Publish Date:Dec 31, 2022
ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువ క్రికెటర్ రిషబ్ పంత్ ను సకాలంలో రక్షించి ఆసుపత్రికి తరలించిన హరియాణా బస్సు డ్రైవర్ సుశీల్ కుమార్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అన్ని వర్గాలు సుశీల్ కుమార్ ను ప్రశంసించడమే కాదు.. కృతజ్ణతలు కూడా తెలుపుతున్నాయి.
కుటంబ సభ్యులతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి తన స్వస్థలమైన రూర్కికి వెళ్తూ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.
శుక్రవారం (డిసెంబర్ 30) తెల్లవారుజామున 5.30 గంటలకు పంత్ ప్రయాణిస్తున్న కారు ఢిల్లీ-డెహ్రాడూన్ జాతీయ రహదారిలో రూర్కీ నర్సన్ సరిహద్దు వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పంత్ ప్రయాణిస్తున్న కారు పూర్తిగా దగ్ధమైంది. తీవ్రంగా గాయాలు అయిన అతడు ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడిని మరింత మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించనున్నారు. కాగా ప్రమాదం జరిగిన వెంటనే రిషబ్ పంత్ కారు మెర్సిడెస్ ఏఎమ్‌జి జిఎల్ఇ 43 4మ్యాటిక్ కూపేలో మంటలు చెలరేగాయి.
దాంతో కారు అద్దం పగలగొట్టి బయటకు వచ్చేందుకు పంత్ ప్రయత్నించాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న హరియాణా బస్సు డ్రైవర్ సుశీల్ కుమార్ తన వాహనాన్ని రోడ్డు పక్కన ఆపేసి ఘటనా స్థలానికి పరిగెత్తుకొచ్చాడు. కారు కిటికీలో నుంచి సగం బయటకు వచ్చిన పంత్‌ను బయటకు లాగాడు. ఓ బెడ్‌షీట్‌తో పంత్ శరీరాన్ని కప్పాడు.
వెంటనే అంబులెన్సుకు సమాచారం అందించి.. అందులో ఆసుపత్రికి పంపించాడు.ఇంతకీ ఈ డ్రైవర్ సుశీల్ కుమార్ కు క్రికెట్ తెలియదు. పంత్ ఎవరో కూడా తెలియదు. అయినా సమయానికి ఆపద్బాంధవుడిలా రిషబ్ పంత్ ను కాపాడాడు, మంచి మనసుతో, సేవా దృక్ఫథంతో యువ క్రికెటర్ ప్రాణాలు కాపాడిన సుశీల్ కుమార్ కు మాజీ క్రికెటర్ హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ కృతజ్ణతలు తెలియజేస్తూ ట్వీట్ చేశాడు.మీ నిస్వార్థ సేవకు మేమంతా రుణపడి ఉంటామని లక్ష్మణ్ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. అలాగే ఆ బస్సు కండక్టర్ పరంజిత్ కూడా లక్ష్మణ్ ఆ ట్వీట్ లో ధన్యవాదాలు తెలిపాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/laxman-gratitude-to-bus-friver-who-saved-panth-25-149322.html
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Telangana government pays special attention to the renovation of barrages, Revanth Reddy, Kaleshwaram Project, Medigadda Barrage, Annaram Barrage, Sundilla Barrage, Kaleshwaram Barrage Repairs, Barrage Restoration, Dam Safety, NDSA, Irrigation Projects, Devadula Lift Irrigation, Sitarama Lift Irrigation
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాలు ముగిశాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక విధానంలో అత్యంత కీలకమైన మార్పులకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.