క్లీన్ స్వీప్ కూటమి లక్ష్యం.. స్థానిక సమరంపై తెలుగుదేశం, జనసేన, బీజేపీ కీలక భేటీ.!
Publish Date:Jul 14, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమౌతోంది. 2024 ఎన్నికలలో ఘన విజయం సాధించిన తెలుగుదేశం జనసేన, బీజేపీ కూటమి.. ఇప్పుడు రానున్న స్థానక ఎన్నికలలో కూడా క్లీన్ స్వీప్ చేసి సత్తా చాటాలన్న కృత నిశ్చయంతో ఉంది. రాష్ట్రంలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నగారా మోగేందుకు ముహూర్తం దగ్గరపడిన నేపథ్యంలో.. రాష్ట్రంలో రాజకీయవేడి రగులుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో స్థానిక ఎన్నికల జరిగే అవకాశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఇప్పటికే తమ పార్టీ శ్రేణులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహాలను పక్కాగా అమలు చేయడానికి కూటమి పార్టీల ముఖ్య నేతల కీలక సమావేశం బుధవారం (జులై 15) జరగనుంది. సాధారణంగా సార్వత్రిక ఎన్నికల కంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎందుకంటే ఇవి క్షేత్రస్థాయిలో పార్టీ పట్టును నిరూపించే ఎన్నికలు. అయితే.. ఈ ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీల నుంచి ఎదురయ్యే సవాళ్ల కంటే, కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య అంతర్గత విభేదాలు తలెత్తే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నది పరిశీలకులు విశ్లేషణ. ఒకే గ్రామంలో లేదా మండలంలో కూటమికి చెందిన వేర్వేరు పార్టీల నేతలు పట్టు కోసం ప్రయ త్నించడం వల్ల అంతర్గత విభేదాలు తలెత్తే ప్రమాదం ఉందని పరిశీలకులు అంటున్నారు. అందుకే అలాంటి పొరపచ్చాలు, టికెట్ల కేటాయింపు ఇబ్బందులు రాకుండా తీసుకోవలసిన చర్యలు ఏమిటన్నదే బుధవారం (జులై 15) భేటీలో ప్రధాన అజెండా అని అంటున్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి, ఎలాంటి అసంతృప్తులు లేకుండా సీట్ల సర్దుబాటు చేయాలని కూటమి పార్టీల అగ్రనేతలు భావిస్తున్నారు. ఎ స్థానిక ఎన్నికల్లో కూటమి క్లీన్ స్వీప్ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తమ నాయకులను అలెర్ట్ చేశారు.ఈ కీలక భేటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లతో పాటు కూటమికి చెందిన అగ్ర నాయకులందరూ హాజరు కానున్నారు. అయితే.. సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా హాజరు కావడం లేదు. ఇటీవల ఆయన ముంబైలోని కోకిలా బెన్ అంబానీ హాస్పిటల్ లో భుజానికి సర్జరీ చేయించుకుని అక్కడే విశ్రాంతి తీసుకుంటున్న సంగతి విదితమే. Kutami Targets Clean Sweep Local Bodies Elections, AP Sarpanch Elections, Chandrababu Naidu, Pawan Kalyan Health Update, AP Local Body Polls, TDP Janasena BJP Coalition, AP Panchayat Elections 2026
పవన్ ఈ సమావేశానికి ప్రత్యక్షంగా అటెండ్ కాకపోయినప్పటికీ, ఆయన సూచనల మేరకు జనసేన ముఖ్య నేతలు ఈ భేటీలో పాల్గొని వ్యూహాలను ఖరారు చేయనున్నారు.
http://www.teluguone.com/news/content/kutami-targets-clean-sweep-local-bodies-elections-39-225975.html





