నారు.
ఈ విషయాన్ని కేసీఆర్ కు చెప్పలేక సతమతమవుతున్నారు. కేటీఆర్ శైలి నచ్చక వేచిచూసే ధోరణిలో ఉన్నారు. ఎన్నికల నాటికి పరిస్థితులు చూసుకొని పార్టీలో కొనసాగాలా లేక వైదొలగాలా అనే మీమాంసలో ఉన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల పట్ల కూడా జిల్లాల్లో నాయకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.. ఈ పరిణామాలన్నీ పార్టీని గందరగోళంలో పడేస్తున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/leaders-loosing-hopes-on-brs-39-203447.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.