కేటీఆర్ చాయ్, సమోసా అమ్ముకునేవాడు!
Publish Date:Sep 17, 2024
Advertisement
హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడ నుంచి తొలగించి, అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కూడా ఆయన గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ గాంధీ దేశంలోకి కంప్యూటర్ రంగం రావడానికి తలుపులు తెరవకపోతే, కేటీఆర్ సిద్దిపేటలో చాయ్, సమోసా అమ్ముకుంటూ జీవించేవాడని అన్నారు. సీఎం రేవంత్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘‘ట్విటర్ పిట్ట ట్విట్టర్లో పెడుతున్నాడు.. అమెరికా పోయి కంప్యూటర్ చదువుకున్నా అంటున్నాడు. ఆ కంప్యూటర్ని ఈ దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీనే కేటీఆర్ సన్నాసీ. లేకపోతే ఇక్కడ్నే ఎక్కడ్నో గుంటూర్లో ఇడ్లీ, వడ అమ్ముకుంటూ తిరిగేవాడివి. అక్కడకి చదువుకుంటానని వెళ్ళావు కదా.. అక్కడే ఇడ్లీ, వడ అమ్ముకుంటూ బతికేవాడివి. లేకపోతే రైల్వే స్టేషన్లో చాయ్, సమోసా అమ్ముకుంటూ సిద్దిపేటలోనే వుండేవాడివి. రాజీవ్ గాంధీ ఈ దేశానికి కంప్యూటర్ని పరిచయం చేశాడు కాబట్టే నీ బతుకు ఒక కంప్యూటరు, ఒక ట్విట్టర్ అకౌంట్, ఒక ఐటీ మంత్రివి అయ్యావు. లేకపోతే ఐటీ శాఖనే వుండేది కాదు. రాజీవ్ గాంధీ ఐటీ రంగాన్ని ఈ దేశానికి పరిచయం చేశాడు కాబట్టే ఆ సన్నాసి ఐటీ శాఖకు మంత్రి అయ్యాడు. లేకపోతే ఆ దిక్కుమాలిన వాడి బాధే మనకు వుండేది కాదు. దేశ సమగ్రతను కాపాడటానికి ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ. అంత గొప్ప వ్యక్తి విగ్రహాన్ని సచివాలయం ఎదుట, ట్యాంక్ బండ్ మీద పెడితే రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెడతారని అడుగుతారా? ఎంత బలుపు మాటలు.. కార్యకర్తలారా ఒక్కసారి ఆలోచన చేయండి. అధికారం పోయినా మదం దిగలేదు’’ అన్నారు.
http://www.teluguone.com/news/content/ktr-will-sell-tea-samosa-25-184984.html





