చక్రం తిప్పింది కేవీపీయే.. షర్మిల ఎంట్రీతో జగన్ కు శంకరగిరి మాన్యాలే!

Publish Date:Jan 21, 2024

Advertisement

కేవీపీ రామచందర్‌ రావు  ను దివంగత నేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి  ఆత్మగా చెబుతుంటారు. వైఎస్‌ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీని పెట్టినప్పటికీ కేవీపి కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత గత పదేళ్లుగా  ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నారు. రాజకీయంగా ఆయన క్రియాశీలంగా వ్యవహరించడం లేదని ఇప్పటి వరకూ అందరూ అనుకుంటూ వచ్చారు. అయితే ఆయన కాంగ్రెస్ కు ఏపీలో పూర్వ వైభవం తీసుకురావడానికి తెరవెనుక చక్రం తిప్పుతూనే ఉన్నారని తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ లో చోటుచేసుకుంటున్న పరిణామాలను బట్టి అర్ధమౌతోంది.  ఇప్పటి వరకు కాంగ్రెస్‌ ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉండి, ఇటీవలే షర్మిలకు రూట్ క్లియర్ చేస్తూ రాజీనామా చేసిన  గిడుగు రుద్రరాజు  కేవీపి రామచందర్‌ రావుకు సన్నిహితుడు. అసలు గిడుగు రుద్రరాజు రాజకీయాలలోకి వచ్చిందే కేవీపీ రామచంద్రరావు ద్వారా. ఆయన ఆశీస్సులతోనే గిడుగు ఎమ్మెల్సీ అయ్యారు. ఆ తరువాత పీసీసీ చీఫ్ అయ్యారు. 

ఇప్పుడు ఏపీ సీఎం   జగన్‌ సోదరి  షర్మిల   కాంగ్రెస్‌లో చేరి పిసిసి పగ్గాలు చేపట్టారు. షర్మిల ఏపీ సీఎం సోదరి మాత్రమే కాదు. వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ కూడా. ఆ షర్మిలకు మార్గం సుగమం చేయడానికే  పిసిసి పదవికి రుద్రరాజు రాజీనామా చేశారు. పిసిసి అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల ఆదివారం (జనవరి 21) బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు శనివారం (జనవరి 20)   షర్మిల ఇడుపులపాయలో తన తండ్రి రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించారు. హైదరాబాద్‌ నుంచి ఇడుపులపాయ  కు వెళ్లిన ఆమెతో కేవీపి రామచందర్‌ రావు కూడా ఉన్నారు.   అంటే షర్మిల కాంగ్రెస్ లో చేరిక వెనుక, అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకోవడానికి అవసరమైన వ్యూహరచన అంతా కేవీపీదేనని అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే ఇక ముందు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యూహాలు, ఎన్నికల ప్రణాళికలు అన్నీ కేవీపీ చేతుల మీదుగానే జరుగుతాయని అంటున్నారు.  
రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ స్థితిలో వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌కు తిరిగి ఊపిరిపోస్తారా, పార్టీకి రాష్ట్రంలో పూర్వ వైభవం తీసుకువస్తారా అన్నది పక్కన పెడితే..   పిసిసి అధ్యక్షురాలిగా పార్టీలో ఆమె వైఎస్ రాజశేఖరరెడ్డి లెగసీని కొనసాగిస్తారని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ నామమాత్రంగా మారిపోవడానికి ముఖ్యకారణం వైఎస్ జగన్. విభజన అనంతరం ఆయన కాంగ్రెస్ అధిష్ఠానంతో విభేదించి సొంత కుంపటి పెట్టుకోగానే..  పార్టీలోని వైఎస్ అనుచరులు అంతా ఆయన వెంట పార్టీని వీడారు. అంతకు ముందు అంటే వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉన్న సమయంలో, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ మొత్తం ఆయన వెనుకనే నడిచేది. కొద్ది మంది ఆయనతో విభేదించినా, వారి గొంతు వినిపించే పరిస్థితి కూడా రాష్ట్ర కాంగ్రెస్ లో ఉండేది కాదు. పార్టీలోని తన వ్యతిరేకులందరినీ వైఎస్ రాజశేఖరరెడ్డి దాదాపు క్రియా రహితంగా చేసేశారు. ఆ కారణంగానే వైఎస్ జగన్ వైసీపీ అంటూ సొంత పార్టీ పెట్టుకోగానే ఆయన వెంట అప్పటి వరకూ కాంగ్రెస్ లో క్రియా శీలంగా ఉన్న నేతలంతా వెళ్లిపోయారు. దాంతో రాష్ట్ర కాంగ్రెస్ లో కొందరు మిగిలినా వారు రాజకీయంగా పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి నామమాత్రంగా మారిపోయింది. మిగిలిపోయింది. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ గత పదేళ్లుగా నిర్వీర్యం అయిపోవడానికి రాష్ట్ర విభజన ఎంత కారణమో, వైఎస్ జగన్ కూడా అంతే కారణం అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. అయితే జగన్ తన పాలనలో తనను నమ్మి వచ్చిన వారి విశ్వాసాన్ని కోల్పోయారు. అలాగే ప్రజాదరణనూ కోల్పోయారు. సరిగ్గా ఇదే సమయంలో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఉనికి మాత్రంగా మారిపోవడానికి కారణమైన జగన్ పార్టీని దెబ్బ తీయడానికి కాంగ్రెస్ హైకమాండ్ వైఎస్ లెగసీనే నమ్ముకుంది. అందుకే షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగించింది. అయితే ఈ వ్యూహం ఇంత పక్కాగా, పకడ్బందీగా, సజావుగా అమలు కావడంలో తెరవెనుక చక్రం తిప్పింది వైఎస్ ఆత్మగా చెప్పుకునే కేవీపీయే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

