కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు

Publish Date:Jun 13, 2025

Advertisement

 

ఫార్ములా-ఈ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. సోమవారం జూన్ 16న  10 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. గత బీఆర్ఎస్ అధికారంలో, కేసీఆర్ ముఖ్యమంత్రిగా వుండగా హైదరాబాద్ లో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు. రాజధాని నగరం హైదరాబాద్ నడిబొడ్డున ఓవైపు హుస్సెన్ సాగర్, మరోవైపు కొత్త సచివాలయం మధ్య ఎన్టీఆర్ గార్డెన్ నుండి ఐమాక్స్ మీదుగా 2.8 కిలోమీటర్ల మేర ఈ కారు రేస్ సాగింది. 

ఇందుకోసం ప్రత్యేకంగా రోడ్డును సంసిద్దం చేసారు. ఫిబ్రవరి 11, 2023 లో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలకు  అసెంబ్లీ ఎన్నికల వేళ అక్టోబర్ 2023లో ఫార్ములా ఈ ఆపరేషన్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా హెచ్ఎండిఏ రూ.55 కోట్లను ఎఫ్ఈవో కు చెల్లించింది. ఈ డబ్బులు చెల్లింపులోనే అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఆర్థిక శాఖ నుండి ముందస్తు అనుమతి లేకుండానే డబ్బులు చెల్లించారని అంటోంది. అంతేకాదు విదేశీ సంస్థకు నిధుల చెల్లింపు విషయంలోనే ఆర్బిఐ నిబంధనలు పాటించలేరని తమ విచారణలో తేలినట్లు చెబుతోంది.

By
en-us Political News

  
బీజేపీ తన వ్యూహాత్మక నిర్ణయాలతో ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల ఎంపికలో  ఈ విషయం మరోసారి ప్రస్ఫుటమైంది.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశారు. బీజేపీ అధ్యక్ష పదవిని ఆశించి భంగపడ్డ ఆయన పార్టీ అధ్యక్షుడిగా రామచంద్రరావును పార్టీ ప్రకటించడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ వ్యవహార శైలి, కాంగ్రెస్ కల్చర్ కు చాలా భిన్నంగా ఉంటుందని రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ వర్గాల్లో చాలా  కాలంగా వినిపిస్తోంది. అవును.. కాంగ్రెస్ నాయకులు, శ్రేణులతో పాటుగా  ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలలో కూడా మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ కల్చర్ కు భిన్నంగా వ్యహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది. 
మొన్న‌టి వ‌ర‌కూ కిష‌న్ రెడ్డిని కేసీఆర్ ప్రోగా ఉండే బీజేపీ అధ్య‌క్షుడంటూ ఒక గొడ‌వ న‌డిచేది. అన్న‌ట్టుగానే బీజేపీ తెలంగాణ‌లో గ‌ట్టి పోటీ ఇవ్వ‌లేక‌.. సెకండ్ ప్లేస్ టు థ‌ర్డ్ ప్లేస్ కి ప‌డిపోయింది క‌మ‌లం పార్టీ.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి సోమవారం (జూన్ 30)సాయంత్రం బయలుదేరి తాడేపల్లికి రానున్నారు. 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత జగన్ ఆంధ్రప్రదేశ్ కు, తాడేపల్లిలోని ఆయన ప్యాలెస్ కు చుట్టపు చూపుగానే వస్తున్నారు. దీంతో జగన్ తాడేపల్లి ప్యాలెస్ రాకకు పెద్దగా ప్రధాన్యత ఉండే అవకాశం లేదు.
పఠాన్‌చెరు మండలం పాశ మైలారం పారిశ్రామిక వాడలోని సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం (జూన్ 30) ఉదయం సంభవించిన భారీ పేలుడులో కనీసం ఐదుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు.
తెలుగు న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ భార్య స్వప్న తెరపైకి వచ్చి సంచలన ఆరోపణలు చేశారు.
ఉభయ తెలుగు రాష్ట్రాలకు బీజేపీ నూతన అధ్యక్షులు ఎవరో తేలిపోయింది? ఇంతవరకు అనేక కోణాల్లో, అనేక సమీకరణలు ఆధారంగా లెక్కలు కట్టిన కమల దళం చివరకు నాగపూర్ ఎంపిక చేసిన పాత కాపులకే పట్టం కట్టింది.
పురుగుల మందు తాగి ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖమ్మం జిల్లాలో  జరిగింది. ఖమ్మం రైల్వే ఎస్సై రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆమెను వెంటనే ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటం వ్యాలీపై ఈ రోజు విజయవాడలో నిర్వ‌హించ‌నున్న‌ నేషనల్ క్వాంటం వర్క్‌షాప్ లో పాల్గొనేందుకు అంతర్జాతీయ ఐటీ సంస్థలు, బహుళజాతి కంపెనీల ప్రతినిధులు రాష్ట్రానికి చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ వినియోగదారులకు ఇది నిజంగా శుభవార్తే. తక్కువ విద్యుత్ వినియోగించేవారికీ, పీఎం సూర్యఘర్  పథకం కింద  సోలార్ ప్యానెళ్లు పెట్టుకున్న లబ్ధిదారులకు అడ్వాన్స్ కంజప్షన్ డిపాజిట్ (ఏసీడీ) చార్జీల వసూలు నిర్ణయాన్ని ఏపీసీపీడీసీఎల్ ఉపసంహరించుకుంది.
అన్నమయ్య జిల్లాలో ఈ తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. తిరుమల నుంచి కర్నాటకలోని బాగేపల్లి వెడుతున్న టెంపుల్ ట్రావెల్ ను లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.