Publish Date:Dec 30, 2024
తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం మంగళవారం (డిసెంబర్ 30) జరిగింది. మాజీ ప్రధానమంత్రి, దివంగత మన్మోహన్ సింగ్ కు సంతాప తీర్మానాన్ని ఆమోదించడానికి తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అసెంబ్లీ వేదికగా ఒక వింత చోటు చేసుకుంది. సభలోనూ బయటా కూడా ఉప్పూ నిప్పులా ఉంటున్న అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ను అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఒకే మాట చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలంటూ రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తన ప్రసంగంలో కేటీఆర్ చెప్పారు.
కాగా సభలో మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో తెలంగాణలో మన్మోహన్ సింగ్ విగ్రహం ఉండాలని.. మంచి ప్రదేశంలో ఆయన విగ్రహం పెడతామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మన్మోహన్ సింగ్ దేశాన్ని కష్టకాలంలో ముందుకు నడిపించిన తీరును ముఖ్యమంత్రి రేవంత్ ప్రశంసించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ఏర్పాటు జరిగిందని గుర్తు చేసిన ఆయన రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్ కృషిని విస్మరించలేమన్నారు. ఉపాధి హామీ, ఆర్టీఐ, ఆధార్ లాంటి చట్టాలు తెచ్చిన ఘనత మన్మోహన్ సింగ్ ప్రభుత్వానిది అని కొనియాడారు. సరళీకృత విధానాలతో భారత్ ప్రపంచంతో పోటీ పడేలా చేశారని.. దేశానికి విశిష్టమైన సేవలు అందించారన్నారు. ఈ తరంలో మన్మోహన్ సింగ్‌తో పోటీపడేవారే లేరని రేవంత్ పేర్కొన్నారు.
అనంతరం ఈ తీర్మానానికి మద్దతు ఇస్తూ మాట్లాడిన కేటీఆర్.. మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలన్న రేవంత్ ప్రకటనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. భారతరత్న పురస్కారానికి మన్మోహన్ పూర్తిగా అర్హులనీ, ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందనీ చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ktr-supports-reventh-in-assembly-25-190529.html
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.