Publish Date:Jul 15, 2025
తిరుమల దేవుడి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ కేసులో సుప్రీం కోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల లడ్డూ కల్తి వ్యవహారంలో వాస్తవాలను వెలికి తీయడం లక్ష్యంగా సుప్రీం కోర్టు గత ఏడాది అక్టోబర్ లో స్వతంత్ర సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి విదితమే. ఈ సిట్ కు సీబీఐ డైరెక్టర్ నేతృత్వం వహిస్తుండగా, రాష్ట్ర పోలీసు శాఖ, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ అధారిటీ అధికారులు సభ్యులుగా ఉన్నారు. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తులో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ జరిగిందని నిర్ధారణ అయ్యింది. తన దర్యాప్తులో కనుగొన్న విషయాలను సిట్ సుప్రీం కోర్టుకు సీల్డ్ కవర్ లో నివేదించింది. లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించిన నెయ్యి కల్తీ కేసుకు సంబంధించి సిట్ 14 మందిని అరెస్టు చేసింది. అరెస్టు చేసిన వారిలో బోలెబాబా డెయిరీ, ఏఆర్ డెయిరీ, వైష్ణవీ డెయిరీ డైరెక్టర్లు, సిబ్బంది ఉన్నారు. అలాగే సిట్ తన దర్యాప్తులో బాగంగా టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్న సహా పలువురు టీటీడీ ఉద్యోగులను విచారించింది. ఈ విషయాన్ని కూడా సిట్ సుప్రీంకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. అంతే కాకుండా ఈ కేసులో నిందితులు దర్యాప్తును అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలను సవివరంగా ఆ నివేదికలో పొందుపరిచింది.
ఈ నేపథ్యంలోనే టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ కేసులో దర్యాప్తు సుప్రీం కోర్టు పర్యవేక్షణలో పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరిగేలా చూడాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు దర్యాప్తు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మితిమీరి జోక్యం చేసుకుని రాజకీయ ఒత్తిడిని తీసుకువస్తోందని ఆయన తన పిటిషన్ లో ఆరోపించారు. కాగా సుబ్బారెడ్డి బెయిలు పిటిషన్ విచారణను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కు లిస్ట్ చేయవలసిందిగా.. ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ వినోద్ చంద్రన్, జస్టిస్ నిలయ్ విపిన్ చంద్రఅంజారియాల ధర్మాసనం కోరింది. అదలా ఉంచితే.. లడ్డూ ప్రసాదం తీయారీలో వినియోగిచిన నెయ్యిలో కల్తీ వ్యవహారంలో తనను అరెస్టు చేస్తారన్న భయం సుబ్బారెడ్డిలో పెరిగిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/laddu-prasadam-adultration-case-39-202031.html
దేశంలో పేపర్ బ్యాలెట్ విధానాన్ని తిరిగి ప్రవేశ పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం మరోసారి ఎమ్మెల్యే పదవి రాజీనామాకు సిద్ధమని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఏంటీ జగన్ మోహన రెడ్డి ఇప్పటి వరకూ తనపై ఉన్న 31 కేసులలో 3452 సార్లు.. వాయిదాలు తీసుకుని ప్రపంచ రికార్డు సృష్టించారా? ఇందుకోసంగానూ ఆయన 6904 కోట్ల రూపాయల మేర ఖర్చు చేశారా? ఆశ్చర్యం కలిగిస్తున్నా.. ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. బేసిగ్గా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన ఐదేళ్ల పదవీ కాలంలో .. సీఎంగా తన హోదా కారణంగా బిజీబిజీ అంటూ వాయిదాల మీద వాయిదాలు తీసుకున్నసంగతి తెలిసిందే.
బంజారాహిల్స్‌లోని రోడ్డు నంబర్ 1/12లో రోడ్డు కుంగిపోయింది. అటు వచ్చిన వాటర్ ట్యాంకర్ ఒక్కసారిగా దిగబడిపోయింది. దీంతో వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌తో పాటు క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై దీర్ఘకాలంగా సాగుతున్న క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తమపై ఉన్న క్రిమినల్ కేసును క్వాష్ చేయాలని కోరుతూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం అనుమతించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై డిపాజిటర్ల నుంచి ఎటువంటి అభ్యంతరం, ఆరోపణా లేకపోవడంతో కేసు కొనసాగించాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంది.
ఋతుపవన ద్రోణి, బంగాళాఖాతం లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కుమ్మేస్తున్నాయి.
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ పట్టణంలో క్లౌడ్ బరస్ట్ ధాటికి కొండ చరియాలు విరిగిపడ్డాయి. వరద ప్రవాహంతో వందలాది ఇళ్లను ముంచేంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తయ్యింది. ఈ విషయాన్ని సీబీఐ దేశ సర్వోన్నత న్యాయస్థానానికి తెలియజేయడంతో.. ఇప్పడు చర్చ ఈ కేసులో కీలక నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డిపైకి మళ్లింది.
తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్ కు పంపించారు.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 8న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.
వాన రాకడ.. ప్రాణం పోకడ ఎవరూ చెప్పలేరంటారు. ఏదీ మన చేతుల్లో ఉండదు. మరణం ఎప్పుడు, ఎలా రాసిపెట్టి ఉంటుందో చెప్పలేం. పెద్ద పెద్ద ప్రమాదాల బారిన పడి కూడా ప్రాణాలతో బయటపడే వారుంటారు.
రాజకీయ నాయకుల భాష తీరు మారాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు.
జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (79) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన న్యూఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో ఇవాళ తుదిశ్వాస విడిచారు.