కార్తీక మాసాన్ని హిందువులందరూ అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తూ ఉంటారు. శివ కేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసంగా కార్తీక మాసం గురించి ఎంతో విశిష్టంగా చెబుతూ ఉంటారు. ఇక హైదరాబాదులో కార్తీకమాసం అనగానే హిందువులందరికీ కోటి దీపోత్సవం కార్యక్రమం జ్ఞప్తికి రాకుండా ఉండదు. హైదరాబాదులో ఏటా అత్యంత వైభవంగా, ఆధ్యాత్మికత ఉట్టిపడేటట్టుగా జరిగే కోటి దీపోత్సవం ఈ ఏడాది కూడా జరగనుంది.
నవంబర్ 9వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా కార్తీక కోటి దీపోత్సవాన్ని నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.. 2012లో శృంగేరి పీఠాధిపతి జగద్గురు భారతీ తీర్థ మహాస్వాముల వారి అమృత హస్తాల మీదుగా ప్రారంభమైన కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా భక్త జనం ఒళ్ళు పులకరించేలా హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా కార్యక్రమాన్ని నిర్వహించడానికి సర్వం సిద్ధమైంది. ఈ ఏడాది 17 రోజులపాటు అనేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికల సిద్ధం చేశారు. శివకేశవులని ఒకే వేదికపై కోటీదీపాల మధ్య దర్శించుకునే యోగమే ఈ కోటి దీపోత్సవం. జనం గుండె లోతుల్లో దాగిన భక్తిభావాలను వెలికి తీసే పవిత్ర కార్యంగా ఈ కోటిదీపోత్సవంను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి దేశం నలుమూలల నుంచి పీఠాధిపతులు, మహాయోగులు, ఆధ్యాత్మికవేత్తలు తరలి వస్తుండగా వారి ప్రవచనామృతంతో మొదలై, ప్రత్యేక అర్చనలతో పవిత్రత సంతరించుకుని, దేవదేవుల కళ్యాణ మహోత్సవాలు, లింగోద్భవం, నీరాజనాలతో భక్తులకు నిండైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచే ఈ మహోత్సవాన్ని కనులారా వీక్షించడం ఒక గొప్ప అదృష్టం.
ప్రతిరోజు కళ్యాణ మహోత్సవం అనంతరం ఉత్సవ విగ్రహాల ఊరేగింపు చూసి తరలించాల్సిందే తప్ప వర్ణించడానికి మాటలు లేవు. రావు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల దేవతామూర్తులను చూసి భక్తకోటి పులకించిపోయే అద్భుత దృశ్యం ఈ కోటిదీపోత్సవంలో ప్రతిరోజూ సాక్షాత్కారమవుతుంది. కోటి దీపాల మహోత్సవాన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవనడంలో ఎలాంటి సందేహం లేదు. నవంబర్ 9 నుంచి ప్రారంభం కాబోతున్న ఈ వేడుకను నవంబర్ 25వ తేదీ వరకు హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/koti-deepotsavam-from-november-9th-25-188007.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.