వైసీపీచేయాల్సింది నిరసన దీక్షలు కాదు ప్రాయశ్చిత్త దీక్షలు.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.!

Publish Date:Aug 8, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో  వైసీపీ చేపట్టిన  నిరసన కార్యక్రమాలపై నెల్లూరు రూరల్  ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. జగన్ ఐదేళ్ల హయాంలో చేసిన అక్రమాలు, అవకతవకలకు, ఆర్థిక అరాచకత్వానికీ ఆ పార్టీ ప్రాయశ్చిత్త దీక్షలు చేయాలన్నారు.   అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన  గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అన్ని  వ్యవస్థలను భ్రష్టు పట్టించినందుకు  ప్రాయశ్చిత్త దీక్షలు  చేసుకోవాలన్నారు. చేసుకోవాలని ఎద్దేవా చేశారు.

2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ సర్వనాశనం చేసిందని కోటంరెడ్డి విమర్శించారు. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్  నేతృత్వంలో  రాష్ట్ర అభివృద్ధిని తిరిగి గాడిలో పెడుతోందన్న కోటంరెడ్డి..  అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం పనుల వేగవంతం, పరిశ్రమల రాకతో లక్షలాది ఉద్యోగాల సృష్టి జరుగుతోందని వివరించారు.

ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ ఒక్క సంతకంతో వేలాది మంది నిరుద్యోగులకు టీచర్ ఉద్యోగాలు కల్పిస్తే, వైకాపా నాయకులు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ ప్రక్రియపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. పేకాటలో గెలిచిన వారికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చారని వైకాపా నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. పేకాట ఆడిన ఒక్కరికైనా టీచర్ ఉద్యోగం ఇచ్చినట్లు రుజువు చేస్తే, గంటలోనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.

ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.

 గతంలో తనపై బెదిరింపులకు దిగిన బోరుగడ్డ అనిల్ కుమార్ అంశాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తనను ఫోన్లో తీవ్రంగా బెదిరించిన వ్యక్తి, ఆ తర్వాత దేవుడి స్క్రిప్ట్, ప్రకృతి దెబ్బతో తీవ్ర పరిణామాలు ఎదుర్కొన్నాడని పేర్కొన్నారు. వైకాపా నాయకులు కార్యకర్తలను, నేతలను కేవలం వాడుకుని వదిలేస్తారనే దానికి బోరుగడ్డ అనిలే ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. మాట్లాడేటప్పుడు నోరు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలని హితవు పలికారు.

రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక లోటు ఉన్నప్పటికీ.. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిరంతరాయంగా కొనసాగిస్తోందన్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రోడ్ల మరమ్మతులు, మౌలిక వసతుల కల్పన, విద్యుత్ సరఫరా క్రమబద్ధీకరణ వంటి అనేక ప్రజానుకూల చర్యలను ప్రభుత్వం చేపడుతోందన్నారు. అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే  వైసీపీ అర్థరహిత ఆరోపణలు చేస్తున్నదని  ధ్వజమెత్తారు.

ప్రజలు వైపీపీ కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిశితంగా గమనిస్తున్నారని, అభివృద్ధిని అడ్డుకునే యత్నాలు ఎప్పటికీ సాగవని హెచ్చరించారు. ప్రతిపక్షం ఇప్పటికైనా తన తీరు మార్చుకుని, రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రాయశ్చిత్త దీక్షలు ప్రారంభించాలని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Kotamreddy Sridhar Reddy, YSRCP atonement protests, Nara Lokesh's Mega DSC, Borugadda Anil Kumar, AP Alliance government

