వలసలు ఆగవు.. వైసీపీ మిగలదు!

Publish Date:Nov 4, 2024

Advertisement

ఐదేళ్ల అరాచక పాలనతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్.. అధికారం కోల్పోయిన తరువాత కూడా అదే బాటలో నడుస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి అంటే గిట్టదని చాటి చెబుతున్నారు. అవినీతి సొమ్ము పంపకాలలో తల్లి సోదరితో వచ్చిన తాగాదాపై కూడా రాజకీయం చేస్తూ, తాను రాసిచ్చిన స్క్రిప్టునే చదవాలని పార్టీ నేతలపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. సొంత మీడియా, సోషల్ మీడియాలో తల్లీ చెల్లికి వ్యతిరేకంగా వార్తలను గుప్పించడమే కాకుండా, పార్టీ నేతలను కూడా మీడియా సమావేశాలు పెట్టి మరీ వారిని దూషించమని ఆదేశిస్తున్నారు. అయితే వైసీపీలోని మెజారిటీ నేతలు మాత్రం పార్టీ రాజకీయంగా మనుగడ సాగించాలంటే.. మీ ఇంటి విషయాలు ప్రైవేటుగా తేల్చుకోండి.. బజారున పడి మీ పరువుతో పాటు పార్టీ పరువూ తీయకండి అని జగన్ కు చెప్పాలని భావిస్తున్నారు. అయితే ఒకరి మాట వినేరకం కాకపోవడంతో ఆయనతో నేరుగా ఆ విషయం చెప్పలేక, చెప్పినా ఫలితం ఉండదు కనుక.. తమ రాజకీయ భవిష్యత్ కోసం పార్టీని వీడుతున్నారు. అలా వీడుతున్న వారిలో జగన్ హయాంలో ఆయన అండ చూసుకుని ఇష్టారీతిగా రెచ్చిపోయిన వారు, విలువలను వదిలేసి ప్రతిపక్ష నాయకులు, విపక్ష పార్టీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారూ కూడా ఉండటమే విశేషం. జగన్ తానా అనకముందే తందానా అంటూ భజన చేసి ఆయన దృష్టిలో పడాలంటే.. తిట్లు, దూషణలే భాషగా మార్చుకోవాలని భావించి అలా ఇష్టారీతిగా చెలరేగిపోయిన వారు ఇప్పుడు జగన్ కు దూరం జరుగుతున్నారు. అవకాశం ఉంటే కూటమి పార్టీల్లో ఏదో ఒక పార్టీలో చేరిపోవాలని చూస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీకి, జగన్ కు గుడ్ బై చెప్పి కూటమి పార్టీల్లో సర్దుకున్నారు. ఇక జగన్ అధికారంలో ఉండగా నోటికి పని చెప్పి, మంచీ చెడు అన్న విచక్షణ మరిచి ఇష్టారీతిగా బూతలతో చెలరేగిపోయిన వారికి కూటమి పార్టీల్లో అవకాశం లేకుండా పోయింది. అటువంటి వారు కూడా జగన్ కు దూరంగా ఉంటే ఇప్పుడు కాకపోతే తరువాతైనా ఏదో  ఒక పార్టీలో చోటు దొరుకుతుందన్న ఆశతో పార్టీని వీడే యోచన చేస్తున్నారు. అటువంటి వారిలో ప్రముఖంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. వారు మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, జోగి రమేష్. 
ముందుగా అనిల్ కుమార్ యాదవ్ గురించి చెప్పుకుంటే... వైసీపీ అధికారంలో ఉండగా కన్నూమిన్నూ గానక ఇష్టారీతిగా  తెలుగుదేశం అధినేత చంద్రబాబు పై నోరెట్టుకు పడిపోయిన అనీల్ కుమార్ యాదవ్  పార్టీ  ఘోర పరాజయం తరువాత   ఎక్కడా కనిపించడం లేదు. వినిపించడం లేదు. పోలింగ్ జరిగిన తరువాత ఒక సారి మీడియా ముందుకు వచ్చి పోలీసులు, అధికారులు ఏకపక్షంగా తెలుగుదేశం కూటమికి అనుకూలంగా వ్యవహరించారని ఓ ఆరోపణ చేసి ఫలితాలకు ముందే ఓటమి అంగీకరించేశారు.  ఆ తరువాత ఆయన ఇక ఎక్కడా బయటకు వచ్చిన దాఖలాలు లేవు.  అయితే  పార్టీ అధికారంలో ఉండగా, తాను మంత్రి పదవి వెలగబెడుతున్న సమయంలో అనీల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లా లో సాగించిన దోపిడీ పర్వం అంతా ఇంతా కాదు. నెల్లూరు జిల్లాలో ఖనిజాల దోపిడీ సహా అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ఆనం రామనాయారణరెడ్డి, కొటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వంటి వారు వైసీపీ తీరుతో, జగన్ విధానాలతో విభేదించి  బయటకు వచ్చి తెలుగుదేశం గూటికి చేరారు. వారిని అనీల్ కుమార్ యాదవ్  అనుచితంగా దూషించి వారి రాజకీయ జీవితం ముగిసిపోయందంటూ అప్పట్లో తన స్థాయికి మించిన వ్యాఖ్యలు చేశారు.  

