Publish Date:Aug 17, 2022
కేటీఆర్ సీఎం కారు.. అయినా ఆయనకు తెలంగాణలో అంతకు మించి గుర్తింపు ఉంది. ఒక్క తెలంగాణలోనే కాదు.. దేశీయంగా, అంతర్జాతీయంగా కూడా కేటీఆర్ తనదైన ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆ గుర్తింపుతోనే చాలా మంది సీఎంలకు కూడా దక్కని ఒక అవకాశం ఆయన తలుపు తట్టింది.
బెస్ట్ సీఎంలుగా వివిధ సర్వేలతో ఊదరగొట్టించుకున్న ముఖ్యమంత్రులకూ రాని గుర్తింపు, అవకాశం కేటీఆర్ తలుపు తట్టింది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో జరిగే పలు ఆర్థిక సదస్సులకు ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరైన కేటీఆర్ కు ఇప్పుడు మరో ఆహ్వానం అందింది. అక్టోబర్ 4న స్విట్జర్ ల్యాండ్ లో జరిగే ఆసియా లీడర్స్ సిరీస్ సమావేశానికి కేటీఆర్ కు ఆహ్వానం అందింది. జ్యూరిచ్ లో జరిగే ఈ ప్రతిష్ఠాత్మక సమావేశానికి ఆసియా లీడర్స్ సీరిస్ ఫోరం కేటీఆర్ కు ఆహ్వానం పంపింది. ఆసియా-యూరప్ ఖండాల్లోని పలు దేశాల్లో రాజకీయ అనిశ్చితుల కారణంగా ప్రముఖ కంపెనీల వ్యాపార అవకాశాలపై పడుతున్న ప్రభావంపై ఈ సమావేశంలో చర్చిస్తారు.
ఆసియా, యూరప్ దేశాలకు చెందిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు పాల్గొనే ఈ సమావేశానికి తనకు ప్రత్యేకంగా ఆహ్వానం రావడం పట్ల మంత్రి కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులతో ఆలోచనలు పంచుకునేందుకు దొరికిన అవకాశంగా ఆయన ఈ ఆహ్వానాన్ని అభివర్ణించారు. ఇలాంటి సమావేశాలకు హాజరవడం వల్ల తెలంగాణ గురించి అంతర్జాతీయ వేదికపై ప్రజెంట్ చేసే అవకాశం లభించిందని ఆయన అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ktr-invited-for-prestigopus-asia-leaders-meet-25-142133.html
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు.
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.