శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండ చరియలు
Publish Date:Oct 7, 2022
Advertisement
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏపీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాకపోకలకు అవాంతరం ఏర్పడింది. ఇక శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడటంతో ఘాట్ రోడ్డులో రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల – శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో శ్రైశైలం వెళ్లే ప్రయాణీకులు అవస్థలు పడుతున్నారు. కొండ చరియలు విరిగిపడిన సమయంలో ఆ మార్గంలో వాహనాలేవీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నిత్యం ఘా ఘాట్ కుండా వందల సంఖ్యలో వాహనాలలో భక్తులు శ్రీశైలానికి వెళుతుంటారు. కొండచరియలు విరిగిపడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలను తొలగించి రాకపోకలకు మార్గం సుగమం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/landslides-in-srisailam-ghat-road-traffc-trouble-25-145069.html





