మైనంప‌ల్లి వెనుక కేటీఆర్? హరీష్ కు చెక్ పెట్టేందుకేనా?

Publish Date:Oct 4, 2023

Advertisement

కుమారుడి రాజకీయ భవిష్యత్తే ముఖ్యమనుకున్న మైనంపల్లి హన్మంతరావు, రోహిత్‌ను మెదక్ నుంచి పోటీ చేసేందుకు మార్గం సుగమం చేసుకున్నారు.  ఈ నేపథ్యంలోనే సేవా కార్యక్రమాలు, ఇతర పనులతో మెదక్ లో  రోహిత్ ప్రజల్లో ఉంటున్నారు.   ఇక్క‌డ ఓ విష‌యం మ‌నం మాట్లాడుకోవాలి. అదేమిటంటే మైనంపల్లి హనుమంతరావు సొంత జిల్లా   గ‌తంలో మెదక్  నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్ఎస్ లో హరీష్ పెత్తనం కారణంగా ఆయన జిల్లాలో రాజకీయాలు చేయలేకపోయారు. కానీ ఇప్పుడు తన కుమారుడి కోసం హరీష్ ను టార్గెట్ చేసి కాంగ్రెస్ లో చేరిపోయి… ఉమ్మడి మొదక్ జిల్లా బాధ్యతల్ని తీసుకున్నారు.  అంతే కాదు బీఆర్ఎస్ కంచుకోటలపై దృష్టి పెట్టారు. రామాయంపేటకు చెందిన మైనంపల్లి గతంలో తెలుగుదేశం మెదక్‌ జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. మైనంపల్లి 2009 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా మెదక్‌ నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత మల్కాజిగిరికి మారారు. ఇప్పుడు కొడుకు కోసం మళ్లీ మెదక్ పై దృష్టి పెట్టారు. నర్సాపూర్ బాధ్యతల్ని కూడా తీసుకునేదుకు సిద్ధమయ్యారు. మెదక్‌ సొంత జిల్లా కావడంతో పాటు కార్యకర్తల్ని ఆదుకుంటారన్న పేరు ఉండటంతో మెదక్‌తో పాటు నర్సాపూర్ నియోజకవర్గాల్లో  ఆయనకు ఊరూరా అనుచగణముంది. వారినీ యాక్టీవ్‌ చేస్తున్నారు.  మైనంపల్లి రోహిత్‌ మెదక్‌ కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారు. మైనంపల్లి ఫౌండేషన్‌ పేరిట  ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ అన్ని గ్రామాల్లోనూ అనుచరుల్ని ఏర్పాటు చేసుకున్నారు. దేవాలయాలు, ఇండ్లు, కమ్యూనిటీహాల్స్‌ నిర్మాణం, వైద్య, విద్య అవసరాల కోసం సాయం చేస్తున్నారు. ఇదంతా ఎన్నికల్లో కలిసొస్తుందని భావిస్తున్నారు. 

నర్సాపూర్ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి ఇవ్వడం లేదు. దీంతో ఆయనను కాంగ్రెస్‌లో కి లాగేందుకు మైనంప‌ల్లి ప్రోత్సహిస్తున్నారు. మైనంపల్లి దూకుడు హరీష్ రావుకు ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే… ఉమ్మడి మెదక్ జిల్లాలో  తెలంగాణ ఆవిర్భావం నుంచీ హరీష్ రావు పెత్త‌న‌మే న‌డుస్తోంది.  అక్కడ క‌నుక పట్టు కోల్పోతే హరీష్ రావుకు రాజకీయ ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోతుంది.  పార్టీలో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన హరీష్ రావు మెదక్ జిల్లాపై పట్టు కోల్పోతే.. ఇక  పార్టీలో ఆయనకు పెద్ద ప్రాధాన్యత ఉండదు. ఇప్పటికీ పార్టీలో కేసీఆర్ తరువాత నంబర్ టూ స్థానం కోసం కేటీఆర్ తో పోటీ పడుతున్నది హరీష్ రావేనని పార్టీ  శ్రేణులే చెబుతున్నాయి. అటువంటి హ‌రీష్ రావుకు మెదక్ జిల్లాపై పట్టు జారితే.. ఇక ఆయన కేటీఆర్ కు సమఉజ్జీగా ఉండే అవకాశమే లేదు. అందుకే స్వయంగా కేటీఆరే మైనంపల్లిని హరీష్ కు వ్యతిరేకంగా  ప్రొత్సహించి పెంచారా అన్న అనుమానాలు కూడా పార్టీ శ్రేణుల్లో వ్యక్తం  అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే  హ‌రీష్ రావు  మైనంపల్లికి చెక్ పెట్టేందుకు జాగ్ర‌త్త‌గా పావులు క‌దుపుతున్నారు. మైనంప‌ల్లిని దెబ్బ‌తీయ‌డానికి అంది వచ్చే ఏ అవకాశాన్నీ వ‌దులుకోవ‌డం లేదు. కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్ట‌డానికి త‌న‌దైన స్టైల్‌లో  వ్యూహాలు రచిస్తున్నారు. ఫ‌లితం ....

మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ లోకి వెళ్ల‌డం వల్ల..ఆ పార్టీ బలం ఎంత పెరిగిందో తెలియదు గాని..  రెండు వికెట్లు ప‌డిపోయాయి.  దీని వెనుక హ‌రీష్ రావు హ‌స్తం వుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మేడ్చల్‌ జిల్లా  కాంగ్రెస్ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.  మెదక్ సీటు మైనంపల్లి తనయుడికు కేటాయిస్తున్న నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ నేత కంటారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.  

మరో ప‌క్క అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్న సీనియ‌ర్లు మైనంపల్లి కేంద్రంగా అధిష్టానం ముందు గొడవ మొదలు పెట్టేశారు. మైనంపల్లికి, ఆయన కుమారుడికీ కూడా వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ కేటాయించడాన్ని ప్రస్తావిస్తూ.. తమకు  కూడా డబుల్ టికెట్లు కావ్వాల్సిందే అంటున్నారు. ఒకే కుటుంబంలో రెండు టికెట్లు ఇవ్వడం సాధ్యం కాదని మొదట్లోనే కాంగ్రెస్‌ అధిష్టానం స్పష్టంగా చెప్పింది. అయితే పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి మాత్రం మినహాయింపు ఇచ్చింది.  ఎందుకంటే ఉత్తమ్ దంపతులు ఎప్పటినుండో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారని చెప్పింది.  ఈ విషయమై అధిష్టానం గట్టిగా ఉండటంతో  పార్టీ సీనియర్లు ఏమీ మాట్లాడలేకపోయారు. 
అయితే బీఆర్ఎస్ నుండి కొత్తగా కాంగ్రెస్ లో చేరిన మైనంపల్లికి కూడా అధిష్టానం మినహాయింపు ఇచ్చి మల్కాజ్ గిరి నుండి మైనపంల్లికి, మెదక్ నుండి ఆయన కుమారుడు రోహిత్ రావుకు టికెట్లు ఖాయం చేసింది. దాంతో చాలామంది సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మైనంపల్లికి మినహాయింపు ఇచ్చినట్లే తమకూ మినహాయింపు ఇచ్చి తమ కుటుంబాలకు కూడా రెండు టికెట్లు ఇవ్వాల్సిందే అంటే సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ, జానారెడ్డి, కొండా సురేఖ, జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మల్ రెడ్డి రంగారెడ్డి పట్టుబడుతున్నారు.

