కేటీఆర్ వ్యాఖ్యలకు ఏపీలో సమర్ధన.. మింగలేక కక్కలేక వైసీపీ యాతన

Publish Date:May 1, 2022

Advertisement

కల్వకుంట్ల తారకరామారావు డైనమిక్ యంగ్ పొలిటీషియన్ అని రోజా వంటి నేతల ప్రశంసలు అందుకున్న తెలంగాణ మంత్రి. ఒక్క మాటతో ఆయన ఏపీలో రాజకీయ దుమారం లేపేశారు. లేదు లేదంటూనే ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేశారు. ఏపీలో సౌకర్యాలపై సెటైర్ వేయడం ద్వారా తెలంగాణవైపు పారిశ్రామిక వేత్తలు ఆసక్తి పెంచుకునేలా చేసుకున్నారు. కేసీఆర్ ఏపీలో విద్యుత్, రోడ్లు, నీళ్లపై చేసిన వ్యాఖ్యలు  ఏపీతో పోలిస్తే  తెలంగాణలో సౌకర్యాలు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పుకోవడానికే. ఏపీలో లేవని చెప్పడం ద్వారా ఆయన చిన్నగీత, పెద్దగీత సిద్ధాంతాన్ని వాడుకున్నారు.

అయితే ఆయన వ్యాఖ్యలపై వైసీపీ నాయకుల స్పందన తీరు చూస్తే వారి పరిస్థితి మింగలేక..కక్కలేకా చందంగా తయారైందని అవగత మౌతుంది. ఎవరంగీకరించినా, అంగీకరించకున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన తరువాత నుంచి రెండు రాష్ట్రాలలో రాజకీయాలు కంపేరిజంపైనే ఆధారపడి ఉన్నాయి. సెంటిమెంటు అనుకున్నా...రాజకీయ అనివార్యత అనుకున్నా..ఒక దాని కంటే ఒకటి అభివృద్ధి, సంక్షేమంలో ముందున్నామని ప్రచారం చేసుకోవడం ద్వారా లబ్ధి పొందాలన్నదే ఇరు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీల తాపత్రేయంగా ఉంది.  2019కి ముందు వరకూ అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడుల ఆకర్షణ వంటి అన్ని విషయాలలోనూ ఇరు రాష్ట్రాల మధ్యా పోటాపోటీ వాతావరణం ఉండేది. 

అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితిలో మార్పు వచ్చింది. తెలంగాణ స్పీడ్ పెరిగితే..ఏపీ అభివృద్ధి గ్రాఫ్ దిగజారింది. అధికారిక గణాంకాలే ఈ విషయాన్ని స్పష్ట చేస్తున్నాయి. ఏపీలోని జగన్ సర్కార్ పూర్తిగా ఫ్రీ బీస్ మీద ఆధారపడి వచ్చే ఎన్నికలలో విజయానికి అవే శ్రీరామరక్ష అని భావిస్తూ ముందుకు సాగుతుంటే.. తెలంగాణ సర్కార్ అభివృద్ధి, సంక్షేమం, సెంటిమెంట్ అంటోది. ఈ నేపథ్యంలోనే తెలంగాణను ఏపీతో కంపేర్ చేస్తూ ప్రమోట్ చేసుకోవడానికి కేటీఆర్ క్రెడాయ్ సదస్సు వేదికను వినియోగించుకున్నారు. ఒకే సమయంలో అటు పెట్టుబడి దారులను ఆకర్షించడం, ఇటు ప్రజలలో ఏపీతో పోలిస్తే తెలంగాణ అభివృద్ధి బ్రహ్మాండంగా ఉందన్న భావన క్రియేట్ చేయడం. తెలంగాణ ప్రజలలో కేటీఆర్ మాటల ప్రభావం ఎంతుందో తెలియదు కానీ, ఏపీలో మాత్రం కేటీఆర్ మాటలు దుమారమే లేపాయి. విపక్ష తెలుగుదేశం సహా వైసీపీ యేతర పార్టీలన్నీ కేటీఆర్ మాటలు అక్షర సత్యాలని ప్రకటిస్తూ...జగన్ సర్కార్ ప్రతిష్ట దెబ్బతినేలా తెలంగాణ అభివృద్ధిని పరోక్షంగానైనా సరే ఏపీ ప్రజలలో ప్రచారం చేస్తున్నారు. సీపీఐ నారాయణ, వైసీపీ రెబల్స్ రఘురామరాజు, డీఎల్ రవీంద్రా రెడ్డి వంటి వారైతే ఒక అడుగు ముందుకు వేసి మీడియా సమావేశాలలో పవర్ పాయింట్ ప్రజంటేషన్లు కూడా ఇచ్చేశారు. 

దీంతో కేటీఆర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నా కూడా ఏపీ పరిస్థితిలో మార్పు రాలేదు. ఏపీ వెనుకబాటు తనం కేటీఆర్ మాటల సాక్షిగా ప్రజలలోకి వెళ్లిపోయింది. ఇప్పుడిక వైసీపీ సర్కార్ నష్ట నివారణకు తెలంగాణలో లోటుపాట్లను ఎత్తి చూపడంతో పాటు...ఏపీ ప్రగతికి తానేం చేసిందో చెప్పుకోవలసిన పరిస్థితిలో పడింది. ఇంత జరిగినా ముఖ్యమంత్రి జగన్ నోరు మెదపక పోవడం పరోక్షంగా కేసీఆర్ మాటలకు బలం చేకూర్చేదిగానే ఉంది. 

