ఫార్ములా ఈ రేసు కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు ఏసీబీ విచారణకు హాజరు కావాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ కేసులో తాను దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్ అయి ఉన్న నేపథ్యంలో ఏసీబీ విచారణకు హాజరైనా అరెస్టయ్యే ప్రమాదం లేదని ఆయన భావిస్తున్నారు. అన్నిటికీ మించి హైకోర్టులో తన క్వాష్ పిటిషన్ పై తీర్పు అనుకూలంగా వస్తుందన్న నమ్మకంతో ఉన్న కేటీఆర్, ఏసీబీ విచారణకు గైర్హాజరైనా, డుమ్మా కొట్టినా ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్నారు. ఏసీబీ విచారణకు హాజరయ్యే విషయంలో అన్ని కోణాలలోనూ ఆలోచించి, న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తారువాతే కేటీఆర్ ఈ విచారణకు హాజరు కావాలన్న నిర్ణయానికి వచ్చారని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.
అన్నిటి కంటే కేటీఆర్ విచారణకు హాజరు కావాలని నిర్ణయం తీసుకోవడానికి కారణం.. హైకోర్టులో తన క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వులో ఉన్న కారణంగా ఏసీబీ తనను ఇప్పటికిప్పుడు అరెరస్టు చేసే అవకాశం లేదు. ఎటువంటి తొందరపాటు చర్యా తీసుకోవద్దంటూ కోర్టు ఏసీబీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పు వెలువడే వరకూ కేటీఆర్ ను అరెస్టు చేయవద్దంటూ ఆదేశించడంతో ఏసీబీ ఆయనను అరెస్టు చేసే అవకాశాలు ఎంత మాత్రం లేవు. అయితే విచారణ సందర్భంగా కేటీఆర్ కు ఏసీబీ పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. అలాగే విచారణ కూడా సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది.
ఇక ఈ కేసు విషయంలో కేసీఆర్ కు ఇబ్బందులు తప్పవనీ, సోమవారం (జనవరి 6) ఏసీబీ, మంగళవారం (జనవరి 7) ఈడీ కేసీఆర్ ను విచారించనున్నాయి. ఇక్కకే కేసీఆర్ కు ఒకింత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఏసీబీ విచారణకు హాజరై, ఈడీ విచారణకు గైర్హాజరైతే ఆయనపై విమర్శలు వెల్లువెత్తే అవకాశాలు మెండుగా ఉంటాయి. అయితే ఆ విమర్శలకు వెరచి ఈడీ విచారణకు హాజరైతే అరెస్టయ్యే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే ఈడీ అరెస్టు చేయకుండా కేటీఆర్ కు కోర్టుల నుంచి ఎటువంటి రక్షణా లేదు. దీంతో ఈడీ ఆయనను విచారించిన తరువాత అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన భావిస్తున్నారు. అందుకే సోమవారం (జనవరి 6) ఏసీబీ విచారణకు హాజరై, మంగళవారం (జనవరి 7)న ఏవో కారణాలు చెప్పి ఆయన ఈడీ విచారణకు గైర్హాజర్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇప్పటికే ఈడీ విచారణకు హాజరు కాకుండా ఈ కేసులో ఏ3గా ఉన్న ఐఏఎస్ అర్వింద్ గ్రేటర్ మాజీ చీఫ్ ఇంజినీర్ లు డుమ్మా కొట్టారు. కేటీఆర్ కూడా అదే చేసే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ktr-to-attend-acb-inquiry-on-january-6th-39-190843.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.