మన బద్ధకపు ఖర్చు- నాలుగు లక్షల కోట్లు!

Publish Date:Jul 30, 2016

Advertisement

 

వినడానికి కాస్తా ఆశ్చర్యంగానే ఉండవచ్చు. కానీ ఇది ఏదో ఆషామాషీగా తేల్చిన ఖర్చు కాదు. The lancet అనే పత్రిక గత నాలుగేళ్లుగా చేస్తున్న పరిశోధనలో బయటపడిన అంశం ఇది. ఇంతకీ బద్ధకానికీ ఖర్చుకీ సంబంధం ఏమిటీ! ఇంకా మాట్లాడితే బద్ధకానికీ ఆయుష్షుకీ సంబంధం ఏమిటి? అన్న ప్రశ్నలు తలెత్తితే వాటికి The lancet స్థిరమైన జవాబులను అందిస్తోంది...
‘ప్రజల్లో వ్యాయమాం చేసే అలవాట్లు, వాటి వల్ల వారి ఆరోగ్యంలో మార్పులు’ అనే అంశం మీద లాన్సెట్ పత్రిక గత ఒలంపిక్స్‌ (2012) నుంచి ఒక పరిశోధనను చేపట్టింది. ఇందులో భాగంగా నాలుగు నివేదికలను వెల్లడించింది. ఈ పత్రిక వెలువరించిన మొదటి నివేదిక ప్రకారం-

 

- శారీరికంగా ఎలాంటి కదలికలూ లేకుండా, వ్యాయామం చేసే అలవాటు లేకుండా ఉన్నవారిలో... గుండెజబ్బులు, పక్షవాతం, చక్కెర వ్యాధి, కొన్ని రకాల కేన్సర్లు ప్రమాదకరమైన స్థాయిలో బయటపడుతున్నాయి.

 

- ఇలా శారీరిక వ్యాయామం లేకపోవడం వల్ల నానారకాల జబ్బుల పాలిట పడి చనిపోతున్నవారి సంఖ్య, ఏటా 50 లక్షల వరకూ ఉంది.

 

- ఎలాంటి కదలికలూ లేకుండా రోజుకు కనీసం ఎనిమిది గంటల పాటు సీట్లకు అతుక్కునిపోయేవారు, రోజుకి కనీసం ఒక గంట సేపైనా వ్యాయామం చేస్తే కనుక వారిలోనో అనారోగ్య సమస్యలు దూరమవుతున్నట్లు తేలింది.

 

- శారీరిక వ్యాయామం లేనివారులో 28-59 శాతం మంది త్వరగా చావుని చేరుకుంటున్నారట!

 

- మరీ చురుకైన జీవనశైలి ఉన్నవారు తప్ప, మిగతావారిలో రోజుకి 3 గంటలకు మించి టీవీని చూసేవారు కూడా త్వరగా మృత్యు ఒడిని చేరుకుంటున్నట్లు వెల్లడైంది.

 

- ఈ గణాంకాలన్నింటినీ సేకరించడం కోసం లాన్స్‌ట్‌ వంద కాదు, వేయి కాదు... పదిలక్షల మంది జీవన విధానాన్ని నిశితంగా పరిశీలించింది.

 

ఇక లాన్సెట్‌ తన రెండో పరిశోధనలో, వ్యాయామం చేయకపోవడం వల్ల తలెత్తే అనారోగ్యాలకి సంబంధించిన ఖర్చుని వెల్లడించింది. ఇలా మన జీవనశైలిని వైద్య ఖర్చులకు ముడిపెడుతూ సాగిన తొలి పరిశోధన ఇదే! ఈ అంచనా ప్రకారం 67.5 బిలియన్‌ డాలర్లు, అంటే సుమారు నాలుగు లక్షల కోట్లు, వ్యాయామం లేకపోవడం వల్ల కోరి తెచ్చుకున్న జబ్బులకు అవుతున్న ఖర్చు! ఇది కేవలం వ్యక్తిగతంగానే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకూ, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకూ శరాఘాతంగా పరిణమిస్తోంది.