By
en-us Political News

  
ఆ ఆత్మీయ విందులో పాల్గొన్న వారెవరి మెబైల్ ఫోనూ ఒక్కసారి కూడా రింగ్ అవ్వలేదు. అంతెందుకు ఆ సమయంలో ఎవరూ ఫోన్ జోలికే పోలేదు. వాట్సాప్ చాటింగ్ ల ఊసే లేదు. కుటుంబాల ముచ్చట్లు, పెళ్లిళ్లు, పిల్లల చదువులు, కుటుంబాలా క్షేమ సమాచారాలు పంచుకోవడంతో అంతా ఆనందంగా ఆహ్లాదంగా గడిపారు.
తాజా జాబితాలో 5.67 కోట్ల మంది ఓటర్లు నమోదు కాగా, వీరిలో 2.77 కోట్ల మంది పురుషులు, 2.89 కోట్ల మంది మహిళలు 7,617 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. క్లెయిమ్‌లు, అబ్జెక్షన్ పీరియడ్‌లో దాఖలు చేసిన దరఖాస్తులను సమీక్షించి మార్పులు చేసినట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది.
రాష్ట్రంలో కాపు సామాజికవర్గం బానిస వర్గం కాదన్నారు. అరెస్టులకు భయపడేది లేదని ముద్రగడ ఈ సందర్భంగా చెప్పారు. గతంలో చంద్రబాబు తనను, తన కుటుంబాన్నీ వేధించిన తీరు అందరికీ తెలుసునని చెప్పిన ఆయన మాజీ మంత్రి ఇంటిపై ఏడు గంటల పాటు దాడులు చేయడం, అరెస్టులతో భయపెట్టాలని చూడటం ప్రజాస్వామ్యంలో సరికాదన్నారు.
కల్తీ పాల వల్లే వారు అనారోగ్యం పాలయ్యారని ప్రాథమికంగా నిర్థారణ అయిందన్నారు. అంతకుముందు కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో వర్చువల్ గా చంద్రబాబు సమావేశమైన చంద్రబాబు కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పాల శాంపిల్స్ ఫలితాలు వచ్చిన తర్వాత పాలు అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఇటీవ‌ల కిరాక్ ఆర్పీ.. వైసీపీ ఎమ్మెల్సీ, మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత‌ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను అవ‌హేళ‌న చేస్తూ మాట్లాడారు. ఆ వెంట‌నే కాపుల్లో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది. దీంతో దిగి వ‌చ్చిన ఆర్పీ క్ష‌మాప‌ణ చెప్పారు కూడా. అలాగ‌ని కాపులంతా వైసీపీకి స‌పోర్ట్ చేయ‌డం అని అర్ధం కాదు క‌దా ? అంటున్నారు వంగవీటి రాధా అభిమానులు.
రాజకీయ ప్రవేశంపై తనకు ఆసక్తి ఉన్న మాట వాస్తవమేననీ, అయితే అందుకు ఇంకా సమయం ఉందన్నారు. ఇప్పటికే ఆమె సోదరుడు వంగవీటి రాధా రాజకీయాల్లో చురుగ్గా ఉన్న సంగతి విదితమే.
తెలంగాణ‌లో కమలం పార్టీ ఎప్ప‌టి నుంచి పుంజుకుంది? రాష్ట్రంలో అధికారం చేప‌ట్టే అవ‌కాశ‌మెంత‌ అన్న‌దొక చ‌ర్చ‌.
తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై నుంచి అధిక సంఖ్యలో కవాహనాలతో వెళ్ల కూడదని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ అంబడి రాంబాబు, జక్కంపూడి రాజా ఆ నోటీసులను ధిక్కరించి భారీ ర్యాలీ నిర్వహించడమే కాకుండా రైల్ కం రోడ్డ బ్రిడ్జిపై పెద్ద సంఖ్యలో వాహనాలతో వెళ్లడంతో రాజమహేంద్రవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
గుంటూరులోని తన నివాసంపై తెలుగుదేశం శ్రేణుల దాడి, తనపై హత్యయాత్నం చేయడం తదితర విషయాలను జగన్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా జగన్ అంబటికి కేసులకు భయపడవద్దని ధైర్యం చేప్పారు. కేసులను చట్టపరంగా ఎదుర్కొందామని భరోసా ఇచ్చారు.
అప్పట్లో అధికారపార్టీలో ఉన్న అనంతబాబుతో అధికారంలో ఉన్న వై ఉన్న అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కయ్యారని వ్యాఖ్యానించింది. డీఫాల్ట్ బెయిల్ వచ్చేలా ఛార్జ్‌షీట్ దాఖలు చేశారని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.
వైసీపీ సభ్యులు వేంకటేశ్వర స్వామి ఫొటోలు, ప్లకార్డులతో పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. సభలో వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.