కేటీఆర్ టార్గెట్ కాంగ్రెస్ కాదు.. రేవంత్ రెడ్డి!

Publish Date:Feb 11, 2023

Advertisement

అవును. మంత్రి కేటీఆర్  బీజేపీనే కాదు కాంగ్రెస్ పార్టీని విమర్శించడంలోనూ ముందుంటారు. అయితే కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ, అంతే. అదే తేడా. అయితే, అదే సమయంలో కేటీఆర్ విమర్శలను కొంచెం లోతుగా పట్టి చూస్తే, ఆయన విమర్శల్లో కాంగ్రెస్ వ్యతిరేకతకంటే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యతిరేకతే ఎక్కువగా కనిపిస్తుంది.

అందులోను ఒక వ్యూహం ఉందని విశ్లేషకులు అంటున్నారు.  రాష్ట్ర  అసెంబ్లీలో  ధరణి  బాగోతంపై చర్చ జరుగతున్న సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు, మాజీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర బాబు, మాట్లాడుతున్న సమయంలో మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకున్నారు. ధరణి పోర్టల్ ఉంచాలా, రద్దు చేయాలా అనే విషయంలో కాంగ్రెస్ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేదని ఆరోపించారు. అంతవరకు బాగుంది కానీ, పనిలో పనిగా శ్రీధర్ బాబుతో పాటుగా, సభలో మిగిలిన నలుగురు కాంగ్రెస్ సభ్యులకు మంత్రి కితాబు నిచ్చారు. కాంగ్రెస్ సభ్యులంతా మంచోళ్లే, బయటి నుంచి వచ్చిన వారితోనే పేచీ అంటూ పరోక్షంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు,  ప్రగతి భవన్ ను బాంబులతో పేల్చేయండి  అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ‘నక్సల్స్’ కు ఇచ్చిన పిలుపునూ ప్రస్తావించారు. ఒక విధంగా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ ఆయన ప్రత్యర్ధి వర్గం మధ్య సాగుతున్న అంతర్గత కుమ్ములాటలను  మరింతగా ఎగదోసేందుకే కేటీఆర్  సభలో లేని రేవంత్ రెడ్డిపై, నిబంధనలకు విరుద్ధంగా విమర్శలు చేశారు. 

నిజానికి, కాంగ్రెస్ పార్టీలో ఒక్క రేవంత్ రెడ్డి మినహా ఇంచుమించుగా మిగిలిన అందరు ముఖ్య నాయకుల విషయంలో మంత్రి కేటీఆర్ కు మాత్రమే కాదు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా మంచి అభిప్రాయమే వుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్  సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క ఇలాగే సభలో, సభ వెలుపల కూడా ప్రశంసలతో ముంచెత్తారు. భారాస లోకి రావాలని బహిరంగంగానే ఆహ్వానించారు.

సరే భట్టి ప్రలోభాలకు లొంగ లేదనుకోండి అది వేరే విషయం. అయితే, ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ ఇప్పటికీ బీఆర్ఎస్ నాయకత్వం అవతలి పార్టీల నుంచి ఎమ్మెల్యేలను ఆకర్షించే ప్రయత్నాలను కొనసాగిస్తోందని అంటున్నారు. ఇదలా ఉంటే సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి  ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకు వేల్లెందుకే ముఖ్యమంత్రిని కలిశానని, జగ్గారెడ్డి చెప్పినా, ఇంతకాలం లేనిది ఇప్పడు నియోజకవర్గం సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రిని కలవడం ఏమిటని కాంగ్రెస్ నాయకులే అనుమానిస్తున్నారు.

మొత్తానికి ఎన్నికలు నెలల్లోకి వచ్చినా  బీఆర్ఎస్ నాయకత్వం ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు ఎరవేస్తోందని అంటున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఒంటిరిని చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్లను కేసీఆర్ కేటీఆర్ దువ్వుతున్నారని అంటున్నారు.

By
en-us Political News

  
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు. రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజ్, అర్హతలు, వయస్సు పరిమితి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.