చంద్రబాబుపై కేటీఆర్ పొగడ్తల వర్షం: ఖండించలేక, సమర్థించలేక జగన్ సతమతం.!

Publish Date:Oct 30, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో సరిగ్గా స్థానిక ఎన్నికల వేళ.. జగన్ కు ఆయన మిత్రుడు బిగ్ షాక్ ఇచ్చారు. జగన్ రాష్ట్రంలో తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు  పాలనను, కరవును ఎదుర్కొనే విషయంలో చూపుతున్న నిర్లక్ష్యాన్ని, పాలనా వైఫల్యాలనూ తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఎండగడుతున్న వేళ..పొరుగు రాష్ట్రంలోని ఆయన మిత్రుడు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు చంద్రబాబునాయుడి పాలనా దక్షతను, విధానాలను ప్రశంసించారు.  


సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.  ఒక సందర్భంలో సినీ నటుడు రజనీకాంత్ అమరావతిని, చంద్రబాబు నాయకత్వాన్ని ప్రశంసించినప్పుడు ఆయనపై వైసీపీ సోషల్ మీడియాలోనూ, బహిరంగంగానూ  విమర్శల దాడికి దిగింది.    కానీ పాపం, తాజాగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే పదే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి ముందుచూపును, కరవు సమర్థవంతమైన నిర్వహణను ప్రస్తుతిస్తే.. మింగలేక కక్కలేక అన్నట్లు మౌనం వహించింది.     

ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయమేంటంటే.. వైసీపీ అధినేత జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  మంచి దోస్తులు. వారిరువురి మధ్యా రాజకీయ, వ్యక్తిగత మైత్రీ బంధం అందరికీ తెలిసిందు.  అయితే ఇప్పుడు బీఆర్ఎస్ కు తెలంగాణలో రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి అక్కడి ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించడం రాజకీయ అవసరం. అందుకోసం పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు పాలనతో పోలుస్తూ రేవంత్ వైఫల్యాలను ఎండగట్టడం ఆ పార్టీకి అనివార్యం.  

ఆ రాజకీయ అనివార్యత కారణంగానే కేటీఆర్ చంద్రబాబును ఆకాశానికెత్తేస్తూ పొగడ్తల వర్షం కురిపించారు. అందు కోసం ఆయన జగన్ తో మైత్రిని పట్టించుకోలేదు. లెక్క చేయలేదు.  చంద్రబాబును ప్రశంసించిన ఎవరిపైనైనా పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ ముద్ర వేసి అనుచిత వ్యాఖ్యలతో, విమర్శలతో విరుచుకుపడే వైసీపీ ఇప్పుడు మౌనం వహించడంగమనార్హం.  కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తే తెలంగాణలో బీఆర్‌ఎస్‌ తో సంబంధాలు దెబ్బతింటుందనే భయం, అలాగని మౌనం వహిస్తే.. చంద్రబాబు సమర్థతను అంగీకరించినట్లౌతుందన్న ఆందోళనతో వైసీపీ సతమతమౌతున్నట్లు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. 


[KTR Big Shock To Jagan, Praises CBN, Telangana, Andhra Pradesh Politics, Political Necesacities, Telugu One]

By
en-us Political News

  
మహిళా సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయాల్లో గెలుపు కోసం ప్రచారం, సభలు, సమావేశాలు.. ఇలా ఎన్నో వ్యూహాలు అవసరమని భావిస్తుంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత ప్రత్యేమైన ప్రాంతంలో జరుపుకున్నారు.
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.