ఫార్ములా -ఇ కార్ లో భారీ స్కామ్ జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో ఆయన అరెస్టయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కూడా తన అరెస్టు అనివార్యం అని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అరెస్టు భయం లేదు, ఒక వేళ అరెస్టు చేస్తే జైల్లో యోగా చేసి మరింత ఫిట్ గా తయారౌతానంటూ చెప్పుకొస్తున్నారు. ఒక విధంగా అరెస్టుకు కేటీఆర్ మానసికంగా రెడీ అయిపోయినట్లు కనిపిస్తోందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇటీవల తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ తన హయాంలో అంటే తాను మంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ ఇన్వెస్టర్లకు ఎలా ప్రధాన గమ్యంగా మారిదో వివరించారు. తాను ఐటీ మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి చేసిన ప్రయత్రాలను, సాధించిన ఫలితాలను వివరించిన కేటీఆర్ పనిలో పనిగా ఫార్ములా - ఇ కార్ వ్యవహారాన్ని కూడా ప్రస్తావించారు. అలా ప్రస్తావించి ఊరుకోకుండా చంద్రబాబు హయాంలో హైదరాబాద్ లో ఫార్ములా -1 రేస్ నిర్వహణ కోసం జరిగిన ప్రయత్నాలను ప్రస్తావించారు. తద్వారా తాను చేసింది రైట్ అని చెప్పుకోవడానికి ప్రయత్నించారు.
చంద్రబాబు ప్రయత్నానికి తాను చేసింది కొనసాగింపు మాత్రమేనని చెప్పుకోవడానికి ప్రయత్నించారు. ఫార్ములా -ఇ కార్ ను అడ్డుకోవడం ద్వారా రేవంత్ హైదరాబాద్ ప్రతిష్టను దిగజార్చారని ఎదురుదాడికి దిగారు. చంద్రబాబు పేరు ప్రస్తావించడం ద్వారా రేవంత్ రెడ్డిని డిఫెన్స్ లో పడేయాలన్నదే కేటీఆర్ ప్రయత్నంగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.
అదే సమయంలో కామన్ వెల్త్ క్రీడల నిర్వహణ సందర్భంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై వచ్చిన విమర్శలను ప్రస్తావించారు. మొత్తం మీద కేటీఆర్ తనపై ఆరోపణలను పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు పేరును వాడేసు కుంటు న్నారు. ఫార్ముల వన్ రేస్ ల కోసం చంద్రబాబు ప్రయత్నాలకు ఇప్పడు కేటీఆర్ ఎదుర్కొంటున్న ఆరోపణలకూ ఏ మాత్రం సంబంధం లేదని, చంద్రబాబును అడ్డుపెట్టుకుని బయటపడడానికి ప్రయత్నించడం సరికాదనీ, ఫార్ములా -ఇ రేస్ కుంభకోణంలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని నెటిజన్లు పేర్కొంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ktr-desperete-to-save-himself-in-farmula-3-race-scam-39-188074.html
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.