 

లాన్సెట్‌ ప్రచురించిన మూడో నివేదికలో, గత నాలుగు సంవత్సరాలుగా మనుషుల తీరులో ఎలాంటి మార్పూ రాలేదన్న నిరాశ వెల్లడైంది. ఎన్ని ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నా, ఎంతమంది వైద్యులు ముందుకు తోస్తున్నా... తరచూ వ్యాయామం చేయాలన్న తపన ప్రజల్లో పెద్దగా పెరగలేదని వెల్లడైంది. కదలికలు లేని జీవనశైలి వల్ల అనారోగ్యం పాలవుతామని స్పష్టంగా సంకేతాలు తెలుస్తున్నా... నాలుగు అడుగులు వేయడానికి మనుషులు ఇంకా బద్ధకిస్తున్నారని తేలింది.

 

చివరగా లాన్సెట్‌ ప్రచురించిన నాలుగో నివేదికలో ప్రభుత్వమూ, పాఠశాలలూ, పర్యావరణ సంస్థలూ... ఇలా అన్ని రంగాలలోని యాజమాన్యం వ్యాయామానికి తగిన గుర్తింపునీ, ప్రోత్సాహాన్నీ ఇవ్వాలని పేర్కొంది. ఆరోగ్యం అనేది వ్యక్తిగతమైన విషయంగా చూడటం ఆపమని సూచించింది. అంటే జనం ఎలాగూ తమంతట తాముగా మారడం లేదు కాబట్టి... ప్రభుత్వం, విద్యాసంస్థలు, ఆఫీసుల ద్వారా అయినా వారిలో కొంత చురుకుని పుట్టించాలనుకుంటోందన్నమాట! మంచిదే!

 

- నిర్జర.

By
en-us Political News

  
సాధారణంగా తాంబూలం వేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఆ తాంబూలానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలను జత చేస్తే, అది గుండెను రక్షించే ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుందని..
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై..
నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి మరియు జీవనశైలి కారణంగా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనల్ని నిరంతరం వేధించే ప్రధాన శత్రువులు ఒత్తిడి మరియు ఆందోళన. వీటితో పాటు థైరాయిడ్..
బ్రేక్ ఫాస్ట్ లేదా అల్పాహారం నేటికాలపు జీవనశైలికి చాలా ముఖ్యంగా మారింది.  ఉదయాన్నే అల్పాహారం తప్పకుండా తినాలని వైద్యుల నుండి ఆహార నిపుణుల వరకు ప్రతి ఒక్కరూ చెబుతారు.  అయితే చాలామంది అల్పాహారంలో..
కాలంతో పాటు అన్ని అలవాట్లు అప్డేట్ అవుతూ ఉన్నాయి.  మొదట వేప పుల్లలతో పళ్లు తోమేవారు,  తర్వాత పేస్ట్ లు వచ్చాయి.  ఆ తరువాత పేస్ట్ లలో ఉప్పు, బొగ్గు, లవంగం వంటివి చేరాయి.  అవి కూడా అయ్యాక మౌత్ వాష్ లు వచ్చాయి....
ఆరోగ్యకరమైన శరీరానికి జింక్ చాలా అవసరం. జింక్ కణజాలాలను బాగుచేస్తుందని చెబుతారు. జింక్ ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. చర్మం..
ఇనుప పాత్రలో వంట చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. ఎందుకంటే ఇనుప పాత్రలో వంట చేయడం వల్ల ఆ ఆహారాన్ని ఐరన్ ఖనిజం చేరుతుంది.  దీని వల్ల శరీరానికి ఐరన్ ఎలాంటి సప్లిమెంట్ ..
ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు   ఎక్కువ సమయాన్ని మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ స్క్రీన్‌ల ముందు గడుపుతున్నారు. దీని ఫలితంగా, కంటి అలసట , చికాకు సర్వసాధారణమైపోయాయి...
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సరైన నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి...
AI..ప్రపంచం అంతా వాడుతున్న కృత్రిమ మేధస్సు ఇది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ కృత్రిమ మేధస్సు వాడకం చాలా పెరిగింది.  ఏ చిన్న సందేహం వచ్చినా ఏఐ ని వాడటం, దాన్ని సలహాలు, సూచలు అడగడం..
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మోకాళ్ళ నొప్పులు. జీవనశైలిలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం మరియు సరైన పోషకాహారం..
వేసవి మొదలవ్వగానే తీవ్రమైన ఎండ , పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మన రోజువారీ  కార్యకలాపాలు , ఆరోగ్యంపై ప్రభావం చూపడం మొదలవుతుంది. ఈ రోజుల్లో బయట కొద్దిసేపు ఉన్నా కూడా శరీరం అలసిపోయేంత వేడిగా ఉంటుంది...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.