అయితే మైనంపల్లిది ప్రత్యేక  కేసుగా కాంగ్రెస్ అధిష్టానం చూస్తున్నది. ఇందుకు బ‌ల‌మైన కార‌ణ‌మే వుంది.    మైనంపల్లి ప్రభావం మూడు నాలుగు నియోజకవర్గాల్లో ఉంటుందన్నది వాస్తవమే. ఆర్ధిక, అంగ బలం   ఉన్న మైనంపల్లికి నాలుగు నియోజకవర్గాల్లో బలమైన మద్దతుదారులున్నారు కాబ‌ట్టి కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయంలో గట్టిగానే నిలబడింది. ఈ నేపథ్యంలోనే  మెదక్  కాంగ్రెస్ లో అస‌మ్మ‌తి ప‌తాక స్థాయికి చేరుకుంది. కాంగ్రెస్ మెదక్ జిల్లా అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఆయ‌న మెదక్ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. ఆ దిశగా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. మెదక్ టికెట్ తనకే ఇస్తారని ఆశించారు. కానీ ఇప్పుడు మైనంపల్లి పార్టీలో చేరడంతో తిరుపతి రెడ్డి ఆశలు కుప్పకూలాయి. మైనంపల్లి కుమారుడు రోహిత్ కే కాంగ్రెస్ మెదక్ టికెట్ ఇచ్చే అవకాశం ఉండటంతో తిరుపతి రెడ్డి పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. 
 
 మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు రాక‌తో మ‌రో ముఖ్య‌నేత కూడా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేశారు. మొద‌టి నుంచి మైనంప‌ల్లి చేరికను వ్యతిరేకిస్తున్న మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు నందికంటి శ్రీధర్ పార్టీకి రాజీనామా చేస్తూ ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేకు లేఖ రాశారు.  ఉద‌య్‌పూర్ తీర్మానానికి వ్య‌తిరేకంగా  కాంగ్రెస్ పార్టీ  మైనంపల్లి కుటుంబానికి రెండు టికెట్లు ఇవ్వడం, బీసీనేత‌నైన త‌న‌ను కాంగ్రెస్ పార్టీ అణ‌గ‌క‌దొక్క‌డం బాధించింద‌ని, ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ పార్టీకి, జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు నందికంటి శ్రీ‌ధ‌ర్ లేఖ‌లో వెల్ల‌డించారు.

గ్రౌండ్ లెవెల్‌లో చూస్తే మల్కాజిగిరిలో బి‌ఆర్‌ఎస్‌కు పట్టు ఉంది. పైగా అక్కడ బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధిగా మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి పేరు దాదాపుగా ఖ‌రారు అయిన‌ట్లే. దీంతో ఇక్క‌డ పోటీ మరింత రసవత్తరంగా మార‌నుంది. మల్కాజిగిరిలో బి‌ఆర్‌ఎస్ బలమైన పార్టీ.. అయితే మైనంపల్లికి సెపరేట్ ఫాలోయింగ్ ఉంది. దీని వల్ల బి‌ఆర్‌ఎస్ బలం కాస్త తగ్గవచ్చు. అటు కాంగ్రెస్‌కు కొంత బలం ఉంది. అది కలిసిరావచ్చు. మల్లారెడ్డి అల్లుడు ఆర్ధికంగా, సామాజికంగా బలమైన నేత..దీంతో గట్టి పోటీ తప్పదు. అయితే మైనంపల్లి బలమైన ఫాలోయింగ్ ఉన్న నేత. అటు కాంగ్రెస్ ఓటింగ్ కూడా కలిసిరావచ్చు. దీంతో మల్కాజిగిరి పోరు ఈ సారి రసవత్తరంగా సాగే ఛాన్స్ ఉంది.
కాకపోతే ఇక్కడ బి‌జే‌పికి కూడా ఒకింత  పట్టు ఉండటంతో  త్రిముఖ పోరు జరిగే ఛాన్స్ ఉంది. దీంతో గెలుపు ఎవరికీ నల్లేరుమీద బండినడక కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక మైనంపల్లి తనయుడు పోటీ చేసే  మెదక్ నియోజకవర్గంలోనూ పోటీ రసవత్తరంగానే ఉంటుందని అంటున్నారు. హరీష్ రావు.. మైనంపల్లిని, కాంగ్రెస్ ను బలహీనం చేసే లక్ష్యంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనీ, మైనంపల్లిని దెబ్బకొట్టగలిగితే.. తన పట్టు నిలుపుకోవడమే కాకుండా, కేటీఆర్ కూ చెక్ పెట్టినట్లు అవుతుందని భావిస్తున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు.
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు.
గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.