సరే కేవీపీ వ్యూహం ఫలించి ఆమె ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అందుకున్నారు. అందుకున్నారు సరే.. సొంత అన్న జగన్ పార్టీని ఆమె ఏ మేరకు దెబ్బ తీస్తారు. వైసీపీలో ఉన్న పూర్వ కాంగ్రెస్ నేతలలో ఎంత మంది షర్మిల కారణంగా సొంత గూటికి చేరుకుంటారు. ఆమె ప్రభావం ఏపి రాజకీయాల్లో ఏ మేరకు ఉంటుంది అన్నది రానున్న రోజుల్లో స్పష్టంగా తెలుస్తుంది. అయతే విశ్లేషకులు మాత్రం షర్మిల ఎంట్రీతో రాష్ట్రంలో వైసీపీ ఫ్యాన్ తిరిగే అవకాశాలు దాదాపు మృగ్యం అనే అంటున్నారు.  షర్మిల ఎంట్రీతో రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకోవడం ఖాయమనే చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ షర్మిలకు ఏపీ పగ్గాలు అప్పగించడంతోనే వైఎస్ రాజకీయవారసురాలు షర్మిల మాత్రమేనన్నది తేటతెల్లమైపోయిందంటున్నారు. ఇక షర్మిల కారణంగా రానున్న ఎన్నికలపై ఇప్పటి వరకూ వచ్చిన సర్వేల మేరకు వైసీపీ గెలుస్తుందని భావిస్తున్న సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  సాధారణంగా ఎన్నికలలో త్రిముఖ పోటీ ఉంటే చీలిపోయేది ప్రభుత్వ వ్యతిరేక ఓటే. దాని వల్ల లబ్ధి పొందేది అధికార పార్టీయే. కానీ షర్మిల ఎంట్రీతో ఏపీలో మాత్రం ప్రభుత్వ అనుకూల ఓటులో భారీ చీలిక వచ్చే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంటే జగన్ పార్టీని ఓటమికి మరింత చేరువ చేసేందుకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిల చేపట్టడం కారణమౌతుందని అంటున్నారు.  

By
en-us Political News

  
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.