కనిపించుటలేదు!

Publish Date:Nov 14, 2013

Advertisement

 

 

 

ఉండవల్లి అరుణ్‌కుమార్, లగడపాటి రాజగోపాల్ అనే ఇద్దరు రాజకీయ నాయకులు గతంలో ప్రతిరోజూ మీడియాలో కనిపించేవారు. తెలంగాణ రాదు.. సీమాంధ్రులకేం భయంలేదు.. తెలంగాణ రాకుండా చేసే సత్తా మాకు వుందని చెప్పేవారు. వీళ్ళమాటలు నమ్మి సీమాంధ్రులు దారుణంగా మోసపోయారు.

 

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వడానికి మహా ఆత్రంగా పరిగెత్తుతున్న ప్రస్తుత తరుణంలో వారం పది రోజులకు ఒకసారి కూడా వీళ్ళు మీడియాలో కనిపించడం లేదు. అలాగే సీమాంధ్రలో కూడా వీళ్ళు ఎక్కడా కనిపించడం లేదు. వీళ్ళ నియోజకవర్గాల ప్రజలకయితే అస్సలు కనిపించడం లేదు. ఈ క్రింది ఆధారాలతో వీళ్ళిద్దర్నీ గుర్తుపట్టవచ్చు. వీళ్ళలో ఉండవల్లి అనే వ్యక్తి చాలా మాటకారి. మాటలతోనే కడుపు నింపేస్తూ వుంటాడు. లాపాయింట్లు తీస్తూ వుంటాడు. అస్సలు కోపాన్ని ప్రదర్శించకుండా చిరునవ్వుతో వుంటాడు. ఈయన న్యూఢిల్లీలో సోనియాగాంధీ ఇల్లు, ఎఐసీసీ ఆఫీసు పరిసరాల్లో తిరుగుతూ వుండొచ్చు.



అలాగే లగడపాటి రాజగోపాల్ చూడ్డానికి స్పోర్ట్స్ మాన్‌లాగా వుంటాడు.  జేబులో ఎప్పుడూ డబ్బుల కట్టలు పెట్టుకుని వుంటాడు. దేన్నయినా డబ్బుతో కొనేయొచ్చన్న ఆత్మవిశ్వాసం ముఖంలో కనిపిస్తూ వుంటుంది. ఒక్కసారి మాట్లాడ్డం మొదలుపెడితే ఎంతసేపయినా నాన్‌స్టాప్‌గా మాట్లాడుతూనే వుంటాడు. ఈయన కూడా ఉండవల్లి కనిపించే ఏరియాల్లోనే కనిపించే ఛాన్సుంది. వీళ్ళిద్దరూ ఉండవల్లి, లగడపాటి అని షార్ట్ కట్ పేర్లతో పిలిస్తే పలుకుతారు. వీళ్ళు ఎవరికైనా కనిపిస్తే దయచేసి మాకు మాత్రం అప్పగించవద్దు. వాళ్ళని తీసుకెళ్ళి వేరే ఏదైనా స్టేట్‌లో వదిలేయగలరు.



మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళవద్దని బెదిరించగలరు. వాళ్ళు కనిపించకుండా వుంటేనే మాకు హాయిగా వుంది. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ వైపు రాకుండా చేసిన వాళ్ళకి మంచి బహుమతి అందించగలం. బాబూ ఉండవల్లీ, నాయనా లగడపాటీ.. మీరు దయచేసి ఆంధ్రప్రదేశ్‌కి రాకండి. వచ్చి మా చెవుల్లో మళ్ళీ పూలు పెట్టే ప్రయత్నం చేయకండి. మిమ్మల్ని నమ్మి ఆల్రెడీ ఒకసారి మోసపోయాం. మమ్మల్ని మళ్ళీ మోసం చేయకండి.
                                 

   ఇట్లు
                                సీమాంధ్ర ప్రజలు

 

By
en-us Political News

  
చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న పవన్ సామాజిక వర్గం, ఆయన్ను పెద్దగా ఆదరించింది లేదు. డైరెక్టు ఎలక్షన్లలో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారాయన. నిజంగా తనకు కులం బంలం ఉండి ఉంటే, రెండు చోట్ల గెలిచేవాడిని కదా? అని ప్రశ్నిస్తారు పవన్.
బీజేపీ అక్కడ ఎంత పటిష్టంగా వేళ్లూనుకుందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా మారింది. ఈ పరిణామాలతో టీఎంసీ మనుగడకే పెను ముప్పు పొంచి ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సాధ్యం కాలేదు. అనేక రోజులు ఢిల్లీలో బుజ్జగింపులు, సంప్రదింపులు జరిగాయి.కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, ప్రియాంక గాధీ వంటి వూరు రంగంలోకి దిగి బుజ్జగింపులు, సంప్రదింపులు జరిపారు.
ఈ రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం ( మే 25) అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటైంది. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననుండటం గమనార్హం. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లోను, నాయకత్వ స్థాయిలోనూ అంతర్గతంగా సాగుతున్న అసంతృప్తులు, మార్పుల గుసగుసలకు ఈ భేటీతో ఒక స్పష్టమైన ముగింపు పలకాలని అధిష్ఠానం భావిస్తోంది.
వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు మ‌ళ్లీ తెర‌పైకి.
రెండు నెలల కాలంలోనే దాదాపు తొమ్మిది ప్రాంతాలకు ప్రస్తుతం ఉన్న పేర్లు మార్చి పాత పేర్లను ఖరారు చేశారు.
విజ‌య్ ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిగ్‌గా మారింది.
దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి పిలుపునకు అనుగుణంగా.. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.