హుజురాబాద్ పై లేటెస్ట్ సర్వే.. షాకింగ్ రిజల్ట్! 

Publish Date:Jun 24, 2021

Advertisement

తెలంగాణ రాజకీయాలన్ని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం కేంద్రంగానే సాగుతోంది. తన మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ను కేసీఆర్ తొలగించడం..  తర్వాత గులాబీ పార్టీకి ఈటల గుడ్ బై చెప్పడం జరిగిపోయాయి. అంతేకాదు బీజేపీలో చేరిన ఈటల.. హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. తనపై కేసీఆర్ దుర్మార్గంగా వ్యవహరించారని , కుట్రలు చేశారని ఆరోపిస్తున్న రాజేందర్..  అసెంబ్లీ ఉప ఎన్నికలో తన సత్తా చాటి గులాబీ బాస్ కు షాకివ్వాలని భావిస్తున్నారు. అందుకే ఆయన నియోజకవర్గంలోని గ్రామాలన్ని తిరుగుతున్నారు. తన మద్దతుదారులతో కలిసి బలప్రదర్శన చేస్తున్నారు. అటు కేసీఆర్ కూడా హుజురాబాద్ పైనే ఫోకస్ చేశారు. కేసీఆర్ డైరెక్షన్ లోనే అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఈటలకు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నారు. ఇక తమకు పట్టున్న ప్రాంతంలో పట్టు నిలుపుకుని  తామే ప్రత్యామ్నాయని చాటే యోచనలో కాంగ్రెస్ నేతలున్నారు. 

జూన్ లో రాజేందర్ రాజీనామా చేశారు కాబట్టి... నవంబర్ వరకు భర్తీ చేయాల్సి ఉంటుంది. పశ్చిమ బెంగాల్ తో పాటు పలు రాష్ట్రాల్లో కొన్ని లోక్ సభ, అసెంబ్లీ సీట్లు ఖాళీగా ఉండటంతో వాటికి సెప్టెంబర్ లో ఎన్నికలు జరపాల్సి ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే హుజూరాబాద్ నియోజకవర్గానికి సెప్టెంబరు నెలలో ఉప ఎన్నిక రావొచ్చని అంచనా వేస్తున్నారు. కరోనా మూడో వేవ్  విరుచుకుపడితే మాత్రం కొంత సమయం వాయిదా పడవచ్చు. అయితే ఉప ఎన్నికకు ఇంకా చాలా సమయం ఉన్నా హుజురాబాద్ లో అప్పుడే రాజకీయం వేడెక్కింది. అన్ని పార్టీల నేతలు హుజురాబాద్ పైనే పడటంతో... నియోజకవర్గంలో ఎన్నికల సందడి కనిపిస్తోంది. హుజురాబాద్ లో ఉప ఎన్నిక జరిగితే ఎవరూ గెలుస్తారన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఏపీలోనూ ఈటల నియోజకవర్గంపై ఆసక్తి పెరిగిందని తెలుస్తోంది. 

తెలంగాణలో అత్యంత కీలకం కాబోతున్న హుజురాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల ఎవరూ గెలుస్తారన్న దానిపై సర్వే సంస్థలు రంగంలోకి దిగాయి. హుజూరాబాద్ లో ప్రస్తుతం ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? 
ఎవరు గెలుస్తారు? జనాల మైండ్ సెట్ ఎలా ఉంది? ప్రభుత్వంపై ప్రజలు ఏమనుకుంటున్నారు? అనే విషయాన్ని తెలుసుకునేందుకు విన్ పొలిటికల్ కన్సల్టెన్సీ అనే సర్వే సంస్థ హుజూరాబాద్ నియోజకవర్గంలో సర్వే చేసింది. ఈటల రాజీనామా, బీజేపీలో చేరిన తర్వాతే నిర్వహించిన సర్వే రిపోర్ట్ ను విన్ పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ గురువారం రిలీజ్ చేసింది. సర్వే రిపోర్టులో షాకింగ్ విషయాలు తెలిశాయి. 

