కుల్భూషణ్ జాదవ్ రా ఏజెంటా? భారత గూఢచారుల గురించి 7ఆసక్తికర సత్యాలు!

Publish Date:Apr 14, 2017

Advertisement

కుల్భూషణ్ జాదవ్ …. ఇప్పుడు ఈ పేరు రెండు దేశాల్లో మార్మోగుతోంది! ఇటు ఇండియా జాదవ్ కు ఏం జరిగినా తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తోంటే… అటు పాకిస్తాన్ అతను రా ఏజెంట్ అనీ, తమ దేశంలోకి చొరబడ్డాడనీ, ఉగ్రవాదానికి కారణమని కబుర్లు చెబుతోంది! అసలు ఉరిశిక్షకి గురై ప్రస్తుతం చావుబతుకుల మద్య వున్న కుల్భూషణ్ నిజంగా అపరాధేనా? మన దృష్టిలో కాకున్నా పాకిస్తాన్ చట్టాల ప్రకారమైన అతను గూఢచారా? పాకిస్తాన్ భద్రతకు ముప్పా? కానే కాదంటున్నారు నిపుణులు! అందుకు ఏడు కారణాల్ని కూడా వారు చెబుతున్నారు!

1. కుల్భూషణ్ జాదవ్ భారత నిఘా సంస్థ రా పంపిన ఏజెంట్ కాదని చెప్పే మొదటి అంశం… అతను పాకిస్తాన్ సరిహద్దు వెంట వుండే భారతీయుడు కాకపోవటమే. పాక్ లోకి ఎవర్నైనా గూఢచర్యం కోసం పంపాలంటే రా ముందుగా వాళ్లని పాక్ సరిహద్దు గ్రామాల్లోంచే ఎంచుకుంటుంది. వారైతేనే పాకిస్తాన్ జనంతో రోజూ టచ్ లో వుంటూ వుంటారు. వారికి పాక్ ఆచారాలు, సంప్రదాయాలు, వ్యవహారాలు అన్నీ తెలిసి వుంటాయి. అలాంటి వారు పాక్ లోకి వెళితే ఈజీగా అక్కడ జనంలో కలిసిపోగలరు. జాదవ్ మహారాష్ట్ర కు చెందిన వాడు. ఆయనకు పాక్ జనజీవితం గురించి, సంస్కృతి  గురించి తెలిసే అవకాశమే లేదు!

 

2. చాలా అరుదుగా మాత్రమే …  పాక్ సరిహద్దు ప్రాంతాలకు చెందని వార్ని రా తన ఏజెంట్స్ గా పంపుతుంటుంది. అలాంటి వారు చాలా చాలా తెలివైన, చురుకైన వారై వుండాలి. పాక్ లోకి వెళ్లాక అక్కడ ఎవ్వరికీ అనుమానం కలగకుండా జనంలో అవలీలగా కలిసిపోవాలి. అయినా కూడా ఇలాంటి వార్ని రా ఎక్కువ కాలం పాక్ లో వుండనీయదు. కొన్ని రోజుల్లోనే మిషన్ కంప్లీట్ చేసుకుని వచ్చేయమని చెబుతుంది. జాదవ్ చాలా రోజులు పాక్ లో గడిపాడు.

 

3. రా ఏజెంట్లు పాకిస్తాన్ లో ప్రవేశిస్తే ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇండియన్ పాస్ పోర్ట్ కలిగి వుండరు. అలా పాస్ పోర్ట్ తో , అదీ వేరే ఒక దేశం గుండా రా తన ఏజెంట్స్ ని పంపదు. జాదవ్ ఇండియన్ పాస్ పోర్ట్ తో ఇరాన్ సరిహద్దు ద్వారా పాక్ లో ప్రవేశించే ప్రయత్నం చేశాడు. ఇది రా ఏజెంట్లు ప్రవర్తించే తీరు ఎంత మాత్రం కాదు!

 

4. రా వేరే దేశం ద్వారా తన ఏజెంట్ ని పాక్ లోకి పంపాలనుకుంటే పక్కాగా ప్లానింగ్ తో ముందుకు వెళుతుంది. ఏజెంట్ తనంత తానుగా బయలుదేరి వెళ్లిపోడు. విదేశంలోని సోర్స్ తో రా అధికారులు జాగ్రత్తగా చర్చలు జరిపి ఎలాంటి రిస్క్ లేకుండా ప్లాన్ చేశాకే… ఏజెంట్ కు బయలుదేరేందుకు అనుమతినిస్తారు. ఇరాన్ అలాంటి దేశం కాదు. రా ఇరాన్ గుండా మన ఏజెంట్లను పంపే అవకాశం లేదు!

