దేశం శ్రేణులు లక్ష్యంగా దాడులు, హత్యలు.. చోద్యం చూస్తున్న పోలీసులు.. పరామర్శకు కూడా నో పర్మిషన్

Publish Date:Jun 4, 2022

Advertisement

రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందా? తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయా? దాడులు చేసిన వారిని వెనకేసుకొస్తూ.. పోలీసులు విపక్ష నేతలను నిర్బంధిస్తున్నారా. కనీసం మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు కూడా అనుమతించకుండా గృహ నిర్బంధాలతో వేధిస్తున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అద్వానంగా తయారైందనీ, అధికార పక్షం దాష్టీకాలకూ, దౌర్జన్యాలకూ అంతు లేకుండా పోయిందనీ విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలపై యథేచ్ఛగా దాడులు జరుగుతుంటే చోద్యం చూస్తున్న పోలీసులు, మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు కూడా తెలుగుదేశంనేతలను అనుమతించడం లేదు.

రాష్ట్రంలో నియంత రాజ్యం నడుస్తోందని, ప్రజాస్వామ్యం అపహాస్యంపాలౌతోందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. మేం దాడులు చేస్తాం... హత్యలు చేస్తాం.. అయినా సరే విపక్ష నేతలు నిరసనలు చేయడానికి కానీ మృతుని కుటుంబాలను పరామర్శించడానికి కానీ వీలు లేదు అన్నట్లుగానే రాష్ట్రంలో అధికార వైసీపీ వ్యవహరిస్తోందని దుయ్య బడుతున్నారు.    తాజాగా వైసీపీ వర్గీయుల చేతిలో హత్యకు గురైన కుంచర్ల జల్లయ్య అంత్రికియలకు హాజరయ్యేందుకు తెలుగుదేశం నేతలెవరూ హాజరు కాకుండా పోలీసులు ముందస్తు అరెస్టు చేస్తున్నారు. కంచర్ల జల్లయ్య అంత్యక్రియలు శనివారంనరసరావుపేటలో జరుగుతున్న  నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టుల పర్వానికి తెర తీశారు. జలయ్య మృతదేహానికి నివాళులర్పించేందుకు బయలు దేరిన  మాజీ మంత్రి తెలుగుదేశం నాయకుడు నక్కా ఆనందబాబును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆ సందర్భంగా నక్కాఆనందబాబు పోలీసుల మధ్య వాగ్వాదంజరిగింది. తనను ఎందుకు ఆపుతున్నారో చెప్పాలంటే నక్కా ఆనందబాబు పోలీసులను నిలదీశారు. అక్రమంగా నిర్భంధిస్తే కోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు. వైసీపీ నేతలు చెప్పినట్లల్లా ఆడితే భవిష్యత్ లో పోలీసులు ఇబ్బందులు పడటం ఖాయమని నక్కా ఆనందబాబు అన్నారు. పట్టపగలు నడిరోడ్డుపై వైసీపీ గూండాలు హత్యలు చేస్తుంటే ఆపలేరు కానీ పరామర్శలకు వెళ్లే తెలుగుదేశం నేతలను నిర్బంధించడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పల్నాడు జిల్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెలుగుదేశం కార్యకర్త జల్లయ్యను దారుణ హత్యకు గురైన సంగతి విదితమే.  తెలుగుదేశం నేతలు జల్లయ్య హత్యను ఖండించారు. ఆయన మృతదేహానికి నివాళులర్పించి.. కుటుంబాన్ని పరామర్శించేందుకు నరసరావు పేట బయలు దేరిన తెలుగుదేశం నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.

గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, విజయవాడలో బుద్ధా వెంకన్న, తేలుకుంట్లలో యరపతినేని శ్రినివాసరావు, మాచర్లలో జూలకంటి బ్రహ్మారెడ్డి, పొందుగుల వద్ద మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావులను పోలీసులు అడ్డుకున్నారు.   రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దుర్గి మండలం జంగమేశ్వరపాడుకు చెందిన టీడీపీ కార్యకర్త కంచర్ల జల్లయ్య ఆ గ్రామాన్ని విడిచిపెట్టి గత మూడేళ్లుగా మాడుగుల గ్రామంలో ఉంటున్నాడు. బ్యాంకు పని మీద ఆయన దుర్గికి వెళ్లాల్సి ఉండటంతో గురువారం రాత్రి జంగమేశ్వరపాడుకు వచ్చాడు.

శుక్రవారం ఉదయమే దుర్గిలోని బ్యాంకుకు వెళుతుండగా దారి కాచి వైసీపీ వర్గీయులు జల్లయ్యపై   వేటకొడవళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు.ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన జల్లయ్యను మాచర్ల ప్రభుత్వాసుపత్రికి అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జల్లయ్య మరణించాడు. జల్లయ్య పై దాడికి పాత కక్షలే కారణమని పోలీసులు చెబుతుండగా, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే జల్లయ్య హత్య జరిగిందని, వైసీపీ గూండాలే ఈ దాడికి కారణమని తెలుగుదేశం ఆరోపిస్తున్నది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనీ, పోలీసులు వైసీపీ తొత్తులుగా మారి వారి అరాచకాలకు, దౌర్జన్యాలకూ దన్నుగా నిలుస్తున్నారని తెలుగుదేశం ఆరోపిస్తున్నది.  

By
en-us Political News

  
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
Telangana government pays special attention to the renovation of barrages, Revanth Reddy, Kaleshwaram Project, Medigadda Barrage, Annaram Barrage, Sundilla Barrage, Kaleshwaram Barrage Repairs, Barrage Restoration, Dam Safety, NDSA, Irrigation Projects, Devadula Lift Irrigation, Sitarama Lift Irrigation
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాలు ముగిశాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక విధానంలో అత్యంత కీలకమైన మార్పులకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.