హుజురాబాద్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 2,05,182 ఉండగా ఇందులో పోలయ్యే ఓట్లు లక్షా ఎనభై వేలకు పైనే ఉంటాయని సర్వే సంస్థ అంచనా వేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో లక్షా 87 వేల 25 ఓట్లు పోలయ్యాయి.  టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటల రాజేందర్ కు 1,04,840 ఓట్లు, కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన కౌశిక్ రెడ్డికి 61,121 ఓట్లు రాగా.. రాజేందర్ 47,803 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే హుజురాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈటల రాజేందర్ చేరికతో బలపడిన బీజేపీకి 35 శాతం ఓట్లు వస్తాయని తేలింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థికి కేవలం ఒక్క శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈటల చేరికతో అది 35  శాతానికి చేరిందని  విన్ పొలిటికల్ కన్సల్టెన్సీ సర్వేలో తేలింది. కాంగ్రెస్ కు గతంలో కంటే భాగా తగ్గి 20 శాతం ఓట్లు వస్తాయని వెల్లడైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ లో కాంగ్రెస్ కు దాదాపు 35 శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే హుజురాబాద్ లో మళ్లీ అధికార పార్టీనే గెలుస్తుందని సర్వేలో స్పష్టమైంది. టీఆర్ఎస్ కు 40 శాతం ఓట్లు రానున్నాయి. అంటే బీజేపీ కంటే ఐదు శాతం ఓట్ల ఆధిక్యంలో ఉంది గులాబీ పార్టీ. ఇతరులకు ఐదు శాతం ఓట్లు వస్తాయని విన్ పొలిటికల్ కన్సల్టెన్సీ సర్వేలో తేలింది. 

టిఆర్ఎస్ కు అంతగా ఆదరణ ఎందుకు ఉందని సర్వేలో అడిగిన ప్రశ్నలకు ప్రజల నుంచి వచ్చిన జవాబు కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలేనని తేలింది. బీజేపీకి వచ్చేసరికి ఈటల రాజేందర్ బలమైన బీసీ నేత గా ఉండడంతోపాటు టిఆర్ఎస్ నుంచి గెంటివేయబడడం వల్ల ప్రజల్లో సానుభూతి ఉందని తేల్చింది. అయితే అవినీతి ఆరోపణలు రావడం, ఇప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉండటం ఆయనకు వ్యక్తిగతంగా మైనస్ గా కనిపిస్తున్నాయని సర్వే సంస్థ విన్ పొలిటికల్ కన్సల్టెన్సీ వెల్లడించింది. కాంగ్రెస్ కి వచ్చేసరికి పాడి కౌశిక్ రెడ్డి పై కొద్ది వరకు ప్రజల్లో ఆదరణ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పరిస్థితి ఆయనకు మైనస్ గా కనిపిస్తున్నది అని పేర్కొంది. ఈటల రాజేందర్ కు తన సొంత మండలం అయిన కమలాపూర్ లో భారీ మద్దతు ఉండగా పాడి కౌశిక్ రెడ్డి కి తన సొంత మండలం అయిన వీణవంక లో కొద్ది వరకు ప్రజా బలాన్ని కూడగట్టుకోగలిగారు.

ఒకవేళ పాడి కౌశిక్ రెడ్డి కనుక టిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేస్తే టిఆర్ఎస్ పార్టీకి, కౌశిక్ రెడ్డికి బాగా కలిసి రానుందని తెలిపింది. అప్పుడు పోటీ కేవలం టిఆర్ఎస్ బిజెపి ల మధ్య ఉండనుందని, కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోసం కష్టపడాల్సిన పరిస్థితులు ఉంటాయని పొలిటికల్ కన్సల్టెన్సీ సర్వేలో తేటతెల్లమయింది. 

