కేసీఆర్ మనవడు హిమాన్షు టాలీవుడ్ ఎంట్రీ.!
Publish Date:Aug 12, 2026
Advertisement
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మనవడు, బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు టాలీవుడ్ ఎంట్రీపై ముహూర్తం ఖరారైపోయిందా? అంటే సోషల్ మీడియాతో పాటు సినీ వర్గాల నుంచీ ఔనన్న సమాధానమే వస్తోంది. కల్వకుంట్ల హిమాన్షు సినీ ఎంట్రీ ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కల్వకుంట్ల హిమాన్షు సంగీత ప్రతిభ తెలిసిందే. తన గానంతో సోషల్ మీడియాలో గుర్తింపు పొందారు. కల్వకుంట్ల హిమాన్సు పాడిన గోల్డెన్ అవర్ సాంగ్ నెటిజనులను విశేషంగా ఆకట్టుకుంది. కేవలం గానం, సంగీతమే కాకుండా..సామాజిక సేవాకార్యక్రమాల్లోనూ హిమాన్షు చురుగ్గా ఉంటారు. బెహతర్ ఇండియా కార్యక్రమంలో భాగస్వామిగా మారి 29 వేల 482 కిలోగ్రాముల రీసైకిల్ వ్యర్థాలను సేకరించి జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించారు. అలాగే త గజ్వేల్ సమీపంలోని గౌలిదొడ్డి ప్రభుత్వ పాఠశాలను 90 లక్షల వ్యయంతో అధునాతన హంగులతో అభివృద్ధి చేసి ప్రశంసలు అందుకున్నారు. ఇటీవలి కాలంలో హిమాన్షు రావు తన ఫిట్నెస్తో, సరికొత్త స్టైలిష్ లుక్లో కనిపిస్తున్నారు. ఆయన లుక్ కు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ లుక్కే హిమాన్షురావు త్వరలోనే హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారన్న ప్రచారం జోరందుకునేలా చేసింది. ఇప్పటికే కొందరు ప్రముఖ దర్శకులు ఆయన కోసం కథ సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. పొలిటికల్ ఫ్యామిలీ నుంచి సినీ ఎంట్రీ కొత్తేం కాదు... ఇప్పఇకే మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరో' సినిమాతో కథానాయకుడిగా పరిచయమయ్యారు. 2024 లోక్సభ ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువకుడు హిమాన్షు రావు పొలిటికల్ గ్లామర్, మాస్ ఫాలోయింగ్ కేసీఆర్ కుటుంబం నుంచి సినీరంగ ప్రవేశం చేయనున్నారన్న వార్త ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. KTR grand son tollywood entry, KTR son Himanshu, Himanshu Rao Cine debut, Kalvakuntla Himanshu Rao transformation, TeluguOne
http://www.teluguone.com/news/content/ktr-grand-son-tollywood-entry-25-228760.html