By
en-us Political News

  
జగన్ సర్కార్ సృష్టించిన భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామన్నారు.  క్యూఆర్ కోడ్, బ్లాక్‌చైన్ సాంకేతికత,  కరెన్సీ నోట్ల తరహా సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించిన ట్యాంపర్ ప్రూఫ్ పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు.
పొత్తు ధర్మానికి విరుద్ధంగా, శ్రేణుల్లో అయోమయం సృష్టించేలా వ్యవహరిస్తున్నవీరి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెండు పార్టీల హైకమాండ్ లూ రంగంలోకి దిగాయి. ఇకపై ఎలాంటి బహిరంగ విమర్శలకు దిగకూడదని, సంయమనం పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఇరు నేతలకు అధిష్ఠానాల నుంచి సీరియస్ వార్నింగ్ లు వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
రాజమహేంద్రవరంలో డాక్టర్ ప్రియాంక ఘటన అయినా.. కాశీబుగ్ట సమీపంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరవవర్మ హిట్ అండ్ రన్ కేసు అయినా.. రాజకీయంతో సంబంధం లేకుండా ఈ విషయంలో నిర్లక్ష్య డ్రైవంగ్ తో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటనగానే చూసి నిందితులకు శిక్ష పడాలనే ఎవరైనా కోరుకుంటారు. కానీ జగన్ రెడ్డి రూట్ మాత్రం సపరేట్ గా కనిపిస్తోంది.
గత కొంత కాలంగా ఆయన బీజేపీ గూటికి చేరుతారా, లేదా ఫ్యాన్ పార్టీలోనే చేరి హోం కమింగ్ అంటారా అన్న చర్చ జోరుగా సాగుతోంది.  ఆ మధ్య ఒక సారి తాను సొంత పార్టీ పెడతానంటూ ప్రకటించి సంచలనం సృష్టించిన విజయసాయి.. ఆ తరువాత ఆ విషయంలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. అయితే గత రెండు మూడు రోజులుగా.. సోషల్ మీడియాలోనూ, పొలిటికల్ సర్కిల్స్ లోనూ మళ్లీ విజయసాయి కొత్త పార్టీ వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.
వివిధ చేతివృత్తులు, సాంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న రజక, నాయిబ్రాహ్మణ, కుమ్మరి, చేనేత, మత్స్యకార, గాండ్ల,  ఇతర వెనుకబడిన కులాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉపాధి పరికరాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
కాలంతో పాటు  రాజకీయ పరిస్థితులు కూడా మారుతుంటాయి. ఒకప్పుడు కొందరిని లక్ష్యంగా చేసుకుని విసిరిన ఈ పదబంధం, ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల మధ్య ఎవరిని ఉద్దేశించాలన్న చర్చ జోరందుకుంది.  రాజకీయ విశ్లేషకులు ,  మేధావులు ఈ అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మెగా డీఎస్సీ   ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. , మెగా డీఎస్సీ పట్ల యువతలో బై అండ్ లార్జ్ హర్షం వ్యక్తం అవుతోంది. నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉందన్న భావనే సర్వత్రా గట్టిగా వ్యక్త మౌతోంది. డీఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ నిరసనలకు వ్యతిరేకంగా జగన్ ఖిల్లా అయిన కడపలో యువత రోడ్డెక్కారు.
 ఒంగోలు ఎమ్మెల్యే  దామచర్ల జనార్ధన్‌రావు, మాజీ మంత్రి,   జనసేన   సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి విభేదాలు ఇరు పార్టీల మధ్యా రాజకీయ రచ్చకు కారణమైంది.  దామచర్ల, బాలినేని మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, అలాగే ఆరోపణలు, ప్రత్యారోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.  
యువ రాజకీయనాయకుడిగా గతంలో ఎదుర్కొన్న విమర్శలను పటాపంచలు చేస్తూ, పరిపాలనా విధానాల్లో సాధించిన పరిణతి, స్పష్టమైన వ్యూహాలతో ఆయన తన రాజీకీయ ఇమేజ్‌ను పూర్తిగా ట్రాన్స్ ఫార్మ్ చేసుకున్నారని ఆ కథనం పేర్కొంంది.
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
మ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మతో కలిసి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఈ దశలో వైపీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు ఎమ్మెల్సీ దంపతులను, పలువురు కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.