హరీష్ రావు నివాసానికి కేటీఆర్.. తెరవెనుక కథేంటి?

Publish Date:May 17, 2025

Advertisement

తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏమిటంటే బీఆర్ఎస్ లో ఏం జరుగుతోందన్నదే. అసలు పార్టీ కర్య నిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు హరీష్ రావు నివాసానికి వెళ్లి రెండు గంటల పాటు ఏం చర్చించారన్న దానిపై తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది. పార్టీలో కీలక నాయకులూ, అందునా దగ్గరి బంధువులు అయిన వారిరువురూ భేటీ కావడం వాస్తవానికి పెద్ద విషయం ఏమీ కాదు. కానీ ఇప్పుడు తెలంగాణలో వారిరువురి భేటీయే అత్యంత ప్రధాన వార్తగా మారిపోయింది. మిగిలిన విషయాలన్నీ మరుగున పడిపోయి.. ఇప్పుడు చర్చంతా వారిద్దరి రెండు గంటల భేటీపైనే కేంద్రీకృతమై ఉంది. 

ఇందుకు కారణం లేకపోలేదు. కేసీఆర్ రాజకీయంగా క్రియాశీలంగా వ్యవహరించకపోవడం, త్వరలో పార్టీ పగ్గాలు తన తనయుడు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు అప్పగించనున్నారన ప్రచారం నేపథ్యంలో హరీష్ రావు ఒకింత అసంతృప్తిగా ఉన్నారని పార్టీ శ్రేణుల్లో గట్టిగా వినిపిస్తోంది. అదీ కాకుండా ఒక ప్రణాళిక మేరకు పార్టీలో హరీష్ రావు ప్రాధాన్యత తగ్గించేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం కూడా జోరుగానే సాగుతోంది. 

ఇటీవల బీఆర్ఎస్ పాతికేళ్ల పండుగ సందర్భంగా వరంగల్ లో జరిగిన  భారీ సభ సందర్భంగా హరీష్ రావుకు ఇసుమంతైనా ప్రాధాన్యత లభించకపోవడం ఆ ప్రచారానికి బలం చేకూర్చేదిగా ఉంది. అదే సమయంలో హరీష్ రావు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేయనున్నారనీ, టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న ప్రచారం మొదలైంది. ఇదంతా అవాస్తవ ప్రచారం అంటూ హరీష్ రావు ఇచ్చిన వివరణ కూడా ఆ ప్రచారం మరింత జోరందుకోవడానికి దోహదపడిందే తప్ప మరో ప్రయోజనం సిద్ధించలేదు. హరీష్ రావు కారు దిగి, వేరే పార్టీలో చేరబోతున్నారని గతంలో కూడా వార్తలొచ్చాయి. అయితే అప్పట్లో వాటిని పార్టీయే కాదు.. ప్రజలు కూడా పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. అందుకు కారణం కేసీఆర్. కేసీఆర్ ను కాదని హరీష్ రావు పక్క చూపులు చూస్తారంటే ఎవరూ నమ్మలేదు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. కేసీఆర్  పోలిటికల్ గా యాక్టివ్ గా లేరు. పార్టీ వర్గాలే ఆయన ఇక పార్టీ పగ్గాలను తన రాజకీయవారసుడికి అప్పగించేసి విశ్రాంతి తీసుకునే యోచనలో ఉన్నారంటున్నారు.

సరిగ్గా అలాంటి సమయంలో  జరిగిన పార్టీ రజతోత్సవ వేడుకల పోస్టర్లలో హరీష్ ఫొటోనే కనిపించలేదు. దీంతో కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించడం ఖారరైపోయిందన్న భావనే సర్వత్రా వ్యక్తం అయ్యింది. 
ఒకప్పుడు పార్టీలో ట్రబుల్ షూటర్ గా  వెలుగొందని హరీష్ రావు ప్రాధాన్యత తగ్గించి, ఆయన స్థాయికి తగ్గ గౌరవం కూడా ఇవ్వడం లేదన్న భావన పార్టీ కార్యకర్తలలో వ్యక్తం అయ్యింది. అలాగే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న కేటీఆర్ ను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి అంగీకరించని పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏకంగా ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించేస్తుంటే మౌనంగా ఉంటారా అన్న ప్రశ్నలు కూడా వెల్లువెత్తాయి. అదే సమయంలో కేసీఆర్ తనయ, పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన మాటేంటంటూ గొంతెత్తడం మొదలెట్టారు. పార్టీ లైన్ కు భిన్నంగా మాట్లాడటంతో పార్టీలో లుకలుకలు ఉన్నాయనీ, అవి కూడా కేసీఆర్ కుటుంబం నుంచే మొదలయ్యాయన్న భావన అందరిలో వ్యక్తం అయ్యింది. 

ఈ తరుణంలో కేటీఆర్ స్వయంగా హరీష్ రావు నివాసానికి వెళ్లి దాదాపు రెండు గంటల పాటు ఆయనతో భేటీ కావడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అ భేటీలో  ఏం మాట్లాడుకున్నారన్న విషయాన్ని అటు కేటీఆర్ కానీ ఇటు హరీష్ రావు కానీ వెల్లడించలేదు. అయినా భేటీ చుట్టూ ఊహాగాన సభలు మాత్రం రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున జరిగిపోతున్నాయి. 

అయితే బీఆర్ఎస్ వర్గాలు మాత్రం ఇటీవల అనారోగ్యానికి గురైన హరీష్ రావు తండ్రిని పరామర్శించడానికి కేటీఆర్ వెళ్లారని చెబుతున్నప్పటికీ.. హరీష్ రావు, కేటీఆర్ ల భేటీపై రాజకీయ చర్చోపచర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. అందుకు కారణం మళ్లీ పార్టీలో ఇటీవలి కాలంలో హరీష్ రావుకు తగ్గుతున్న ప్రాధాన్యతే అనడంలో సందేహం లేదు. 

విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం కేసీఆర్ ఆదేశాల మేరకే కేటీఆర్ హరీష్ రావు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఇటీవలి కాలంలో హరీష్ కు పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోవడం, పార్టీ రజతోత్సవ సభ సందర్భంగా ఎక్కడా హరీష్ రావు పేరు వినిపించకపోవడం, ఫొటో కనిపించకపోవడంపై కేటీఆర్ హరీష్ కు ఎక్స్ ప్లనేషన్ ఇచ్చి ప్రసన్నం చేసుకోవాలన్న కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ హరీష్ రావుతో భేటీ అయ్యారనీ, విభేదాలను పక్కన పెట్టి కలిసి పని చేయాలన్న ప్రతిపాదన చేశారనీ అంటున్నారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత ఈ ముగ్గురి మధ్యా విభేదాల ప్రచారానికి ఫుల్ స్టాప్ పడిన తరువాతే పార్టీ పగ్గాల అప్పగింత ఉంటుందన్న కేసీఆర్ విస్పష్టంగా చెప్పి కే టీఆర్ ను హరీష్ నివాసానికి పంపారని కూడా అంటున్నారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న కల్వకుంట్ల కవిత స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత కేసీఆర్ ఈ ముగ్గురితోనూ భేటీ  అయ్యే అవకాశాలు ఉన్నాయి.  మొత్తం మీద పార్టీలో లుకలుకలు, చీలిక వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్న కేసీఆర్ ఆదేశాల మేరకే కేటీఆర్ హరీష్ రావుతో భేటీ అయ్యారని చెబుతున్నారు. 

By
en-us Political News

  
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.