లోకేశ్‌ను కలవలేదు..కలిస్తే తప్పేంటి : కేటీఆర్
Publish Date:Jul 18, 2025
.webp)
Advertisement
ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను కలవలేదు కానీ కలిస్తే తప్పేంటి..? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. శుక్రవారం ఖమ్మంలోని దివంగత మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కుటుంబాన్ని పరామర్శించి ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ బీఆర్‌ఎస్ నేతలతో కలిసి మాట్లాడారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో డబ్బున్న మహిళలు మధ్యాహ్నం కిట్టి పార్టీలు చేసుకుంటుంటారు. ఆయన కూడా కిట్టి పార్టీ ఆంటీలాగా వ్యవహరిస్తున్నాడు. ఎవరో ఎక్కడో చెప్పింది విని అదే నిజమనుకుని భ్రమించి, మళ్లీ ఓ పది మందిని పోగేసుకుని చిట్ చాట్‌ల పేరిట చిల్లర మాటలు మాట్లాడుతున్నాని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
శవాల మీద పేలాలు ఏరుకోవడం ఏందయ్యా..? నాకర్థం కాదు. ఎవడో దుబాయ్‌లో చనిపోతే దాన్ని నాకు అంటగట్టడం ఏంది ఏమన్నా జ్ఞానం ఉందా అని మాజీ మంత్రి ప్రశ్నించారు. నేను అర్ధరాత్రి పోయి లోకేశ్‌ను కలిసానట. మేం ఏం జేసిన బాజాప్తా చేస్తాం. బేజాప్తా చేయాల్సిన కర్మ మాకు లేదు. అయినా నాకు తెల్వక అడుగుతా.. కలవలేదు కానీ కలిస్తే తప్పేంది..? అని రేవంత్‌ను కేటీఆర్ ప్రశ్నించారు. పక్క రాష్ట్రం మంత్రి యువకుడు నాకు తమ్ముడి లాంటోడు కలిస్తే కలుస్తా.. కానీ కలవలేదు. దానికేదో ఆయన గొప్ప విషయం కనిపెట్టినట్టు. పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్నే బీఆర్ఎసోళ్లను కలుస్తారు. దోపిడీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తారు. ఆయన నన్ను కలిస్తే నీకేం ఇబ్బంది. నీకేం బాధ అయితుంది. ఈ చిల్లర మాటలతోని ఎన్నిరోజులు టైం పాస్ చేస్తవ్. ఎన్ని రోజులు ప్రజలను ఆగం చేసే ప్రయత్నం చేస్తవ్ అని ముఖ్యమంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
http://www.teluguone.com/news/content/ktr-39-202224.html












