Publish Date:Nov 16, 2018
నందమూరి కుటుంబం నుంచి మరొకరు రాజకీయాల్లోకి వస్తున్నారు.హరికృష్ణ కూతురు సుహాసినికి తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో కూకట్ పల్లి స్థానం కేటాయించారు. ఆమె ఈ రోజు నామినేషన్ వేయనున్నారు. మహాప్రస్థానంలోని హరికృష్ణ సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం సుహాసిని కూకట్పల్లి తెదేపా అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. అంతకన్నా ముందు ఎన్టీఆర్ ఘాట్ వద్ద సుహాసిని, బాలకృష్ణ ఈ ఉదయం నివాళులర్పించారు.
హరికృష్ణ మరణం తరువాత బాబాయ్ బాలకృష్ణ అన్న కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు.ఆయనే దగ్గరుండి నామినేషన్ వేయించనున్నారు. ఈ సందర్బంగా బాలకృష్ణ మాట్లాడుతూ...తెదేపా ఆవిర్భావం నుంచి మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. రైతులు, మహిళలకు ఎన్టీఆర్ అండగా ఉన్నారని పేర్కొన్నారు. ‘మా ఆడపడుచు నందమూరి సుహాసిని రాజకీయాల్లోకి వస్తోంది. మా ఆశయాలను ఆమె ముందుకు తీసుకెళ్తారు. తెదేపాపై చూపిస్తున్న అభిమానాన్నే సుహాసినిపై కూడా చూపాలని కోరుతున్నా. యువత, అభిమానులు, కార్యకర్తలు కలిసి రావాలని కోరుతున్నా. సుహాసినికి అఖండ విజయాన్ని అందించాలి. ఇదే నందమూరి హరికృష్ణకు మనం ఇచ్చే నివాళి’ అని అన్నారు. అనంతరం మాట్లాడిన సుహాసిని.. మా తాతా, నాన్న, మావయ్య ఆశీస్సులతో ప్రజాసేవకు ముందడుగు వేస్తున్నానని.. తనకు తెలుగు మహిళల మద్దతు కావాలని కోరారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kukatpally-tdp-candidate-nandamuri-suhasini-at-ntr-ghat-39-84439.html
తెలంగాణ కేబినెట్ సమావేశం జూన్ 5 మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం సచివాలయంలో నిర్వహించానున్నారు.
ఎట్టకేలకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడి విచారణ చేయడానికి సిట్ కి దారులు బార్లా తెరుచుకున్నాయి. ఇప్పటి వరకూ అంటే గత 14 నెలలుగా అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు వ్యవహారం, ఎన్నో మలుపుల మీద మలుపులు తిరిగి, ఆయన ఎట్టకేలకు హైదరాబాద్ వచ్చే వరకూ సాగింది.
ఐపీఎల్ 2025 ముగింపు దశకు వచ్చింది. మంగళవారం (జూన్ 3) సాయంత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఫైనల్ తో ఐపీఎల్ విజేత ఎవరన్నది తేలిపోతుంది.
కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కమల్ హాసన్ తన సినిమా థగ్ లైఫ్ జూన్ 05 న కర్ణాటకలో విడుదల కావడానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన అట్లూరి మౌనిక మిస్ అండ్ మిసెస్ తెలుగు యూఎస్ఏ ಅಂదాಲ పోటీల్లో ద్వితీయ స్థానం కైవశం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై ఫోకస్ పెట్టిన ఏపీ ప్రభుత్వం హైరేంజ్లో ప్రణాళికలు వేస్తోంది. ఇప్పటికే 34వేల ఎకరాల భూమిని రైతుల నుంచి సమీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి 40వేల ఎకరాలు సేకరించాలని నిర్ణయించింది.
గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ అధినేత జగన్ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. గత వైసీపీ ప్రభుత్వంలో హత్యకు గురైన వ్యక్తిని పరామర్శించని జగన్ రౌడీ షీటర్లకు మద్దతిస్తున్నారని దళిత, ప్రజా సంఘాలు నిరసన తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో హీరో నాగార్జున భేటీ అయ్యారు. ఈ ఇరువురి భేటీ ఇరు రాష్ట్రాలలోనూ ప్రాధాన్యత సంతరించుకుంది. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబునాయుడిని హీరో నాగార్జున మంగళవారం (జూన్ 3) కలిశారు.
రాజేంద్ర ప్రసాద్ ఈ మధ్య తన కూతురు చనిపోయినప్పటి నుంచి ఇలా మారిపోయారా? అంటే అవుననే తెలుస్తోంది. మొన్న రాబిన్ హుడ్ సినిమా ఫంక్షన్లో డేవిడ్ వార్నర్ ని దొ*గ ము*కొడుకు అంటూ కామెంట్ చేసి ట్రోల్ అయ్యారు.
క్రికెట్ అభిమానుల్లో.. ఐపీఎల్ పైనల్ ఉత్కంఠ పెంచుతోంది. ఈసారి కప్ కొట్టేది.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరా.. పంజాబ్ కింగ్సా? అనేది మోస్ట్ ఇంట్రస్టింగ్‌గా మారింది. ఐపీఎల్ మొదలై 18 ఏళ్లు అవుతున్నా.. ఈ రెండు టీమ్‌లూ ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. కాబట్టి.. ఏ టీమ్ గెలిచినా.. కొత్త చరిత్ర సృష్టిస్తుంది.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ అధినేత జగన్ కు బంపరాఫర్ ఇచ్చారు. ఇష్టారీతిగా ఆరోపణలు చేయడం కాదు.. వాటికి తగిన ఆధారాలు కూడా చూపించాలని చెబుతూనే.. జగన్ చేసిన ఆరోపణలకు ఒక్క ఆధారం చూపినా తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసలేరు సమీపంలో సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.
తుని రైలు దగ్ధం కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాపు ఉద్యమ నేలతపై వైసీపీ సర్కార్ ఎత్తివేసిన కేసుల పునర్విచారణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించనుంది.