కేటీఆర్ మిస్సింగ్.. హైదరాబాద్‌లో పోస్టర్ల కలకలం..
Publish Date:Sep 29, 2021
Advertisement
తెలంగాణలో అతిభారీ వర్షాలు. హైదరాబాద్‌లో కుండపోత వాన. కేసీఆర్ ప్రభుత్వం ఏకంగా ఒకరోజు సెలవు కూడా ఇచ్చేసింది. వరద ఉధృతి కారణంగా భాగ్యనగరంలోని ముషారాంబాగ్ బ్రిడ్జిని సైతం మూసేశారు. ముసీ ఉప్పొంగి ప్రవహిస్తోంది. ముసీ గట్టు మీద ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎప్పటిలానే లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటిలో మునిగిపోయి ఉన్నాయి. మూడు రోజులుగా నరకం చూస్తున్నారు జనాలు. మరి, ఇంత జరిగితే పట్టణశాఖ మంత్రి కేటీఆర్ ఎక్కడ? వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించరేం? గతసారి హైదరాబాద్‌కు వరదలు వచ్చినప్పుడు కేటీఆర్ నగరంలో విస్తృతంగా చక్కర్లు కొట్టారు. కుటుంబానికి 10వేలు కూడా ఇచ్చారు. అదికూడా కొందరికే. అప్పుడు జీహెచ్ఎమ్‌సీ ఎన్నికలు ఉండటంతో అలా చేశారంటూ అంతా విమర్శించారు. ఇప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి ఇటు వైపు కూడా చూడటం లేదంటూ హైదరాబాదీలు మండిపడుతున్నారు. ఇక జిల్లాల్లోనూ ఇదే తీరుగా ఉంది పరిస్థితి. తన సొంత ఇలాఖా సిరిసిల్ల నీటమునిగితే వెళ్లి చూశారు కానీ.. మిగతా జిల్లాలు జలమయమైతే పట్టించుకోరా అంటూ మంత్రి కేటీఆర్‌ను నిలదీస్తున్నారు బాధితులు. ఇక భాగ్యనగర వాసులు మరో అడుగు ముందుకేసి.. తమదైన స్టైల్‌లో నిరసన తెలిపారు. ‘కేటీఆర్ మిస్సింగ్’ అంటూ వరద ముంపు ప్రాంతాల్లో పోస్టర్లు అంటించారు. ఎక్కడ వరదుంటే అక్కడ కేటీఆర్ మిస్సింగ్ అనే వాల్ పోస్టర్లు దర్శనమిస్తుండటం అధికార పార్టీని కలవర పరుస్తోంది. పోనీ, వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిద్దామా అంటే ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇంకెన్నాళ్లీ దుస్థితి అంటూ నిలదీసే పరిస్థితి ఉంది. ఆ భయంతో మంత్రి కేటీఆర్ అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదంటున్నారు. ఆయన రాకపోయే సరికి కేటీఆర్ మిస్సింగ్ అంటూ పోస్టర్లతో తమ నిరసన తెలుపుతున్నారు వరద బాధితులు. మరికొందరు క్రియేటివ్ పీపుల్స్ ఆ పోస్టర్లకు వరద విజువల్స్ కూడా జత చేసి.. మీమ్స్‌తో వీడియోలు రెడీ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. అవి తెగ వైరల్ అవుతుండటంతో కేటీఆర్ ఫుల్‌గా బద్నామ్ అవుతున్నారు. పోతే ఓ లొల్లి. పోకపోతే ఇంకో లొల్లి. ఇదేందిబై అంటూ కేటీఆర్ ప్రగతి భవన్ వీడి బయటకు రావట్లేదని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/ktr-missing-posters-in-hyderabad-flood-areas-25-123765.html





