మటంపల్లిలో ఇనుప యుగపు ఆనవాళ్లు

Publish Date:Feb 6, 2025

Advertisement

క్రీ.పూ.1000 ఏళ్లనాటి నిలువురాయి
కాపాడుకోవాలంటున్న ప్లీచ్ ఇండియా సీఈవో శివనాగిరెడ్డి

సూర్యాపేట జిల్లా, హుజూర్‌నగర్‌ మండలం, మటంపల్లిలో ఇనుపయుగపు ఆనవాళ్లున్నాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. కొత్త తెలంగాణా చరిత్ర బృందం సభ్యులు, అహోబిలం కరుణాకర్‌, నసీరుద్దీన్‌, చంటి ఇచ్చిన సమాచారం మేరకు గురువారం నాడు, ఆయన మటంపల్లి పాత శివాలయం దారిలో రోడ్డు పక్కనే ఉన్న 12 అడుగల ఎత్తు, 5 అడుగల వెడల్పు, 6 అంగుళాల మందం ఉన్న నిలువురాయి (స్మారకశిల)ని క్షుణ్ణంగా పరిశీలించి మటంపల్లి క్రీ.పూ.1000 ఏళ్ల నాటి ఇనుపయుగపు స్థావరమని చెప్పారు.

ఆకాలంలో మరణించిన వారిని ఒక గుంటలో పూడ్చి, పైన మట్టితో కప్పి, గుర్తుగా ఒక స్మారక శిలను నిలిపే ఆచారముండేదని, అందులో భాగంగానే ఈ నిలువురాతిని ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పారు. పురావస్తు, చారిత్రక ప్రాధాన్యతగల ఈ నిలువురాయిని కాపాడుకోవాలని మటంపల్లి గ్రామస్థులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సహకరించిన హుజూర్‌నగర్‌ బార్‌కౌన్సిల్‌ అధ్యక్షులు, ప్రముఖ హైకోర్టు అడ్వకేట్‌ సాముల రామిరెడ్డికి శివనాగిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

By
en-us Political News

  
విద్యాసంస్థల్లో అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల వర్తించే ఈ రిజర్వేషన్ ను రద్దు చేస్తూ ముస్లింలకు ఈ కోటా ఇకపై ఉండదని స్పష్టం చేసింది.
దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాలలో 37 రాజ్యసభ స్థానాలకు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వివిధ తేదీలలో ఖాళా అవుతాయి. అలా ఖాళీ అయ్యే స్థానాలలో తెలంగాణ కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు కేఆర్ సురేష్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీల స్థానాలు కూడా ఉన్నాయి.
నెలరోజుల పాటు సాగిన ఈ కిడ్నాప్ హైడ్రామాతో బాధిత కుటుంబం ప్రాణభయంతో వణుకుతూ దాదాపు నెలరోజుల పాటు బందీ జీవితం గడిపింది. చిట్టచివరకు పోలీసులను ఆశ్రయించింది.
పశ్చిమ బెంగాల్‌, అసోం, తమిళనాడు, కేరళ అసెంబ్లీలకూ, అలాగే పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీకి ఏప్రాల్ లో ఎన్నికలు జరగున్నాయనీ, ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను మార్చిలో విడుదల చేయనున్నామని కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి.
కేసీఆర్ కుమార్తె, జనజాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్ కు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పెట్టిన పోస్టు మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది.
పిటిన్ ను విచారించిన గుంటూరు కోర్టు.. అంబటిని ప్రత్యేక రిమాండ్ ఖైదీగా పరిగణించి, మాజీ మంత్రికి చట్ట ప్రకారం కల్పించాల్సిన ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది.
గ్రూపు మ్యాచుల్లో ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచుల్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచిన ఆసీస్ తన చివరి పోరుతో ఒమన్ తో ఈ నెల 20న తలపడనుంది.
బాధ్యత కలిగిన హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడతారని తాను ఊహించలేదంటూ త్రిష స్పందనను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. తన క్లయింట్‌కు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, నటనకే పరిమితమని, సంబంధం లేని వ్యహహారాల్లో ఆమెను లాగవద్దని విజ్ఞప్తి చేశారు.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన నియోజకవర్గం పరిధిలో ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంచలన విజయాన్ని కట్టబెట్టారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలో ఉన్న మున్సిపాలిటీల్లో గూడెం మహిపాల్ రెడ్డి అండతో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది.
మున్సిపల్ కార్పొరేషన్‌లో తమకే సంఖ్యా బలం అధికంగా ఉందని టీడీపీ నేతలు పేర్కొన్నారు. కాగా, నెల్లూరు మేయర్ పదవికి దేవరకొండ శ్రీలతని తెలుగుదేశం ఎంపిక‌ చేసిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
2023 ఎన్నిక‌ల నాటి పరిస్థితులను ఒక్కసారి గమనిస్తే.. ఇదే కామారెడ్డి కేంద్రంగా కాంగ్రెస్ సీఎం అభ్య‌ర్ధి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ సీఎం అభ్యర్థి పోటీ పడగా, ఇరువురూ పరాజయం పాలయ్యారు. బీజేపీకి చెందిన వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. ఒకే ఎన్నికలో ఇద్దరు సీఎంలను ఓడించిన ఘనత సాధించారు. ఇక ప్రస్తుతానికి వస్తే.. కామారెడ్డిలో ఎప్పుడూ కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య పోటాపోటీ వాతావరణం ఉంటుంది. అటువంటిది.. ఆ రెండు పార్టీలూ చెట్టాపట్టాలేసుకుని మరీ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులను పంచుకోవడం విడ్డూరంగా ఉందంటున్నారు కామారెడ్డి జనం.
డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్, వరప్రసాద్, లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇలా పలువురు బ్యూరోక్రాట్లు పాలిటిక్స్ లోకి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు, కుంటున్నారు. వీరిలో జయప్రకాశ్ నారాయణ లోక్ సత్తా పార్టీ తరఫున 2009 లో కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి విజయ సాధించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.