 

5.ఇక పాకిస్తాన్ జాదవ్ కు సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేసింది. అందులో ఆయన రా జాయింట్ సెక్రటరీ అనిల్ కుమార్ గుప్తా తనని పాక్ పంపారని చెప్పాడు. అసలు అనిల్ కుమార్ గుప్తా అనే అధికారే రా లో లేడని తేలింది! అంతే కాదు, జాదవ్ చేత పాకిస్తాన్ అజిత్ దోవల్ పేరు కూడా పలికించింది! క్షేత్ర స్థాయిలో పని చేసే గూడచారులతో అజిత్ దోవల్ స్థాయిలోని చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ మాట్లాడటం అసంభవం!

 

6. పాక్ విడుదల చేసిన వీడియోలోనే జాదవ్ ఒక చోట తాను 2001లో నేవీ నుంచి రిటైర్ అయ్యానని చెప్పాడు. మరో చోటా అతనే తాను ఇంకా సర్వీస్ లో వున్నానని, 2022లో రిటైర్ అవుతానని చెబుతాడు! ఇలా మాట్లాడుతున్నాడంటే అర్థం … పాకీలు జాదవ్ ను చిత్రహింసలకు గురి చేసి వుండాలి. లేదంటే, అతను ఏదైనా డ్రగ్ ప్రభావంతో అపస్మారక స్థితిలో మాట్లాడి వుండాలి.

 

7. ఫైనల్ గా… ఇరాన్ నుంచి పాక్ లోకి ప్రవేశించే ప్రయత్నం చేసిన కుల్భూషణ్ జాదవ్… ఒక చిన్న వ్యాపారస్థుడు. అతనికి బిజినెస్ ఇరాన్ లో వుంది. అలాంటి వ్యాపారస్థులు రా కోసం పని చేయటం అబద్ధం కాదు. కాని, జాదవ్ చేసుకునే వ్యాపారం చాలా చిన్నది. అతనితో రా వారికి పెద్దగా అనుబంధం వుండే అవకాశం అస్సలు లేదు. ఎందుకంటే, రా కోసం అప్పుడప్పుడూ లోకల్ బిజినెస్ మెన్ పని చేసినా వారంతా తమ తమ వ్యాపారాల్లో నష్టాల్ని ఎదుర్కుంటున్న వారై వుంటారు. వారు డబ్బు కోసమో, లేక మరేదైనా లాభం కోసమో రా ఏజెంట్లు గా సహకరిస్తుంటారు. జాదవ్ కు అలాంటి అవసరం కూడా వున్నట్టు కనిపించటం లేదు. అతని లాంటి నేపథ్యం వున్న ఎవరికీ రా సుదీర్ఘమైన మిషన్లు అప్పగించదు. చిన్న చితకా సమాచారాలే వారు చేరవేస్తుంటారు. పాక్ చెప్పినట్టుగా ఉగ్రవాదం రగల్చటం లాంటి పనులకు రా వ్యాపారస్థుల్ని అస్సలు ఉపయోగించదు! 

 

కేవలం అంతర్జాతీయ సమాజం ముందు భారత్ పేరు చెడగొట్టాలని ఆశిస్తోన్న పాక్ జాదవ్ ను అక్రమంగా ఉరితీసే ఆలోచనలో వుంది. అయితే, ఇండియా కూడా ధీటుగా బదులు ఇవ్వటంతో ప్రస్తుతానికైతే వెనక్కి తగ్గింది. చూడాలి మరి… మన జాదవ్ ఎంత కాలానికి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడో! 

By
en-us Political News

  
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
సుమారు వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని ఆయ‌న త‌న కుమారుడు గౌత‌మ్ సింఘానియాకు రాసిచ్చాక‌.. ప‌డ్డ పాట్లు వ‌ర్ణ‌నాతీతంగా వ‌ర్ణించారు ముఖ్య‌మంత్రి.
నారా లోకేశ్ రేపోమాపో పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి రోల్ పోషించే పరిస్థితి లేకపోయినా, యువనేత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయించడానికి నారా, నందమూరి కుటుంబాలతో చంద్రబాబు అతిత్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ కూతురు విద్యారాణి తండ్రి అంత సంపాదిస్తే చందాలేసుకుని మ‌రీ చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లాల్సిన దుస్థితి ఏంటి?
అమరావతికి, అక్కడి ప్రజలకు వైసీపీ ఎన్నడూ వ్యతిరేకం కాదంటూ మాట్లాడారు. గతంలో తాము వ్యతిరేకించినది చంద్రబాబు నాయుడు చూపించిన గ్రాఫిక్స్ రాజధానే అంటూ సన్నాయినొక్కులు నొక్కారు. అప్పట్లో చంద్రబాబు చేసిన ఊహాజనిత సృష్టినే తాము వ్యతిరేకించామనీ, గ్రాఫిక్స్ అమరావతిపైనే అప్పటి తమ అభ్యంతరాలనీ చెప్పుకొచ్చారు.
మడమ తిప్పను, మాట తప్పను, విశ్వసనీయతకు నిలువెత్తు రూపం అంటూ గతంలో పదేపదే చెప్పుకున్న జగన్ ఇప్పుడు.. నిత్యం అసత్యాలను వల్లెవేస్తూ.. విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.