కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు : ఎంపీ సీఎం రమేశ్
Publish Date:Jul 26, 2025
Advertisement
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్ కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎంపీ సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ చేసిన ఆరోపణలకు అనకాపల్లిలో మీడియా సమావేశంలో సీఎం రమేష్ సమాధానం ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి రూ.1660 కోట్లతో నామిషన్ పనులు ఇచ్చారని కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎంపీ అన్నారు. గత బీఆర్‌ఎస్ హయాంలో రిత్వి ప్రాజెక్టు రూ.2000 కోట్లతో చేపట్టారని వాటిని నామిషన్ కింద ఇచ్చార అని కేటీఆర్‌ను ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిపై బురద జల్లాలని నాపై లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్ కవిత జైల్లో ఉన్నప్పుడు దిల్లీలో నా ఇంటికి వచ్చి కలిసిన విషయం కేటీఆర్ మర్చిపోయారా..? రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తాయన్న భయంతో కేటీఆర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నాపై చేసిన తప్పుడు ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధం’’ అని సీఎం రమేశ్ అన్నారు.
http://www.teluguone.com/news/content/ktr-39-202793.html