ఒక వేళ వారు రాజకీయాలలో రాణిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ సవాళ్లు సైతం విసిరారు. ఇప్పుడు తన రాజకీయ జీవితమే సందిగ్ధంలో పడిన నేపథ్యంలో  ఎవరికీ ముఖం చూపలేక చాటేశారు. అటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు తన పరిస్థితి ఇలా కావడానికి కారణంగా వైసీపీ అధినేత జగన్ అని భావిస్తున్నారు. పార్టీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని నెల్లూరు పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తున్నది.  అయితే జనసేన తలుపులు ఆయన కోసం తెరుచుకునే అవకాశాలు మృగ్యమని అంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అయితే విపక్షంలో ఉన్న సమయంలోనే అనిల్ అక్రమాలపై జ్యుడీషియల్ కమిషన్ కు డిమాండ్ చేసింది. ఇప్పుడు అధికారంలో ఉంది కనుక ఇహనో ఇప్పుడో ఆయనపై విచారణకు ఆదేశించే అవకాశాలే మెండుగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మౌనంగా ఉంటే సరిపోదనీ, జగన్ తో విభేదించి బయటకు వచ్చానని చాటుకోవడం ద్వారా కూటమి ఆగ్రహాన్ని కొంతైనా చల్లార్చవచ్చనీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  భావిస్తున్నారనీ, అందుకే పార్టీ వీడాలన్న నిర్ణయానికి వచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఇక మరో మాజీ మంత్రి జోగి రమేష్ విషయానికి వస్తే.. వైసీపీ శ్రేణులలో ఆయన పార్టీ మారరన్న విశ్వాసం వ్యక్తం అవుతున్నప్పటికీ  జోగి రమేష్ కేసుల చక్రబంధం నుంచి బయటపడాలంటే పార్టీ మారడం తప్ప మరో మార్గం లేదని భావిస్తున్నారని ఆయన అనుయాయులు చెబుతున్నారు. జోగి రమేష్ జనసేన వైపు చూస్తున్నారని అంటున్నారు. ఇందులో నిజానిజాలను పక్కన పెడితే జోగి రమేష్ వైసీపీలో కొనసాగే అవకాశాలు ఇసుమంతైనా కనిపించడం లేదు. 

 వీరిద్దరే కాకుండా వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు మరి కొందరు మాజీలు కూడా రెడీగా ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. వలసలు జోరందుకోవడానికి ఎక్కువ రోజులు పట్టదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగా వైసీపీకి బైబై చెప్పేసి బయటకు వచ్చే వారి సంఖ్య అధికంగానే ఉంటుందంటున్నారు. అసలు వైసీపీ మిగులుతుందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మేకతోటి సుచరిత, విడదల రజిని కూడా ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వారు కూడా నేడో రేపో  పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలున్నాయంటున్నారు. 

By
en-us Political News

  
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.