గుడివాడలో హైటెన్షన్.. వైసీపీ, టీడీపీ మధ్య ఫ్లెక్సీల వార్
Publish Date:Jul 12, 2025
.webp)
Advertisement
కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోటాపోటీ ఫ్లెక్సీలతో గుడివాడ పాలిటిక్స్ హీటెక్కింది. కుప్పంలో చంద్రబాబు గెలవరని గతంలో మాజీ మంత్రి కొడాలి నాని చేసిన సవాల్‌ను గుర్తు చేస్తూ తెలుగు దేశం పార్టీ నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బూట్‌ను కొడాలి నాని పాలిష్ చేస్తున్నట్లుగా నెహ్రూ చౌక్ సెంటర్లో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే బూట్ పాలిష్ చేసి కాళ్ళ దగ్గర ఉంటానంటూ కొడాలి నాని చేసిన చాలెంజ్ నిలబెట్టుకోవాలంటూ గుడివాడ టీడీపీ కార్యకర్తల పేరుతో ఫ్లెక్సీ ఏర్పాటైంది.
మరోవైపు బాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ అంటూ వైసీపీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. దీంతో పోటాపోటీ ఫ్లెక్సీలతో గుడివాడ రాజకీయం గరం గరంగా మారింది. మరోవైపు ఇవాళ గుడివాడలో వైసీపీ నాయకుల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి పేర్నినాని ముఖ్యఅతిథిగా హాజరవడంతో ఉద్రిక్తత నెలకొంది. చీకట్లో కన్నుకొడితే.. తలలు నరికేయండి అంటూ పేర్నినాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా రెండు రోజుల నుంచి పేర్నినాని చేస్తున్న కామెంట్స్‌కు నిరసనగా... నాగవరప్పాడు జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన వైసీపీ ఫ్లెక్సీని టీడీపీ శ్రేణులు చించివేశారు. అయితే ఫ్లెక్సీని చించకుండా పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. టీడీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పేర్ని నాని ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు.
http://www.teluguone.com/news/content/krishna-district-39-201868.html












