హంగ్ ఏర్పడితే సర్కార్ కొలువుదీరేది ఎలా?... గతంలో మైనార్టీ ప్రభుత్వాలు ఎలా నిలిచాయి?

Publish Date:May 7, 2026

Advertisement

 

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే అత్యధిక స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన స్పష్టమైన మెజార్టీ లభించకపోవడంతో అక్కడ సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో 'హంగ్' ఏర్పడినప్పుడు ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ఎలా ఉంటుంది? గతంలో ఇలాంటి పరిస్థితుల్లో మైనార్టీ ప్రభుత్వాలు ఎలా కొలువుదీరాయి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సాధారణంగా ఏ పార్టీకీ మెజార్టీ రాని పక్షంలో గవర్నర్ తన విచక్షణ అధికారాలను ఉపయోగిస్తారు. అతిపెద్ద పార్టీని గానీ లేదా ఎన్నికల అనంతర కూటమిని గానీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించవచ్చు. గత దశాన్నర కాలంలో మహారాష్ట్ర, కర్ణాటక, గోవా వంటి రాష్ట్రాల్లో ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

2019లో మహారాష్ట్రలో దాదాపు 34 రోజుల పాటు రాజకీయ హైడ్రామా కొనసాగింది. అనంతరం శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ‘మహా వికాస్ అఘాడీ’ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ఈ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాలు గెలుచుకున్నాయి.

మూడు రోజులకే కూలిన ప్రభుత్వం..

2018లో దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలోనూ ఇదే తరహా రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం 222 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో బీజేపీ 104 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌కు 80, జేడీఎస్‌కు 37 స్థానాలు దక్కాయి. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 113 స్థానాల మెజార్టీ ఎవరికీ రాలేదు. దీంతో నాటి గవర్నర్ వాజూభాయ్ వాలా బీజేపీ నేత యడియూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. 

ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరగా, బలపరీక్ష నిర్వహించాలని ఆదేశాలు వెలువడ్డాయి. బీజేపీకీ తగిన సంఖ్యాబలం లేకపోవడంతో విశ్వాస పరీక్షకు ముందే యడియూరప్ప ప్రభుత్వం కేవలం మూడు రోజులకే కూలిపోయింది. తర్వాత కాంగ్రెస్, జేడీఎస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

కాంగ్రెస్‌కు షాక్..

గోవాలో 40 అసెంబ్లీ స్థానాలుండగా, 2017 ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. కాంగ్రెస్ 17, బీజేపీ 13 స్థానాలు గెలుచుకున్నాయి. అతిపెద్ద పార్టీగా నిలిచిన కాంగ్రెస్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానిస్తారని అందరూ భావించారు. అయితే, అనూహ్యంగా నాటి గవర్నర్ మృదులా సిన్హా బీజేపీ నేత మనోహర్ పారికర్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం అప్పట్లో రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది.

గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో 2017లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, వ్యూహాత్మకంగా వ్యవహరించిన బీజేపీ చిన్న పార్టీలను కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. గవర్నర్ తన విచక్షణ మేరకు స్థిరమైన ప్రభుత్వాన్ని ఇచ్చే అవకాశం ఉన్న పార్టీని ఆహ్వానించడం ఇక్కడ కీలకంగా మారింది. 

2013లో ఢిల్లీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 28 సీట్లతో కాంగ్రెస్ మద్దతుతో మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం.ప్రస్తుతం తమిళనాడులో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ విజయ్ ఇతర పార్టీల మద్దతు కూడగట్టలేకపోతే, రాష్ట్రం రాష్ట్రపతి పాలన దిశగా వెళ్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రాజకీయ చదరంగంలో అంతిమ విజేత ఎవరనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.
 

By
en-us Political News

  
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.