By
en-us Political News

  
అమర రాజా వంటి గ్లోబల్ టెక్నాలజీ సంస్థ వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏపీలో కాకుండా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పెట్టడం ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీని చేజార్చుకోవడమేనని ప్రముఖ విశ్లేషకుడు సువేరా అన్నారు. తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన రాజకీయం, కులం, ప్రాంతీయ విద్వేషాల కారణాలతో ఇటువంటి పారిశ్రామిక దిగ్గజం రాష్ట్రం వీడాల్సి రావడం వల్ల యువతకు రావలసిన ఉపాధి అవకాశాలు చేజారిపోయాయన్నారు.
ఆ నక్కల కారణంగానే తాను తన మార్గాన్ని ఎంచుకుని బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలోని తన మాజీ సహచరులపై తీవ్ర విమర్శలు గుప్పించిన కవిత.. బీఆర్ఎస్‌లోని కొందరు గుంటనక్కల వంటి నేతల బృందం తనను ఒంటరిని చేసి, పక్కన పెట్టడానికి పద్ధతి ప్రకారం పనిచేశారని కవిత చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ అత్యంత కీలకమైన మలుపుగా మారబోతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అత్యంత ఉత్కంఠభరిత వాతావరణంలో ప్రారంభం కానున్నాయి.
శాంతిభద్రతల విఘాతం కలగకుండా ఉండేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందస్తు భద్రతా వ్యూహంలో భాగంగా సెంట్రల్ ఢిల్లీని దాదాపు తమ అధీనంలోకి తీసుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఈ చలో పార్లమెంట్ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో తనదైన విలక్షణ శైలితో నిత్యం వార్తల్లో నిలిచే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసినట్లేనా.. అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. గత కొంతకాలంగా ఆయన కారు దిగిపోనున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఆ ప్రచారానికి బలం చేకూర్చింది. సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న వేదికపై ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఉన్నారు. ఆ వేదికపై ప్రసంగిస్తున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నా.. మల్లారెడ్డి పట్టించుకోకుండా చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. సొంత పార్టీ అధినేతను అంతగా విమర్శిస్తున్నా మల్లారెడ్డిలో స్పందన లేకపోవడంతో ఆయన కారు దేగేయడం ఖాయమన్న ప్రచారానికి బలం చేకూర్చింది. అలాగే ఇటీవలే.. ఆయన ఒక ప్రైవేటు కార్యక్రమంలో కూడా తాను బీఆర్ఎస్ ను వీడనున్నట్లు సంకేతాలిచ్చారు. వాస్తవానికి.. గత ఎన్నికలలో పరాజయం పాలై బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన నాటి నుంచీ కూడా మల్లారెడ్డి పొలిటికల్ గా ఒకింత ఇనాక్టివ్ అయ్యారనే చెప్పారు. చాలా కాలంగా మల్లారెడ్డి అధికార కాంగ్రెస్ లేదా కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తన వ్యాపార, విద్యారంగ సంస్థల పరిరక్షణతో పాటు నియోజకవర్గంలో రాజకీయ ఉనికి కోసం ఆయన అధికార పార్టీతో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన చామకూర మల్లారెడ్డి.. ఇప్పుడు ఆయన ప్రసంగిస్తున్న వేదికపై కనిపించడం పట్ల కమలం శ్రేణుల్లో కూడా ఆగ్రహం వ్యక్తమౌతోంది. మొత్తం మీద మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడం ఖాయమన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. అయితే ఆయన కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా? కాషాయ తీర్థం పుచ్చుకుంటారా అన్న విషయంపై అయితే రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే అనేకమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు హస్తం గూటికి చేరిన నేపథ్యంలో, మల్లారెడ్డి కూడా అదే బాట పడతారన్న అభిప్రాయమే పరిశీలకులలో కూడా వ్యక్తమౌతోంది. chamakura malla reddy latest news, medchal mla malla reddy, telangana political updates
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ కీలక సమీక్ష నిర్వహించింది.
తెలంగాణ భారతీయ జనతా పార్టీల్లో ఒక్కసారిగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.