తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా మారిపోతున్నది. హైడ్రా కూల్చివేతలు, మూసీ సుందరీకరణ, రైతు భరోసా నిధులు వంటి విషయాలలో రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ కు పుంజుకునేందుకు ఇచ్చిన అవకాశాలను బీఆర్ఎస్ సమర్థంగా ఉపయోగించుకోవడంలో విఫలమైంది. పార్టీ అధినేత మౌనం కావచ్చు. పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభం కావచ్చు మొత్తంగా బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ స్ఫూర్తి అన్నది కొరవడటమే ఆ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను సమర్ధంగా తిప్పి కొట్టలేకపోవడానికి ప్రధాన కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
టీఆర్ఎస్ పార్టీగా సుదీర్ఘ కాలం ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని సాగించిన ఆ పార్టీ రాష్ట్ర విభజన తరువాత అధికారం చేపట్టింది. అధికారం చేపట్టిన తరువాత కేసీఆర్ స్వయంగా టీఆర్ఎస్ ఇంకెంత మాత్రం ఉద్యమ పార్టీ కాదు, ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించారు. ఆ తరువాత ఆపరేషన్ ఆకర్ష్ తో ఉద్యమ సమయంలో పార్టీకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడిన వారినీ, సమైక్య ఆంధ్రప్రదేశ్ కు అనుకూలంగా ఉన్నవారినీ కూడా పార్టీలో చేర్చుకున్నారు. అది వేరే సంగతి. రెండో సారి పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ పార్టీలోని తెలంగాణ సదాన్ని తీసేసి పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చి ఒక్క సారిగా జాతీయ రాజకీయాలపై మక్కువ పెంచేసుకున్నారు. తన తనయుడు కేటీఆర్ ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించి భవిష్యత్ ముఖ్యమంత్రిగా బిల్డప్ ఇచ్చారు. ఇది పార్టీలోని కొందరికి రుచించలేదనుకోండి అది వేరే సంగతి.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం పాలైన తరువాత కేసీఆర్ మౌనం పార్టీ క్యాడర్ ను నిస్తేజంగా మార్చేసింది. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ ఎంత దూకుడుగా వెళ్లినా క్యాడర్ లో ఉత్సాహం నింపడంలో పూర్తిగా సఫలం కాలేకపోయారు. మరో వైపు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో మాజీ మంత్రి హరీష్ రావు కేటీఆర్ కంటే ముందున్నారన్న భావన పార్టీ క్యాడర్ లో నెలకొంది. ఈ నేపథ్యంలోనే పార్టీ బలోపేతం తో పాటు తన నాయకత్వాన్నీ స్థిరపరుచుకునే లక్ష్యంతో కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. దీపావళి రోజున (అక్టోబర్ 31) ఆస్క్ కేటీఆర్ అన్న కార్యక్రమాన్ని నిర్వహించిన కేటీఆర్ ఆ సందర్భంగా తన పాదయాత్ర విషయాన్ని ప్రకటించారు. పాదయాత్రకు సంబంధించి పూర్తి వివరాలు అంటే ఎప్పుడు ఎక్కడ నుంచి పాదయాత్ర ప్రారంభమౌతుంది. రూట్ మ్యాప్ ఏమిటి అన్న వివరాలను త్వరలో వెల్లడిస్తానని కేటీఆర్ చెప్పారు.
ప్రజలతో మమేకమై అధికారంలోకి రావడానికి పాదయాత్రలు చేయడం తెలుగు రాష్ట్రాలలో కత్తేమీ కాదు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. అలాగే చంద్రబాబు కూడా పాదయాత్ర చేసి 2014 లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత వైఎస్ జగన్ కూడా పాదయాత్ర ద్వారానే 2019లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక లోకేష్ యువగళం పాదయాత్ర 2024 ఎన్నికలలో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడానికి ఎంతగానో దోహదపడింది. లోకేష్ ను బలమైన ప్రజా నేతగా ఆవిష్కరించింది. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాదయాత్ర చేయనున్నారు. తద్వారా పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడంతో పాటు 2028 లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను తాను బలంగా ప్రొజెక్టు చేసుకోవాలని భావిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ktr-padayatra-to-project-himself-as-brs-cm-candidate-25-187737.html
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.