న‌మో నారా భేటీలో న‌వ్వుల సంద‌డి

Publish Date:May 10, 2026

Advertisement

ఒక‌రు దేశానికి ప్రధాన మంత్రి.. మ‌రొక‌రు సీనియ‌ర్ ముఖ్యమంత్రి.. ఇద్దరూ రాజకీయాల్లో మేరు నగధీరులు... గంభీరంగా ఉంటారు. నిత్యం అభివృద్ధి-సంక్షేమం, దేశం-రాష్ట్రం గురించే వీరి ఆలోచ‌న‌, త‌ప‌న‌.  క్షణం తీరిక‌లేని పర్యటనల్లో ఉంటారు. తొలిసారిగా వీరిద్దరూ మధ్య స‌ర‌దా సంభాష‌ణ‌ల‌తో సమావేశం జరిగింది. హైదరాబాద్ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ఇంటికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ గంటకుపైగా సమయాన్ని చంద్రబాబు నివాసంలో గ‌డిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ మధ్య సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో ఆసాంతం న‌వ్వులు విరిశాయి. సీఎం చంద్రబాబు నివాసంలోకి అడుగు పెడుతుండగానే... ఓ ఫొటో చూసిన ప్రధాని ఏడాది క్రితం అనుభాలను గుర్తు చేసుకున్నారు. ప్రధాని న‌రేంద్ర మోదీ చేతుల మీదుగా స‌రిగ్గా ఏడాది క్రితం యువ‌గ‌ళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ ఢిల్లీలో చేయించారు మంత్రి నారా లోకేష్‌. అప్పటి ఫోటోను ఫ్రేమ్ చేయించి.. అందులో యువ‌గ‌ళం కాఫీ టేబుల్ బుక్ కూడా భద్రపరిచారు. ఇది సీఎం చంద్రబాబు ఇంట్లోకి వెళ్లే ముందు క‌నిపిస్తుంది. ప్రధాని మోదీ ఆ ఫొటోను చూసి నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. ఈ పుస్తకాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించి ఏడాది పూర్తైందనీ, యాధృచ్చికంగా ప్రధాని తమ ఇంటికి వ‌చ్చారంటూ ప్రధాని మోదీకి నాటి సంఘనటలను లోకేష్‌ గుర్తు చేశారు. ప్రధాని న‌రేంద్ర మోదీ సీఎం చంద్రబాబు ఇంటిలోని రామమందిరం వద్ద పూజ‌లు నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా సీతారాముల విగ్రహాలు దశాబ్దాల  నాటివని... ఆ పంచ‌లోహ విగ్రహాలను నంద‌మూరి తార‌క‌రామారావు గారు త‌మ‌కు ఇచ్చార‌ని సీఎం చంద్రబాబు ప్రధాని మోదీకి వివ‌రించారు. 

చంద్రబాబు నివాసంలో ప్రధానితో సమావేశం సందర్భంగా రాష్ట్రాభివృద్ధికి కేంద్రం, ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న సాయానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ సమావేశంలో లోకేష్ ఫిట్నెస్ పై ఆసక్తికర సంభాషణ జరిగింది. లోకేష్ ఇలా స్లిమ్‌గా, ఫిట్‌గా మార‌డానికి ప్రధాని మోదీనే కారణమని ముఖ్యమంత్రి తెలిపారు. తొలిసారి ప్రధానితో భేటీ అనంతరం లోకేష్ ఫిట్నెస్, డైట్ పై శ్రద్ధ పెట్టారని సీఎం చంద్రబాబు ప్రధానికి చెప్పారు. లోకేష్ ఇంక బరువు త‌గ్గొద్దంటూ మోదీ స‌ల‌హా ఇచ్చారు. ఫిట్నెస్ విష‌యంలో మీరే స్ఫూర్తి అని... మరింత ఫిట్ గా మారతానని లోకేష్ ప్రధానితో చెప్పారు. దేశం కోసం క్షణం తీరిక‌లేకుండా ప‌నిచేస్తున్నార‌ని, 75 ఏళ్ల వయస్సులో ప్రధాని పాటించే ఆరోగ్య సుత్రాలు, శారీర‌క ధృడ‌త్వం వంటివి తనకు స్ఫూర్తి అని మంత్రి లోకేష్ ప్రధానితో చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ పని విధానం చూస్తుంటే... పాతికేళ్ల   వయస్సున్న ముగ్గురు యువ‌కులు ప్రధానిలో ఉన్నట్టు చురుగ్గా పని చేస్తారని ఈ సందర్భంగా లోకేష్ అన్నారు. 

ప్రధాని న‌రేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు ఇద్దరూ త‌న‌కు మెంటార్లే ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ చెప్పారు. రాజ‌కీయాల్లోనూ, అభివృద్ధిలోనూ, ప్రజా సంక్షేమంలోనూ దేశంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు త‌న‌కు మార్గదర్శకులని... ఇద్దరూ త‌న‌కు మెంటార్లేన‌ని, గురువులుగా వారిని అనుస‌రిస్తాన‌ని లోకేష్ అన్నారు. అంకిత‌భావంతో, సేవా ధృక్ఫధంతో భావిత‌రాల కోసం నిస్వార్థంగా ప‌ని చేసే మోదీ, చంద్రబాబుల స్పీడ్ అందుకోవాల‌నే త‌న క‌ల సాకారం కావాల‌ని కోరుకుంటున్నాన్నారు. ప్రధాని న‌రేంద్ర మోదీని ఎప్పుడు క‌లిసినా త‌న నియోజ‌క‌వ‌ర్గం మంగ‌ళ‌గిరి చేనేత శాలువాతో సత్కరించడం నారా లోకేష్ ఆనవాయితీగా పెట్టుకున్నారు. మంగ‌ళ‌గిరి చేనేత శాలువాతో ప్రధానిని సత్కరించి లోకేష్‌.. మంగ‌ళ‌గిరి చేనేత విశిష్టతను ప్రధానికి వివ‌రించారు.

By
en-us Political News

  
జాతీయ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడెక్కుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కాంగ్రెస్ న్యాయపోరాటానికి దిగింది.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వెస్ట్ బైపాస్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
ప్రస్తుతం మార్కెట్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి
అర్థశాస్త్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి విజేతల ప్రకటన వెలువడింది.
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ
సికింద్రాబాద్‌లోని బొల్లారం చిన్నారి మోజెస్ అరెలియా కిడ్నాప్, హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.