Publish Date:May 21, 2025
ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫుల్ గా క్లాస్ పీకారు. పార్టీ క్రమశిక్షణ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని దాదాపుగా హెచ్చరించినంత పని చేశారు.
Publish Date:May 21, 2025
ఉత్తరాఖండ్ లో కొండ చరియలు విరిగిపడ్డాయి. పిలోరాగఢ్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడటంతో దాదాపు 180 మంది కైలాస్ మానసనరోవర్ యాత్రికులు మార్గ మధ్యంలో చిక్కుకుపోయారు. యాత్ర మార్గంలో కొండ చరియలు విరిగి పడటంతో వారు ఎటూ కదలలేని పరిస్థితి ఏర్పడింది.
Publish Date:May 21, 2025
వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో తీవ్రవాదం లేకుండా చేయాలన్న లక్ష్యంతో కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ లో భాగంగా ఇప్పటికే పలు ఎన్ కౌంటర్లలలో వందల మంది మావోయిస్టులు హతమయ్యారు.
Publish Date:May 21, 2025
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు ఇక ఈడీ అంటే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా చేపట్టనుంది. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తులో తెలుగుదేశం కూటమి సర్కార్ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ మాంచి దూకుడుమీద ఉంది. ఇప్పటికే పలువురు కీలక నిందితులను అరెస్టు చేసింది. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారణ కూడా చేసింది.
Publish Date:May 21, 2025
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజకీయ వేడి సెగలు కక్కుతోంది. ఐదేళ్ల జగన్ పాలనకు చరమగీతం పాడి గత ఎన్నికలలో అంటే 2024లో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత... కొంత కాలం రాష్ట్ర ప్రగతి, సంక్షేమం వినా మరే రాజకీయ కార్యక్రమం చేపట్టిన సర్కార్ ఇప్పుడు.. జగన్ హయాంలో జరిగిన నేరాలు, కుంభకోణాల నిగ్గు తేల్చడానికి నడుం బిగించింది.
Publish Date:May 20, 2025
బీహార్ శాసనసభ ఎన్నికలు వేగంగా కదులుతున్న ఋతుపవనాలను మించిన వేగంగా తరుము కొస్తున్నాయి. ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ సహజంగానే రాజకీయ వేడి పెరుగుతోంది. నిజానికి ఈ సంవత్సరం చివర్లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కేవలం బీహార్ కు మాత్రమే పరిమితమైన ఎన్నికలు కాదు. ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం దేశ రాజకీయ గతిని మార్చివేస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
Publish Date:May 20, 2025
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వేసవి సెలవులు ముగింపు దశకురావడం, వారాంతం సమీపిస్తుండటంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.
Publish Date:May 20, 2025
ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదోవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సన్మానించారు. ఉండవల్లిలో ఆయన విద్యార్థులతో ముఖముఖి నిర్వహించారు.
Publish Date:May 20, 2025
ఆంధ్రప్రదేశ్‌లో జూన్ ఒకటో తేదీ నుంచి చౌకధర దకాణాల ద్వారానే రేషన్ సరఫరా చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు దివ్యాంగులకు మాత్రం డోర్ డెలివరీ చేస్తాని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు.
Publish Date:May 20, 2025
రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయ పునరుద్ధరణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు.
Publish Date:May 20, 2025
తిరుమల తిరుపతి దేవస్థాన మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమల కొండల్లో ఉన్న పచ్చదనాన్ని అటవీశాఖ ద్వారా 68.14 శాతం నుండి 80 శాతానికి పెంచేందుకు నిర్ణయించారు. పచ్చదనాన్ని పెంచేందుకు రూ.4 కోట్ల కేటాయించింది. స్విమ్స్ ఆసుపత్రిలో 597 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు.
Publish Date:May 20, 2025
ఏపీ సీఎం చంద్రబాబు రేపు చిత్తూరు జిల్లా తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా బుధవారం మధ్యాహ్నం అమ్మవారిని కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి దర్శించుకుంటారు.
Publish Date:May 20, 2025
జగన్ అడ్డా కడపలో తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు అంటే మే 19 వరకూ జరిగే పసుపు పండుగ మహానాడు నిర్వహణ కోసం తెలుగుదేశం అధినేత చంద్రబాబు 19 కమిటీలను ఏర్పాటు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు.